తెలంగాణ యాస
తెలుగు భాషలో ఉన్న పలు యాసలలో తెలంగాణ యాస ఒకటి. తెలంగాణ కు చెందిన జిల్లాలతో ప్రాథమికంగా మాట్లాడబడినను, ఇతర ప్రదేశాలలో కూడా ఈ యాస ఉపయోగంలో ఉన్నది. తెలంగాణ యాస పై ఎక్కువగా ఉర్దూ ప్రభావం ఉన్ననూ, మరల ప్రత్యేకించి హైదరబాదీ ఉర్దూ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. తెలంగాణ యాసకు ఉన్న ఈ ప్రత్యేక శైలివలన ఈ యాస బహు ప్రాచుర్యం పొందినది. ముఖ్యంగా తెలుగు సినిమాలో ఈ యాసకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. కోట శ్రీనివాసరావు ఈ యాసకు పెట్టింది పేరు. అడపాదడపా బాబు మోహన్, విజయశాంతి వంటి నటులు కూడా ఈ యాసను ప్రయోగించి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టారు. కొండొకచో అగ్ర హీరోలు ఇతర కమెడియన్లు కూడా ఈ యాసలో మాట్లాడి ప్రేక్షకుల చేత థియేటర్ లలో ఈలలు వేయించుకొన్నారు.
యాస
మార్చు- భీ - కూడా
- గది - అది
- గిది - ఇది
- గట్ల - అలా (అట్లా)
- గిట్ల - ఇలా (ఇట్లా)
- ఇగో, ఇంగో - ఇదుగో
- అగో - అదుగో
- పరేషానీ - తత్తరపడటం, ఇబ్బంది పడటం, బెంబేలు పడటం
- నెత్తినొప్పి - తలనెప్పి
- దిమాక్ ఖరాబ్ - పిచ్చి పట్టటం
- దేడ్ - ఒకటిన్నర్ర
- దేడ్ దిమాక్ - అర్థం చేసుకోలేని వాడు
- చారనా - పావలా (నాలుగు అనాలు)
- ఆఠనా - అర్ధ రూపాయి (ఎనిమిది అనాలు)
- బారనా - ముప్పావలా (పన్నెండు అనాలు)
- ఉల్టా, ఉల్టాపల్టా - తల్లక్రిందులు
- ఏడ - ఎక్కడ
- ఆగమాగం - తొందర పడటం
- అంత/ఇంత/ఎంత గనం - అంత/ఇంత/ఎంత ఎక్కువగా (గనం - బహుశా ఘనం అయ్యి ఉండవచ్చు)
- కోపం చెయ్యి - కోప్పడు
- బుక్కటం - మెక్కటం
- పైసల్ - డబ్బులు (హిందీ పైసే)
- ఉరుకు - పరిగెత్తు
- సమఝ్ అయితున్నదా? - అర్థం అవుతోందా?
- పొద్దుగాల - ప్రొద్దుట
- పొద్దుమీకి - సాయంత్రం
- జల్దీ - త్వరగా
- భై, బే - సోదరుడు, అన్న, తమ్ముడు (భాయి)
- సాలెగాడు - బావమరిది
- పోరి - అమ్మాయి
- పోరడు/పోరగాడు - అబ్బాయి
- హుషార్ - తెలివిగల (హింది: హోషియార్)
- ఖతర్నాక్ - ప్రమాదకరం
- ఏక్ దం - ఒక్క ఉదుటున (హిందీ లో దం అంటే శ్వాస్త, ఒకే శ్వాసలో అని అర్థం)
- దం - ఆయాసం
- చక్కర్ రావటం - కళ్ళు తిరగటం (హిందీ లో కూడా చక్కర్ అంటే కళ్ళు తిరగటం)
- గోకరకాయ - గోరుచిక్కుడు
- పుక్కట్లో - ఉచితంగా
- పెడ్లిపిల్లా - వధువు
- పెండ్లిపిలగాడు - వరుడు
కొన్ని సినిమా సంభాషణలు
మార్చుజయమ్ము నిశ్చయమ్మురా
మార్చు- కోట: ఏం రోవ్ రామ్మూర్తి గట్ల గుడ్లగూబ లెక్క జూస్తున్నావ్. నీ లెక్క ఫాల్తు సైన్మల్ దీస్తననుకున్నావ్ రా? సూప్పర్ ఇస్టార్ కృష్ణను వెట్టి జబ్బర్దస్త్ సైన్మ దీస్త బిడ్డా...ఆ!!!
సై
మార్చు- నల్లబాలు (వేణుమాధవ్): అబె వో ఏం రా ఉర్కుతుర్రు. మా కి కిర్ కిరి పెద్ద పెద్ద అక్షరాలతో రాయుర్రి బే, దేత్తడి పోచమ్మ గుడి. నల్ల బాలు, నల్ల త్రాచు లెక్క.
కిక్
మార్చు- జయప్రకాష్ రెడ్డి: ఏమయిందిరా, అచ్చిర్రు, కొట్టుకుర్రు, బోయిండ్రు (అదిలాబాద్ జిల్లాలో వచ్చారు ను అచ్చిర్రు అంటారు)
దూకుడు
మార్చు- మహేష్ బాబు: కళ్ళున్నోడు ముందు మాత్రమే జూస్తడు. దిమాక్ ఉన్నోడు దునియ మొత్తం జూస్తడు.
- మహేష్ బాబు: డిపార్ట్ మెంట్ మే అపన్ కో క్యా బోల్తే మాలూం? బబ్బర్ షేర్!! (డిపార్ట్ మెంట్ లో నన్ను ఏమంటారో తెలుసా? బెబ్బులి పులి!!!)