తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ
తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ, అనేది తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులకు (దివ్యాంగులకు) సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించడంకోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ.
స్థాపన | 2014, జూన్ 4 |
---|---|
రకం | తెలంగాణ ప్రభుత్వ సంస్థ |
కేంద్రీకరణ | వికలాంగులకు సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించడం |
కార్యస్థానం | |
ముఖ్యమైన వ్యక్తులు | కొప్పుల ఈశ్వర్ (వికలాంగుల సంక్షేమ శాఖామంత్రి) కే వాసుదేవరెడ్డి (చైర్మన్) |
మాతృ సంస్థ | తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖ |
జాలగూడు | అధికారిక వెబ్సైటు |
ఏర్పాటు
మార్చురాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో హైదరాబాదులో ప్రధాన కార్యాలయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ నుండి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ విడిపోయి 2014 జూన్ 2 నుండి పనిచేయడం ప్రారంభించింది.[1]
లక్ష్యాలు
మార్చు- వికలాంగుల పునరావాసం/జీవన పరిస్థితుల మెరుగుదల కోసం వివిధ సంక్షేమ పథకాలను రూపొందించడం, ప్రోత్సహించడం, అమలు చేయడం
- వికలాంగులకు సహాయాలు, ఉపకరణాలు, సహాయక పరికరాలు, ఆర్థిక, సాంకేతిక సహాయం అందించడం
- భారత ప్రభుత్వం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర ఛానలైజింగ్ ఏజెన్సీగా వ్యవహరించడం
- అర్హులైన వికలాంగులకు వారి ఆర్థిక పునరావాసం కోసం ఆర్థిక సహాయం అందించడం, రుణ మొత్తాల వినియోగాన్ని పర్యవేక్షించడం
సేవలు
మార్చు- దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్స్‌లో 5 శాతం రిజర్వేషన్, విద్య-ఉపాధి పథకాల్లో 5 శాతం, ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు.[2]
- బ్యాటరీ ట్రై సైకిళ్ళు, వీల్ చైర్లు, స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ అవయవాలు మొత్తం 14 రకాల వస్తువులు అందిస్తున్నారు.
- 4 లక్షల 92 వేల 680 మంది వికలాంగులకు నెలకు 3వేల 16 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు అందిస్తున్నారు.
కార్యకలాపాలు
మార్చుఈ సంస్థ ఆధ్వర్యంలో 2021 ఏప్రిల్ 16న హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో 22న తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదుగా దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు అందించబడ్డాయి. 24 కోట్ల 34 లక్షల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా చదువుకునే దివ్యాంగ విద్యార్థుల కోసం 300 ల్యాప్‌టాప్స్, 400 స్మార్ట్‌ఫోన్స్, 1000ద్విచక్ర వాహనాలు, 650 బ్యాటరీ వీల్ ఛైర్స్ 650 అందించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కే వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.[3]
సభ్యులు
మార్చుతెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌గా కే వాసుదేవరెడ్డి 2017లో నియమితుడయ్యాడు.[4] ఆతని పదవి కాలాన్ని 2020 సెప్టెంబరులో రెండోసారి ఏడాది, 2021 డిసెంబరు 19న మూడోసారి రెండేండ్లు పొడగించగా[5] 2021 డిసెంబరు 22న మూడోసారి సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు.[6]
మూలాలు
మార్చు- ↑ "Telangana Vikalangula Co-operative Corporation". Archived from the original on 2022-06-15. Retrieved 2022-06-22.
- ↑ "దివ్యాంగులకు 5 శాతం 'డబుల్' ఇళ్లు". Sakshi. 2021-01-26. Archived from the original on 2021-04-16. Retrieved 2022-06-22.
- ↑ Velugu, V6 (2021-04-16). "తెలంగాణ కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-22. Retrieved 2022-06-22.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Deccan Chronicle (29 May 2017). "Telangana govt appoints chairpersons to 8 state-run corporations" (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2022. Retrieved 2022-06-22.
- ↑ Namasthe Telangana (17 December 2021). "వాసుదేవరెడ్డి పదవీకాలం పొడిగింపు". Archived from the original on 18 December 2021. Retrieved 2022-06-22.
- ↑ Eenadu (22 December 2021). "ముగ్గురు చైర్మన్ల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 30 December 2021. Retrieved 2022-06-22.
బయటి లింకులు
మార్చు- అధికారిక వెబ్సైటు Archived 2022-06-15 at the Wayback Machine