కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 2019 నుండి ఎస్సీ, గిరిజన, బిసీ, మైనారిటీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్నాడు.

కొప్పుల ఈశ్వర్

తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి
పదవీ కాలము
2019 - ప్రస్తుతం
నియోజకవర్గము ధర్మపురి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1959-04-20) 20 ఏప్రిల్ 1959 (వయస్సు 61)
గోదావరి ఖని
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
సంతానము నందిని

వ్యక్తిగత జీవితంసవరించు

ఈయన 1959, ఏప్రిల్ 20న గోదావరిఖనిలో జన్మించాడు. బీఏ వరకు అభ్యసించి సింగరేణిలో బొగ్గుగని కార్మికుడిగా జీవనం ప్రారంభించాడు.[1]

రాజకీయ జీవితంసవరించు

1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (1994)లో టీడీపీ నుండి పోటిచేసే, స్వతంత్ర అభ్యర్థి మాలెం మల్లేశం చేతిలో 15,319 ఓట్లతో ఓడిపోయాడు. 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2004)లో తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్‌పై పోటిచేసి టీడీపీ అభ్యర్థి మాలెం మల్లేశం పై 56,563 ఓట్లతో గెలుపొంది, 2004లో తొలిసారిగా మేడారం ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్ళాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పదవికి రాజీనామా సమర్పించి 2008లో జరిగిన ఉప ఎన్నికలలో పోటీచేసి విజయం సాధించాడు. నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో 2009లో కొత్తగా ఏర్పడిన ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జిల్లా పరిషత్తు చైర్మెన్ అయిన ఎ.లక్ష్మణ్ కుమార్‌పై విజయం సాధించాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మరోసారి రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికలలో మళ్ళీ గెలుపొందాడు. 2014 ఎన్నికలలో మళ్ళీ తెరాస తరఫున ధర్మపురి నుంచి గెలిచాడు.[2] 2014, 2018 మధ్య శాసనసభలో ఛీఫ్‌విప్‌గా పనిచేసారు.

2018లో ఎన్నికలలో ఇదే నియోజకవర్గం నుండి లక్ష్మణ కుమార్‌పై 441 వోట్ల తేడాతో విజయం సాధించి, 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో షెడ్యూల్డ్ కులాలు, ఆదివాసీలు, బలహీనవర్గాల సంక్షేమ మంత్రిగా స్థానం సంపాదించాడు.[3][4][5]

మూలాలుసవరించు

  1. నమస్తే తెలంగాణ దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 05-04-2014
  2. "కొప్పులకు మొదటిసారి పట్టం." నమస్తే తెలంగాణ. Retrieved 20 February 2019. CS1 maint: discouraged parameter (link)
  3. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019. CS1 maint: discouraged parameter (link)
  4. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019. CS1 maint: discouraged parameter (link)
  5. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019. CS1 maint: discouraged parameter (link)