భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ భారతదేశ తూర్పు తీర ప్రాంతం వెంట భువనేశ్వర్ - విశాఖపట్నం మధ్య నడిచే సూపర్‌ఫాస్ట్ రైలు. ఇది 2001లో పలాస నుండి భువనేశ్వర్ వరకు ప్రారంభించబడి శ్రీకాకుళం, విశాఖపట్నం వరకు విస్తరించబడింది. గతంలో ఇది 18411/18412గా నంబరు చేయబడగా, 2016 సంవత్సరంలో 22819/22820గా మార్చబడింది.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | ఆంధ్రప్రదేశ్, ఒడిశా | ||||
తొలి సేవ | 2001 | ||||
ప్రస్తుతం నడిపేవారు | తూర్పు తీర రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | విశాఖపట్నం | ||||
ఆగే స్టేషనులు | 25 | ||||
గమ్యం | భువనేశ్వర్ | ||||
ప్రయాణ దూరం | 444 కి.మీ. (276 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 7 గంటల 45 నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | ప్రతిరోజు | ||||
రైలు సంఖ్య(లు) | 22819 / 22820 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | రెండవ సిట్టింగ్, జనరల్ అన్‌రిజర్వ్డ్ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
చూడదగ్గ సదుపాయాలు | స్టాండర్డ్ భారతీయ రైల్వేలు కోచ్‌లు | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | రేక్ భాగస్వామ్యం 18511/18512 భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ | ||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 110 km/h (68 mph) maximum 56 km/h (35 mph), including halts | ||||
|
చరిత్ర
మార్చు2001లో ప్రారంభోత్సవం సందర్భంగా, ఈ భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్, పలాసల మధ్య వారానికి 5 రోజులు నడిచింది.[1] ఆ తర్వాత 2002 రైల్వే బడ్జెట్‌లో దీనిని శ్రీకాకుళం వరకు పొడిగించారు.[2] చివరకు 2004 రైల్వే బడ్జెట్‌లో విశాఖపట్నం వరకు పొడిగించబడింది.[3] ఆ తర్వాత దాని ఫ్రీక్వెన్సీని వారానికి 6 రోజులకు పెంచారు.[4] 2012లో ఇది ప్రతిరోజుకు మార్చబడింది.[5]
ఇందులో 1 సెకండ్ సిట్టింగ్, 7 జనరల్ సెకండ్ క్లాస్, భువనేశ్వర్ నుండి విశాఖపట్నం వరకు రెండు గార్డు కమ్ లగేజ్ వ్యాన్‌ల కోచ్ కూర్పు ఉంటుంది.
కోచ్ లు
మార్చులోకో | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
---|---|---|---|---|---|---|---|---|---|---|
ఎస్ఎల్ఆర్ | డి1 | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | ఎస్ఎల్ఆర్ |
విశాఖపట్నం నుండి భువనేశ్వర్ వరకు కోచ్ కూర్పు
10 | 9 | 8 | 7 | 6 | 5 | 4 | 3 | 2 | 1 | లోకో |
---|---|---|---|---|---|---|---|---|---|---|
ఎస్ఎల్ఆర్ | డి1 | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | ఎస్ఎల్ఆర్ |
లోకో
మార్చుఇది విశాఖపట్నం / విజయవాడ / అసన్‌సోల్ లోకో షెడ్‌ల WAM-4 ద్వారా లాగబడుతుంది.
మూలాలు
మార్చు- ↑ "Bbs-Palasa intercity".
- ↑ "Extension to Srikakulam".
- ↑ "Extension to Visakhapatnam".
- ↑ "Vskp-Bbs intercity to run 6 days a week". The Hindu. 2011-06-30. Archived from the original on 10 November 2012.
- ↑ "Vskp-Bbs intercity to daily".