తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ
(తెలంగాణ పర్యాటక శాఖ నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఆంగ్లం: Telangana State Tourism Development Corporation) తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంస్థ.[1] తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నుండి విడిపోయింది.[2][3]

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ
సంస్థ అవలోకనం
స్థాపనం జూన్ 2 , 2014
అధికార పరిధి తెలంగాణ, భారతదేశం
ప్రధాన కార్యాలయం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/ పటేల్ రమేశ్ రెడ్డి, చైర్మన్
మాతృ శాఖ పర్యాటక
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్

లక్ష్యాలు

మార్చు

తెలంగాణ లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి మౌలిక, ప్రయాణ ఖర్చులు, ఇతర సౌకర్యాలు అందిస్తుంది. అంతేకాకుండా పర్యాటక ప్రాంతాలను గుర్తించి, వాటికి ప్రచారం కూడా కలిపిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఐపిఎస్ రిటైర్డ్, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన పేర్వారం రాములును 2015, మార్చి 18న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మొదటి చైర్మన్ గా నియమించారు.[4][5][6]

ఈ సంస్థ ప్రధాన జాతీయ రహదారులపై హరిత హోటల్స్ పేరిట అన్ని పర్యాటక ప్రాంతాలలోదాదాపు 33 హోటల్స్ ను కలిగిఉంది.

ప్రత్యేక ఆకర్షణలు

మార్చు

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వివిధ సాహస, పర్యావరణ పాజెక్టులపై దృష్టి సారించింది. భువనగిరి కోట వద్ద సాహస క్లబ్బులు ఏర్పాటుచేసి, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం అడవిలో సాహస జీప్ రైడ్ లను నిర్వహిస్తోంది. ఈ సంస్థ 95 చిన్న, పెద్ద పడవలలను కలిగి ఉంది.[7] ఇతర పర్యాటకం కార్పొరేషన్లతో పోల్చితే ఇది వివిధ సరస్సులు, రాష్ట్రం యొక్క ముఖ్య నదులలో నీటి క్రీడల పారాసైలింగ్ (హుస్సేన్ సాగర్) ను నిర్వహిస్తుంది. అమెరికన్ ఫోన్ టూన్ పడవలు విశ్రాంతి క్రూజ్ కోసం బాగా ప్రాచుర్యం పొందాయి. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోల్కొండ కోట, శిల్పారామం, తారామతి బారాదరి మొదలైన ప్రాంతాలలో సౌండ్, లైటింగ్ ప్రదర్శనలను అందిస్తుంది.[8]

పురస్కారాలు

మార్చు
  • ఉత్తమ పర్యాటక స్నేహపూర్వక గోల్ఫ్ కోర్సు వర్గం కింద నేషనల్ పర్యాటకం అవార్డ్ 2013-14.
  • 2022లో తెలంగాణ పర్యాటకరంగం ఏకంగా నాలుగు జాతీయ స్థాయి అవార్డులు సాధించి, నాలుగు అవార్డులు గెలుచుకొన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. పర్యాటకరంగం సమగ్రాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది. 2022 సెప్టెంబరు 27న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఇండియా పర్యాటకం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ చేతులు మీదుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ అవార్డులు అందుకున్నాడు. కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.[9][10]

బడ్జెట్ వివరాలు

మార్చు
  • 2014-15 బడ్జెటు'లో ఈ శాఖకు 60 కోట్ల రూపాయలు కేటాయించబడింది.
  • 2016-17 బడ్జెటులో ఈ శాఖకు 50 కోట్ల రూపాయలు కేటాయించబడింది.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "TS GO No.1-Establishment of TSTDC".
  2. "Huge challenges ahead for new Telangana tourism corporation". timesofindia.indiatimes.com. 2014-05-09. Retrieved 2014-06-04.
  3. "Telangana tourism information". telanganastateinfo.com. Archived from the original on 2016-12-22. Retrieved 2016-12-27.
  4. "First Chairman of TELANGANA TOURISM". Archived from the original on 2016-03-06. Retrieved 2016-12-27.
  5. తెలుగు గ్లోబల్. "తెలంగాణ పర్యాటక సంస్థ ఛైర్మన్‌గా పేర్వారం". teluguglobal.in. Retrieved 27 December 2016.[permanent dead link]
  6. తెలంగాణ రాష్ట్ర అధికారిక జాలగూడు. "Telangana Tourism". www.telanganastateofficial.com. Archived from the original on 18 మార్చి 2016. Retrieved 3 February 2017.
  7. "TSTDC Special Attractions". Archived from the original on 2014-08-08. Retrieved 2016-12-27. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. "Heritage tour to start in Hyderabad". Retrieved 2014-07-02.
  9. telugu, NT News (2022-09-28). "ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ". Namasthe Telangana. Archived from the original on 2022-09-28. Retrieved 2022-10-10.
  10. "తెలంగాణ పర్యాటక శాఖకు జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులు". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-09-28. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-10.