దియా మీర్జా
దియా మీర్జా, (జనన నామం దియా హండ్రిచ్, జననం.డిసెంబర్ 9 1981) భారతీయ మోడల్,సినిమా నటి, మాజీ మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ విజేత. ఈమె బాలీవుడ్ సినిమా నటి. ఈమె తన సమాజ సేవ పరంగా ప్రముఖురాలు. ఆమె సాహిల్ సంఘ అంరియు జయాద్ ఖాన్ లతో కలసి ఒక ప్రొడక్షన్ సంస్థను యేర్పాటుచేశారు.[1] వారి మొదటి సినిమా "లవ్ బ్రేక్‌అప్స్ జిందగీ". ఇది అక్టోబరు 7, 2011 న విడుదలైంది.
అందాల పోటీల విజేత | |
జననము | దియా హండ్రిచ్ 1981 డిసెంబరు 9 హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
---|---|
నివాసం | ముంబయి, మహారాష్ట్ర, భారతదేశము |
వృత్తి | నటి, మోదల్,చిత్ర నిర్మాత |
బిరుదు (లు) | ఫెమినా మిస్ ఇందియా ఆసియా పసిఫిక్ 2000 మిసి ఆసియా పసిఫిక్ 2000 |
ప్రధానమైన పోటీ (లు) | ఫెమినా మిస్ ఇందియా ఆసియా పసిఫిక్ 2000 (విజేత) (మిస్ బ్యూటిఫుల్ స్మైల్) మిస్ ఆసియా పసిఫిక్ 2000 (విజేత) (మిస్ అవన్) (మిస్-క్లోజప్ స్మైల్) |
వ్యక్తిగత జీవితం, విద్య
మార్చుదియా మీర్జా తెలంగాణ లోని హైదరాబాదులో జన్మించారు. ఆమె తండ్రి ఫ్రాంక్ హండ్రిచ్. ఆయన జర్మ గ్రాఫిక్, ఇండస్ట్రియల్ ఫైర్ డిసైనర్, ఆర్కిటెక్ట్, కళాకారుడు, ఇంటీరియర్ డిసైనర్. ఆమె తల్లి దీపా బెంగాలీ హిందువులకు చెందినవారు. ఆమె ఇంటీరియల్ డిసైనర్, మద్యపాన బానిసలకు స్వచ్ఛందంగా సేవచేయు సామాజిక సేవా కార్యకర్త. దియా మిర్జా ఆరు సంవత్సరాల ప్రాయంలో ఉన్నపుడు తల్లిదండ్రులు విడిపోయారు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో ఆమె తండ్రి మరణించాడు. ఆ తర్వాత ఆమె తల్లి అహ్మద్ మిర్జాను వివాహమాడారు., ఆయన కూడా 2004 లో మరణించాడు. ఆమె తన పెంపుడు తండ్రి ఇంటిపేరును దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన కన్నతండ్రి ఇంటిపేరును కూడా చివరకు చేర్చుకుని "దియా మిర్జా హండ్రిచ్"గా తన పేరును మార్చుకున్నారు.
