దగ్గుమళ్ళ ప్రసాదరావు

దగ్గుమళ్ళ ప్రసాదరావు భారతదేశానికి చెందిన మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చిత్తూరు నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1]

దగ్గుమళ్ళ ప్రసాదరావు
దగ్గుమళ్ళ ప్రసాదరావు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు ఎన్.రెడ్డప్ప
నియోజకవర్గం చిత్తూరు

వ్యక్తిగత వివరాలు

జననం 1964
దగ్గుమళ్ల, చినగంజాం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
నివాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

దగ్గుమళ్ళ ప్రసాదరావు ఇన్‌కమ్ ట్యాక్స్ (ఆదాయపు పన్ను) విభాగంలో జాయింట్ కమిషనర్‌గా పని చేసి 2019 పదవి విరమణ చేశాడు.[2] అయన రాధే కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా నిర్మాణ రంగంలో ఉన్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎన్.రెడ్డప్పపై 2,20,479 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయనకు ఈ ఎన్నికలలో 7,78,071 ఓట్లు రాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అభ్యర్థి ఎన్‌ రిడప్పకు 5,57,592 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జగపతికి 30,150 ఓట్లు వచ్చాయి.[3][4][5]

ఆయన 2024 జూన్ 22న లోక్‌సభలో  తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమితుడయ్యాడు.[6]

మూలాలు

మార్చు
  1. The Indian Express (8 June 2024). "Meet new TDP MPs: first-timers to veterans, political heirs to YSRCP turncoats, ex-officers to industrialists" (in ఇంగ్లీష్). Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  2. India Today (13 July 2024). "Ex-administrators | From desk to dais" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Chittoor". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  4. EENADU (13 June 2024). "'చంద్ర'కాంతి... వైకాపాకు విశ్రాంతి". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  5. EENADU (5 June 2024). "ఏడింటిలోనూ దగ్గుమళ్లదే హవా". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  6. Andhrajyothy (23 June 2024). "టీడీపీపీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు". Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.