దినేష్ త్రివేది

మాజీ కేంద్రమంత్రి

దినేష్ త్రివేది పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో రైల్వేశాఖ మంత్రిగా పని చేశాడు.

దినేష్ త్రివేది
దినేష్ త్రివేది


రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
3 ఏప్రిల్ 2020 – 12 ఫిబ్రవరి 2021
ముందు అహ్మద్ హస్సన్ ఇమ్రాన్
తరువాత జవార్ సిరికార్
నియోజకవర్గం రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2002 – 2008
నియోజకవర్గం పశ్చిమ బెంగాల్‌
పదవీ కాలం
1990 – 1996
నియోజకవర్గం రాజ్యసభ సభ్యుడు గుజరాత్

కేంద్ర రైల్వే శాఖ మంత్రి
పదవీ కాలం
13 జులై 2011 – 18 మార్చి 2012
అధ్యక్షుడు ప్రతిభా పాటిల్
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు మమతా బెనర్జీ
తరువాత ముకుల్ రాయ్

కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి
పదవీ కాలం
22 మే 2009 – 13 జులై 2011
అధ్యక్షుడు ప్రతిభా పాటిల్
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు పనబాక లక్ష్మి
(స్వతంత్ర భాద్యత)
తరువాత సుదీప్ బంద్యోపాధ్యాయ్

లోక్‌స‌భ‌ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2009 – 23 మే 2019
ముందు తరిట్ బరణ్ టోపీదార్
తరువాత అర్జున్ సింగ్
నియోజకవర్గం బారక్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1950-06-04) 1950 జూన్ 4 (వయసు 74)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2021 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు v(1980–1990)
జనతా దళ్ (1990–1998)
తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (1998–2021)
జీవిత భాగస్వామి మినాల్ త్రివేది[1]
వృత్తి పైలట్
12 ఫిబ్రవరి 2021నాటికి

జననం, విద్యాభాస్యం

మార్చు

దినేష్ త్రివేది 1950 జూన్ 4న హీరాలాల్ త్రివేది, ఉర్మిలాబెన్ దంపతులకు న్యూఢిల్లీలో జన్మించాడు. ఆయన 1974లో ఆస్టిన్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.[2] దినేష్ త్రివేది అనంతరం చికాగోలోని డెటెక్స్ కంపెనీలో రెండేళ్ల‌పాటు ప‌ని చేసి భారతదేశానికి తిరిగి వచ్చి ఒక లాజిస్టిక్స్ కంపెనీ లీ అండ్ మురిహెడ్‌లో ప‌ని చేసి 1984లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

దినేష్ త్రివేది 80వ ద‌శ‌కంలో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 90వ ద‌శ‌కంలో జ‌న‌తాద‌ళ్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికై 1990 నుండి 1996 వరకు ఎంపీగా పని చేశాడు. ఆయన 1998లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బారక్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తృణ‌మూల్ అభ్య‌ర్థిగా పోటీ గెలిచి తొలిసారి లోక్‌స‌భ‌ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం 22 మే 2009 నుండి 13 జులై 2011 వరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రిగా, 13 జులై 2011 నుండి 18 మార్చి 2012 వరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేశాడు.[3] దినేష్ త్రివేది 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బ‌రాక్‌పూర్ నుండి రెండొవసారి లోక్‌స‌భ‌ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2017లో ఆర్థిక స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా ప‌ని చేశాడు.

దినేష్ త్రివేది 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బ‌రాక్‌పూర్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు, ఆయనను 3 ఏప్రిల్ 2020న తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున రాజ్య‌స‌భ‌కు ఎన్నికయ్యాడు. దినేష్ త్రివేది 2021 ఫిబ్రవరి 12న రాజ్య‌స‌భ‌ సభ్యత్వానికి రాజీనామా చేసి,[4] మార్చి 7న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5]

మూలాలు

మార్చు
  1. "Lok Sabha". 164.100.47.132. Archived from the original on 25 May 2014. Retrieved 24 February 2012.
  2. Rediff (12 July 2011). "Trivedi, a man of many parts" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
  3. NDTV (15 November 2011). "Who is Dinesh Trivedi?". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
  4. Sakshi (12 February 2021). "ఎంపీ రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
  5. Namasthe Telangana (6 March 2021). "బీజేపీలో చేరిన బెంగాల్ కీల‌క నేత‌ దినేశ్ త్రివేది". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.