తెలంగాణ గేట్‌వే

తెలంగాణ గేట్‌వే అనేది తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండలంలోని కండ్లకోయి గ్రామంలో నిర్మించబోతున్న ఐటీ పార్కు. 10.11 ఎకరాలల్లో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.250 కోట్ల నిధులతో రెండు ఐటీ టవర్లతో ఈ గేట్‌వే నిర్మితమవుతోంది.[1] నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల వారికి ఈ ఐటీ పార్క్ఉ వల్ల ఉపాధి అవకాశాలు అందుతాయి.

తెలంగాణ గేట్‌వే
తెలంగాణ గేట్‌వే ఐటీ పార్కుకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి కేటీఆర్
సాధారణ సమాచారం
రకంఐటీ పార్కు
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ
చిరునామాకండ్లకోయి, మేడ్చల్ జిల్లా, తెలంగాణ
నిర్మాణ ప్రారంభం2022, ఫిబ్రవరి 17
వ్యయం250 కోట్లు
యజమానితెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ
సాంకేతిక విషయములు
నేల వైశాల్యం600,000 sq ft (56,000 m2)

ప్రారంభం మార్చు

ఈ ఐటి పార్కుకు 2022, ఫిబ్రవరి 17న తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశాడు. ఈ కార్యక్రమంలో కార్మిక-ఉపాధి శాఖామంత్రి శ్రీ సిహెచ్ మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబీపూర్ రాజు, అధికారులు పాల్గొన్నారు.[2]

రూపకల్పన మార్చు

హైదరాబాదు నగరానికి అన్నివైపులా ఐటీరంగం అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా అవుటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఈ ఐటీ పార్కు నిర్మాణం చేపడుతున్నారు. అత్యంత ఎత్తైన కొత్త ఐటీ పార్కు ఏర్పాటుకోసం అనేక ప్రాంతాలలో స్థలాలను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం, కండ్లకోయ జంక్షన్‌ సమీపంలో స్థలాన్ని ఎంపిక చేసింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇక్కడికి 45 నిమిషాల్లో చేరుకునే సౌకర్యంతోపాటు రహదారుల అనుసంధానం వంటివి సానుకూలంగా ఉన్నాయి.[3][4]

పార్కు వివరాలు మార్చు

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ పరిధిలో ఏర్పాటు చేయబడుతున్న పార్కులో 150 కంపెనీలకు స్థానం కలిపించేలా ఈ ఐటీ టవర్స్‌ నిర్మించబడుతున్నాయి. ఈ పార్కులో సమావేశ మందిరాలు, భారీ పార్కింగు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయే సంస్థలతో దాదాపు 25 వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు రానుండగా, పరోక్షంగా కూడా వేలాదిమందికి ఉపాధి లభించనుంది.[5]

మూలాలు మార్చు

  1. telugu, NT News (2022-02-17). "తెలంగాణ గేట్‌ వే.. కండ్లకోయ ఐటీ పార్క్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన". www.ntnews.com. Archived from the original on 2022-02-17. Retrieved 2022-02-17.
  2. telugu, NT News (2022-02-17). "ఉత్త‌ర హైద‌రాబాద్‌కు ఈ ఐటీ పార్కు ఆరంభం మాత్ర‌మే : మంత్రి కేటీఆర్". Archived from the original on 2022-02-17. Retrieved 2022-02-17.
  3. Telugu, TV9 (2022-02-17). "Gateway IT Park: తెలంగాణకు మరో మణిహారం.. కండ్లకోయ ఐటీ పార్క్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌." TV9 Telugu. Archived from the original on 2022-02-17. Retrieved 2022-02-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "TELANGANA GATE WAY: కండ్లకోయలో రూ. 100 కోట్లతో భారీ ఐటీ పార్కు". ETV Bharat News. 2022-02-17. Archived from the original on 2022-02-17. Retrieved 2022-02-17.
  5. telugu, NT News (2022-02-16). "250 కోట్లతో ఐటీ టవర్స్‌". www.ntnews.com. Archived from the original on 2022-02-17. Retrieved 2022-02-17.

వెలుపలి లంకెలు మార్చు