దత్త తమనే

స్వాతంత్ర్య సమరయోధుడు

దత్తాత్రేయ బాలకృష్ణ తమనే (దత్త తమనే) (1912-2014) మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ గాంధేయ వాది.

దత్తాత్రేయ బాలకృష్ణ తమనే (దత్త తమనే)
జననం13 ఏప్రిల్ 1913
మరణం6 ఏప్రిల్ 2014
జాతీయతభారతీయుడు
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు

ప్రారంభ జీవితం

మార్చు

తమనే మహారాష్ట్రలోని రత్నగిరిలో ఒక పేద కుటుంబంలో 13 ఏప్రిల్, 1913 న జన్మించాడు. అతను చంద్రసేనియా కాయస్థ ప్రభు సభ్యుడు. ముంబైలోని విజెటి సెంట్రల్ దాదర్ ఇనిస్టిట్యూట్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు, అతను భారత స్వాతంత్ర్య ఉద్యమం పట్ల ప్రేరణ పొందాడు. 1934 లో తన పూర్తి సమయాన్ని కాంగ్రెస్ సభ్యుడిగా పనిచేయడానికి కేటాయించాడు.[1]

రాజకీయాలలో

మార్చు

అతను థానేలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో పోలీసులు తలపై కొట్టి జైల్లో బంధించారు. సైమన్ కమిషన్‌పై కూడా ఆయన నిరసన తెలిపాడు. సంఘ సంస్కర్తగా అతను గిరిజనుల అభ్యున్నతికి కూడా కృషి చేశాడు. థానే జిల్లాలోని గిరిజన ప్రాంతమైన ఖరాగావ్ ప్రాంతంలో తిరిగి, స్థానికులతో నివసించి, అక్కడి సమస్యలను అధ్యయనం చేశాడు. వారి హక్కుల కోసం పోరాడాడు. వారి అభ్యున్నతికి కృషి చేశాడు. గిరిజనుల అభ్యున్నతికి తోడ్పడినందుకు గానూ అతను "ఆదివాసీ సేవా అవార్డు" అందుకున్నాడు.

అతను పార్లమెంటు ఉభయ సభలలో సభ్యుడు. అతను 1983 లో క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నాడు. 2012లో అతన్ని 100 వ పుట్టినరోజు సందర్భంగా అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ సత్కరించారు.[2]

సాహిత్యంలో

మార్చు

దత్త తమనే నిష్ణాతుడైన పాఠకుడు, రచయిత, ఆలోచనాపరుడు. అతను మరాఠీ, ఆంగ్ల సాహిత్యంలో పండితుడు. ఇతని కలిచా గౌడ చిన్న కథల సేకరణకు మహారాష్ట్ర ప్రభుత్వం అవార్డులతో సత్కరించింది.[3]

అతను 102 సంవత్సరాల వయస్సులో 6 ఏప్రిల్, 2014 న మరణించాడు.[4]

మూలాలు

మార్చు
  1. Ganesh Prabhakar Pradhan (2005). Pursuit of ideals: autobiography of a democratic socialist. p. 88. His speech made me realize my responsibility as a people's representative and made me conscious both of the opportunity and challenge in my political life. My elder friend Datta Tamhane, who had participated in the freedom struggle in 1932 and also in 1942, was a member of the Legislative Assembly from 1957 to 1962, representing the Thane city constituency. He had made a mark as a studious and effective M.L.A. of the Praja Socialist Party.
  2. "Link - Volume 16, Part 3 - Page 38". United India Periodicals. 1974. Tamhane has been an active party leader since the inception of the Socialist Party and is well-known for his integrity and honesty in true right Gandhian fashion. {{cite magazine}}: Cite magazine requires |magazine= (help)
  3. "Freedom fighter Datta Tamhane dead". Business Standard, PTI. 2014. Veteran freedom fighter Datta Tamhane died at the age of 102...had participated in protests against the Simon Commission, salt Satyagraha. He was the recipient of various awards like Adivasi Seva Puraskar and the state government's literature award for his book Kathasangraha Kalicha Gowda
  4. "The Illustrated Weekly of India". 91 (3). Bennett, Coleman & Company. July 1970: 14. B.T.RANADIVE (b. 1904), a member of the Politbureau of the CPI.(M).Other notable C.K.Ps in this sphere are Mrinal Gore, V. B. Karnik and Datta Tamhane {{cite journal}}: Cite journal requires |journal= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=దత్త_తమనే&oldid=3868525" నుండి వెలికితీశారు