మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా

తెలంగాణలోని జిల్లా
(మేడ్చల్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]

మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా
తెలంగాణ పటంలో మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా స్థానం
తెలంగాణ పటంలో మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంమేడ్చల్
మండలాలు15
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలు1 (మల్కాజ్‌గిరి)
 • శాసనసభ నియోజకవర్గాలు9
విస్తీర్ణం
 • మొత్తం1,084 km2 (419 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం24,40,073
 • సాంద్రత2,300/km2 (5,800/sq mi)
 • విస్తీర్ణం
22,30,245
జనాభా వివరాలు
 • అక్షరాస్యత82.49
 • లింగ నిష్పత్తి957
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుTS–08 [1]
ప్రధాన రహదార్లు3 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు
జాలస్థలిఅధికారిక జాలస్థలి
మేడ్చల్-మల్కాజగిరి జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం

2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఏర్పడిన ఈ కొత్త జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (మల్కాజ్‌గిరి, కీసర), 14 రెవిన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 6తో కలుపుకొని 162 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.[2] ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే. జిల్లా పరిపాలనా కేంద్రం షామీర్‌పేట్.[3] షామీర్‌పేట్ మండలం, అంతయపల్లి గ్రామంలో నిర్మించిన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను 2022 ఆగస్టు 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.

మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా

స్థానిక స్వపరిపాలనసవరించు

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

విద్యాసంస్థలుసవరించు

 
మేడ్చల్ రైల్వే స్టేషన్

కూకట్‌పల్లిలో జె.ఎన్.టి.యు కళాశాల, బాచుపల్లిలో ఇంజనీరింగ్, టెక్నాలజీ పరిశోధన సంస్థ, దుండిగల్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంస్థ,దూలపల్లి లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఉన్నాయి

జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాలుసవరించు

జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

జిల్లాలోని పార్లమెంటు నియోజక వర్గాలుసవరించు

జిల్లాలోని మండలాలుసవరించు

  1. మేడ్చల్ మండలం
  2. షామీర్‌పేట్ మండలం
  3. కీసర మండలం
  4. కాప్రా మండలం *
  5. ఘట్‌కేసర్ మండలం
  6. మేడిపల్లి మండలం *
  7. ఉప్పల్ మండలం
  8. మల్కాజ్‌గిరి మండలం
  9. అల్వాల్ మండలం *
  10. కుత్బుల్లాపూర్ మండలం
  11. దుండిగల్ గండిమైసమ్మ మండలం *
  12. బాచుపల్లి మండలం *
  13. బాలానగర్ మండలం
  14. కూకట్‌పల్లి మండలం *
  15. మూడుచింతలపల్లి మండలం *

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (7)

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  2. 2.0 2.1 "Medchal−Malkajgiri district" (PDF). New Districts Formation Portal. Government of Telangana. Archived from the original (PDF) on 30 November 2016. Retrieved 22 April 2019.
  3. "మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ప్రొఫైల్ (అధికార వెబ్సైట్)". Archived from the original on 2017-03-23. Retrieved 2019-04-25.

వెలుపలి లింకులుసవరించు