ఆమె హైదరాబాదు జిల్లా లోని ఖైరతాబాదులో నివసిస్తున్నప్పుడు విద్యారణ్య హైస్కూల్ లో చదివారు. ఆ పాఠశాల జిడ్దు కృష్ణమూర్తి బోధనలపై ఆధారపడేవి. ఆ తర్వాత ఆమె ఖైరతాబాదులోని నాసర్ పాఠశాలలో చేరారు. ఆమె స్టాన్లీ జూనియర్ కాలేజీలో చేరి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ డిగ్రీని పొందారు.[2]
కెరీర్
మార్చుదియా మిర్జా కాలేజీలో ఉన్నప్పుడు మీడియా సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా చేరారు. అదే సమయంలో ప్రచార, టి.వి వాణిజ్య సంస్థల లలో "లిప్టన్","ఇమామి" మరికొన్ని యడ్స్ లో నటించారు. ఆమె 2000 లో "మిస్ ఆసియా పసిఫిక్" అవార్డును పొందారు. ఆ తర్వాత ఆమె వివిధ సినిమాలలో "డమ్" (2003), దీవానపన్, తుమ్‌కోనా భూల్ పాయెగా, తుమ్‌సా నాహిన్ దేఖా - ఎ లవ్ స్టోరీ, పరినీత, దస్, లగె రహో మున్నాభాయి మొదలగు వాటిలో నటించారు. ఆమె నటిగా గుర్తింపు పొందలేకపోయారు. కానీ సమాజ సేవకురాలిగా అధిక గుర్తింపు పొందారు. ఆమెకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్ం అకాడామీ 2012 గ్రీన్ అవార్డు ఆమె చేసిన హరిత పరిసరాలకోసం సేవలకు గాను లభించింది. ఆమె "భ్రూణ హత్యలు", "హెచ్.ఐ.వి", వంటి ప్రజలను జాగృతిపరచే కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె నర్మదా బచాత్ అందోలన్ లోకూడా పాల్గొన్నారు. ఆమె "హిందూస్థాన్ టైమ్స్", ఇతర ప్రచురణ సంస్థలలో అనేక ఆర్టికల్స్ ను వ్రాసారు.
దియా కాలేజి విద్యనభ్యసించేటపుడు 16 సంవత్సరాల వయసులో ఈ పనిని ప్రారంభించారు. ఆమె మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా మల్టీ మీడియా సంస్థలో పనిచేశారు. ఆమె పనిచేసిన సంస్థ పేరు డా.నీరజా మల్టీ మీడియా స్టుడియో. ఆమె వివిధ వాణిజ్య ప్రకటనలలో అనగా వాల్స్, లిప్టన్, ఇమామి వంటి వాటిలో నటించారు.[3]
మిస్ ఆసియా పసిఫిక్
మార్చుదియా మిర్జా 2000 లో జరిగిన ఫెమినా మిస్ ఇండియాలో రెండవ రన్నరప్ గా నిలిచారు. తర్వాత మిస్ ఆసియా పసిఫిక్ పంపబడింది. అచట విజయం సాధించారు. ఫిలిప్పీన్స్ లోని మనీలాలో డిసెంబర్ 3, 2000 లో జరిగిన మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ ను గెలుచుకున్నారు.[4] ఆమె 2000 లో ఇందియా విన్నింగ్ ఇంటర్నేషనల్ పీజియంట్స్ లో హ్యాట్రిక్ సాధించారు. అదే సంవత్సరంలో లారాదత్తా మిస్ యూనివర్స్ టైటిల్ నూ, ప్రియాంకా ఛోప్రా మిస్ వరల్డ్ టైటిల్ నూ గెలుచుకున్నారు.[5]
సినిమా జీవితం
మార్చుదియా మీర్జా "రహ్నా హై తేరే దిల్ మే" సినిమాలో అరంగేట్రం చేశారు. కానీ ఆ చిత్రం బాక్సాపీసు విజయం సాషించలేకపోయింది. ఆమె విధు వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ చిత్రం "పరిణిత"లో కనిపించారు. ఆమె మ్యూజిక్ వీడియో "కజర మొహబ్బత్ వాలా"లో నటించారు.[6] ఆమె "దస్", "ఫైట్ క్లబ్" వంటి సినిమాలలో కూడా నటించారు. ఆమె "ఆసిడ్ ఫ్యాక్టరీ" అనే చిత్రంలో ఆమె ఆరు ప్రముఖ పాత్రలలో నటించే ఏకైక మహిళా పాత్రలో నటించింది.[7]
వివాహ జీవితం
మార్చుదియా మీర్జా 2019లో నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లి చేసుకుంది, ఐదేళ్ల తర్వాత అతడికి విడాకులు ఇచ్చింది. ఫిబ్రవరి 15, 2021లో వ్యాపారవేత్త వైభవ్ రేఖీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.[8][9]
అవార్డులు
మార్చుదియా మిర్జా 2012 లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్ం అకాడమీ అవార్డు అయిన "గ్రీన్ అవార్డు"ను గెలుచుకున్నారు. ఆమె పచ్చని పరిసరాలకోసం చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.[10]
నటించిన చిత్రాలు
మార్చుYear | Film | Role | Notes |
---|---|---|---|
2001 | Rehna Hai Tere Dil Mein | Reena Malhotra | |
Deewaanapan | Kiran Choudhary | ||
