తేలప్రోలు (తెనాలి)

(తేలప్రోలు(తెనాలి) నుండి దారిమార్పు చెందింది)

తేలప్రోలు గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

తేలప్రోలు
—  రెవెన్యూయేతర గ్రామం  —
తేలప్రోలు is located in Andhra Pradesh
తేలప్రోలు
తేలప్రోలు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°15′48″N 80°39′29″E / 16.263256°N 80.658061°E / 16.263256; 80.658061
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తెనాలి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ వేజెండ్ల రోశయ్య
పిన్ కోడ్ 522201
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామంలో మౌలిక వసతులు

మార్చు

త్రాగునీటి సౌకర్యం:- కొల్లిపర మండలం వల్లభాపురం ఓవర్ హెడ్ రెగ్యులేటర్ నుండి పైపులైనుల ద్వారా గుడివాడ, ఎరుకలపూడి, తేలప్రోలు గ్రామాలకు మంచినీటి సరఫరా కొరకు 12 కోట్ల రూపాయల వ్యయంతో, ఏర్పాట్లు జరుగుచున్నవి. 12/2015 చివరిలోగా పూర్తి కాగలవని అంచనా.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ వేజెండ్ల రోశయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. 2014, జూలై-24న కఠెవరంలో జరిగిన తెనాలి మండల సర్పంచుల సంఘం సమావేశంలో వీరిని మండల సర్పంచుల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.

గ్రామ ప్రముఖులు

మార్చు

2013 సెప్టెంబరు 30 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బయ్యారపు ప్రసాదరావు గారు ఈ గ్రామంలోనే, వా రి మాతామహుల ఇంట, 1955 సెప్టెంబరు-11 నాడు జన్మించారు. వీరి తండ్రి శ్రీ శ్రీనివాసరావు, జిల్లాలోనే పోలీస్ శాఖలోనే, కానిస్టేబులుగా అనేక ప్రాంతాలలో పనిచేసి తెనాలిలో పదవీ విరమణ చేశారు. వీరి తల్లి శ్రీమతి సుశీలమ్మ.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)