తెలగాయ పాలెం , గుంటూరు జిల్లా, కాకుమాను మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

తెలగాయ పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
తెలగాయ పాలెం is located in Andhra Pradesh
తెలగాయ పాలెం
తెలగాయ పాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°03′11″N 80°23′53″E / 16.053°N 80.398°E / 16.053; 80.398
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కాకుమాను
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ కోదండరామాలయం:- ఈ గ్రామంలో రు. 40 లక్షలతో నూతనంగా నిర్మించిన సీతా, లక్ష్మణ, హనుమత్సమేత శ్రీ కోడండరామస్వామివారి ఆలయంలో, 2014, జూన్-9, సోమవారం నాడు, విగ్రహ ప్రతిష్ఠ్ఝ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేదపండితులు విష్వక్సేనపూజ, పుణ్యావహం, ఉక్తహోమం, రత్నన్యాసం, యంత్ర ప్రతిష్ఠలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బింబప్రతిష్ఠ, ధ్వజప్రతిష్ఠ, జీవకళాన్యాసం, ధేనుదర్శనం, స్వామివార్ల దర్శనం చేయించారు. పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేసారు. ఈ సందర్భంగా వేలాదిమందికి అన్నదానం నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

బండ్ల దినేష్:- ఈ గ్రామానికి చెందిన వీరి తండ్రి బండ్ల శివశంకరప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఉన్నతోద్యోగి. తల్లి సువర్ణరాణి, వరంగల్లో సబ్-కలెక్టరుగానూ, ఒడిషా రాష్ట్రంలో కలహండి జిల్లా కలెక్టరుగానూ పనిచేసారు. శ్రీ దినేష్, ఎం.జి.ఐ.టి.కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో బి.టెక్., చదివినారు. అనంతరం విప్రోలో ఉద్యోగంలో చేరినారు. తల్లిదండ్రుల ప్రాత్సాహంతో సివిల్స్ పరీక్షలు వ్రాయసాగినారు. వీరు ఇటీవల వెలువడిన ఆ పరీక్షలలో ఐదవసారి 270వ ర్యాంక్ సాధించారు.

మూలాలు మార్చు