తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2018)

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.[1]

సాహితీ పురస్కారాలు (2018)
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలు
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2017
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2017సాహితీ పురస్కారాలు (2018)2019

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[2]

పురస్కార గ్రహీతలు మార్చు

2018 సంవత్సర సాహితీ పురస్కారానికి ఎంపిక చేసిన 10 ఉత్తమ గ్రంథాల వివరాలు 2021 అక్టోరు 21న ప్రకటించబడ్డాయి.[3] 2021, అక్టోబరు 29వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[4] ఈ కార్యక్రమంలో మణిపూర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తిరుపతిరావు, ఆచార్య కొలకలూరి ఇనాక్, మేడ్చెల్ జిల్లా అదనపు కలెక్టర్ డా. ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.[5]

క్రమ

సంఖ్య

గ్రంథం పేరు గ్రంథకర్త పేరు ప్రక్రియ దాత
1 శ్రీకృష్ణదేవరాయ విజయప్రబంధము మొవ్వ వృషాద్రిపతి పద్య కవిత
2 కల ఇంకా మిగిలే ఉంది కాంచనపల్లి గోవర్ధన్ రాజు వచన కవిత
3 పాటల పల్లకి సామిలేటి లింగమూర్తి బాల సాహిత్యం
4 ఖాకీకలం రావులపాటి సీతారాంరావు కథానిక
5 కొంగవాలు కత్తి డా. గడ్డం మోహన్ రావు కథా సంపుటి, నవల
6 సీమకథ అస్తిత్వం డా. కిన్నెర శ్రీదేవి నవల, సాహిత్య విమర్శ
7 అశ్శరభ శరభ ఎస్. నారాయణబాబు నాటకం/నాటిక
8 అశుద్ధ భారత్ కె. సజయ అనువాదం
9 హైదరాబాద్ నుంచి తెలంగాణ దాకా లక్ష్మణరావు వచన రచన
10 రేలపూలు సమ్మెట ఉమాదేవి రచయిత్రి ఉత్తమ గ్రంథం

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 2023-01-26.
  2. "తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాలకు సూచనలు". EENADU. 2022-07-31. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-27. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-08-06 suggested (help)
  3. "తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాల ప్రకటన". EENADU. 2021-10-22. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.
  4. "Best Novel Award: కొంగవాలు కత్తి నవలను ఎవరు రచించారు?". Sakshi Education. 2021-10-23. Archived from the original on 2021-10-27. Retrieved 2023-01-27.
  5. "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రదానం". EENADU. 2021-10-30. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.