2002 | Tumko Na Bhool Paayenge | Muskaan | |
2003 | Tehzeeb | Nazneen Jamal | |
Pran Jaye Par Shaan Na Jaye | Saundarya | ||
Dum | Kaveri | ||
2004 | Stop! | Shama | |
Tumsa Nahin Dekha | Jia Khan | ||
Kyun...! Ho Gaya Na | Preeti | Special appearance | |
2005 | Naam Gum Jaayega | Natasha/Gitanjali | |
My Brother… Nikhil | Special appearance | ||
Blackmail | Mrs. Rathod | ||
Parineeta | Gayatri | ||
Dus | Anu Dheer | ||
Koi Mere Dil Mein Hai | Simran | ||
2006 | Fight Club - Members Only | Anu Chopra | |
Phir Hera Pheri | Item number (song) | ||
Alag | Purva Rana | ||
Lage Raho Munna Bhai | Simran | ||
Prateeksha | Reena Brown | TV release | |
2007 | Honeymoon Travels Pvt. Ltd. | Shilpa | |
Shootout at Lokhandwala | Mita Matu | ||
Cash | Aditi | ||
Heyy Babyy | Herself | Special appearance in a song | |
Om Shanti Om | Herself | Special appearance | |
Dus Kahaniyaan | Sia | ||
2008 | Krazzy 4 | Shikha | |
2009 | Kissan | Priya | |
Jai Veeru | Anna | ||
Acid Factory | Max | ||
Fruit and Nut | Monica Gokhale | ||
Kurbaan | Rehana (WIACB reporter) | Special Appearance | |
Luck By Chance | Herself | Special Appearance | |
2010 | Hum Tum Aur Ghost | Gehna | |
Shoebite | |||
2011 | Love Breakups Zindagi | Naina | |
2012 | Paanch Adhyay | Ishita | Dia's 1st Bengali Film |
2013 | Hungame pe Hungama | Gia | |
20 | తప్పాడ్ |
మూలాలు
మార్చు- ↑ Parasara, Noyon Jyoti. "Production is not a joke: Dia Mirza". Ticket Please News Desk. Archived from the original on 17 జూలై 2011. Retrieved 14 February 2011.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Dia Mirza - 2000-1991! - Miss India Winners 2009-1964 - Archives - Femina Miss India". Indiatimes. Archived from the original on 2011-09-27. Retrieved 2011-06-02.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Dia Mirza Biography". Archived from the original on 2010-11-29. Retrieved 2014-03-19.
- ↑ "ENDURING BEAUTIES". The Times Of India. Archived from the original on 2010-04-25. Retrieved 2014-03-19.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Miss India Winners 2000 - 1991 - Indiatimes.com". Feminamissindia.indiatimes.com. Archived from the original on 2013-03-29. Retrieved 2011-11-30.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Dia Mirza in Sonu Nigam's latest album". indiafm.com. Retrieved 11 October 2006.
- ↑ "I am a femme fatale who is also a gangster". Archived from the original on 2009-10-12. Retrieved 2014-03-19.
- ↑ Hindustan Times, Home / Entertainment / Bollywood (8 April 2021). "Dia Mirza celebrates birthday of stepdaughter Samaira". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 8 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.
- ↑ The Hindu, ENTERTAINMENT (16 February 2021). "Dia Mirza, businessman Vaibhav Rekhi get married". The Hindu (in Indian English). Archived from the original on 8 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.
- ↑ "Dia Mirza honoured with Green Award". businessofcinema.com/. Archived from the original on 7 జూలై 2012. Retrieved 4 July 2012.