స్వర్ణ కిలారి

తెలుగు రచయిత్రి, సినిమా నటి

స్వర్ణ కిలారి తెలుగు రచయిత్రి, సినిమా నటి. అమ్మూనాయర్[1] ఇంగ్లీషులో రాసిన "ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీని" అనే ఆంగ్ల పుస్తకాన్ని "లిప్తకాలపు స్వప్నం"[2][3] పేరిట తెలుగులోకి అనువదించింది. కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన 'దొరసాని' సినిమాలో పెద్ద దొరసాని పాత్రలో నటించింది.

స్వర్ణ కిలారి
Swarna Kilari.jpg
స్వర్ణ కిలారి
జననంనవంబరు 4
కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాదు
ప్రసిద్ధిరచయిత్రి, సినీనటి
మతంహిందూ
భాగస్వాములుదిలీప్ కొణతం
పిల్లలుఅర్ణవ్
తండ్రిరాజేశ్వరరావు
తల్లిఝాన్సీ లక్ష్మి

జననం - విద్యాభ్యాసంసవరించు

స్వర్ణ కిలారి నవంబరు 4న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో రాజేశ్వరరావు, ఝాన్సీ లక్ష్మి దంపతులకు జన్మించింది. ఆమె డిగ్రీ వరకు కొత్తగూడెం లోనే పూర్తి చేసింది, కంప్యూటర్‌ కోర్స్ చేయడానికి హైదరాబాదు వచ్చింది.

వివాహంసవరించు

2000, ఏప్రిల్ 19న దిలీప్ కొణతంతో స్వర్ణ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (అర్ణవ్)

సాహిత్య రంగంసవరించు

స్వర్ణ తల్లి ఝాన్సీలక్ష్మి పీయూసీ వరకు చదువుకుంది. అంతేకాకుండా ఝాన్సీలక్ష్మికి బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. దాంతో చిన్నప్నటి నుండి చందమామ, బాలమిత్ర, చతుర, విపుల పుస్తకాలు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి వారపత్రికలు చదివిన స్వర్ణకు సాహిత్యంపై ఆసక్తి కలిగింది. దిలీప్ కూడా పుస్తక ప్రియుడు, రచయిత అవ్వడం వల్ల వివాహం అయ్యాక స్వర్ణకు అనేక రకాల పుస్తకాలు చదివే అవకాశం దొరికింది.

మూలాలుసవరించు

  1. మన తెలంగాణ (1 July 2019). "ఒక అద్భుత కథ". తాజా వార్తలు. Archived from the original on 12 నవంబర్ 2019. Retrieved 12 November 2019. Check date values in: |archivedate= (help)
  2. నమస్తే తెలంగాణ, LITERATURE (11 November 2019). "అపురూప జీవితగాథ". www.ntnews.com. Archived from the original on 12 నవంబర్ 2019. Retrieved 12 November 2019. Check date values in: |archivedate= (help)
  3. నవ తెలంగాణ, స్టోరి (6 October 2019). "ఏడేండ్ల జీవితానికి స్వర్ణాక్షర నివాళి". NavaTelangana. కవిత కట్టా. Archived from the original on 6 అక్టోబర్ 2019. Retrieved 12 November 2019. Check date values in: |archivedate= (help)