ప్రధాన మెనూను తెరువు

దిలీప్ కొణతం

తెలుగు రచయిత, అనువాదకుడు

దిలీప్ కొణతం రచయిత మరియు సాంకేతిక నిపుణుడు. ఇంగ్లీషులో బహుళ ప్రజాదరణ పొందిన "కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్‌మ్యాన్" అనే ఆంగ్ల పుస్తకాన్ని ఒక దళారీ పశ్చాత్తాపం పేరిట తెలుగులోకి అనువదించి తెలుగు పుస్తక ప్రపంచంలో సంచలనం సృష్టించిన దిలీప్, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]

దిలీప్ కొణతం
Dileep Konatham.png
కొణతం దిలీప్
జననంసెప్టెంబర్ 22
మోత్కూర్, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు
ప్రసిద్ధిరచయిత, సాంకేతిక నిపుణుడు.
మతంహిందూ
భాగస్వాములుస్వర్ణ కిలారి
పిల్లలుఅర్ణవ్
తండ్రిబక్కారెడ్డి
తల్లిఅరుణ

జననం - విద్యాభ్యాసంసవరించు

దిలీప్ స్వగ్రామం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లాలోని మోత్కూర్. ఆయన సెప్టెంబర్ 22న భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) నాయకుడు కొణతం బక్కారెడ్డి,[3][4] అరుణ దంపతులకు జన్మించాడు. హైదరాబాదులోని సెయింట్ జోసఫ్ పబ్లిక్ స్కూల్ ప్రాథమిక విద్యను పూర్తిచేసిన దిలీప్, వివేకవర్ధిని డిగ్రీ కళాశాల నుండి బీఎస్సీ, ఉస్మానియా విశ్వవిద్యాలయము అనుబంధ కళాశాల వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.

వివాహం - ఉద్యోగంసవరించు

2000, ఏప్రిల్ 19న స్వర్ణ కిలారి[5]తో దిలీప్ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (అర్ణవ్)

తెలంగాణ ఉద్యమంలోసవరించు

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను, ఉద్యమ లక్ష్యాలనూ గురించి సామాజిక మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయడంతోపాటూ, తెలంగాణ వ్యతిరేక శక్తుల పన్నాగాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమం వేదికల్లో తిప్పికొట్టేవాడు. మిషన్ తెలంగాణ అనే వెబ్ పోర్టల్ స్థాపించి ఎప్పటికప్పుడు తెలంగాణ ఉద్యమం విశేషాలు ప్రపంచవ్యాప్తంగా చేరవేశాడు. గూగుల్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం నిరంతరం శ్రమించాడు.

డిజిటల్ మీడియా డైరెక్టర్ గాసవరించు

సామాజిక మాధ్యమం వేదికగా తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన దిలీప్ కృషిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిలీప్ ను డిజిటల్ మీడియా డైరెక్టర్ గా నియమించారు.

రచనలుసవరించు

 1. ఒక దళారీ పశ్చాత్తాపం (అనువాదం)[6][7]
 2. కుట్రాజకీయం (అనువాదం)
 3. జంగల్ నామా (అనువాదం)
 4. ఏ రిబట్టల్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగాండా
 5. ఫ్యూచర్ ఫర్ఫెక్ట్ కేటీఆర్[8][9]

మూలాలుసవరించు

 1. TelanganaToday (21 June 2017). "Public Libraries in Telangana to go digital". మూలం నుండి 22 September 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 22 September 2018. Cite news requires |newspaper= (help)
 2. విశాలాంధ్ర, నల్లగొండ (10 May 2019). "ఉద్యమమే ఊపిరిగా..." మూలం నుండి 19 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 19 May 2019. Cite news requires |newspaper= (help)
 3. విశాలాంధ్ర, నల్లగొండ రూరల్‌/భువనగిరి (18 May 2010). "బక్కారెడ్డి మృతికి సిపిఐ సంతాపం". మూలం నుండి 19 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 19 May 2019. Cite news requires |newspaper= (help)
 4. నవ తెలంగాణ, స్టోరి (6 October 2019). "ఏడేండ్ల జీవితానికి స్వర్ణాక్షర నివాళి". NavaTelangana. కవిత కట్టా. మూలం నుండి 6 October 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 6 October 2019.
 5. https://dalaari.wordpress.com/2007/06/23/dalari-reviews1/ఒక దళారీ పశ్చాత్తాపం – సమీక్షలు – ఒకటవ భాగం
 6. https://dalaari.wordpress.com/page/2/ఒక దళారీ పశ్చాత్తాపం – సమీక్షలు – రెండవ భాగం
 7. TelanganaToday (24 July 2017). "KTR did not achieve success overnight, he was made to work hard". మూలం నుండి 22 September 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 22 September 2018. Cite news requires |newspaper= (help)
 8. నమస్తే తెలంగాణ (25 July 2017). "భిన్న వ్యక్తిత్వం కేటీఆర్ సొంతం". మూలం నుండి 22 September 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 22 September 2018. Cite news requires |newspaper= (help)