దీకొండ సారంగపాణి
దీకొండ సారంగపాణి తెలంగాణ ప్రముఖ తెలుగు జానపద, సినీ నేపథ్య గాయకుడు[1].
Sarangapani Deekonda | |
---|---|
జననం | సారంగపాణి 10.04.1957 వరంగల్ జిల్లా |
మరణం | 01.09.2002 వరంగల్ . |
నివాస ప్రాంతం | హన్మకొండ |
ప్రసిద్ధి | ఓరుగల్లు ప్రముఖ,జానపద సినీ నేపథ్య గాయకుడు. |
మతం | హిందు |
భార్య / భర్త | దీకొండ ప్రమీల |
పిల్లలు | ప్రణీత,గౌతమ్,రాజమహేంద్ర . |
తండ్రి | లక్ష్మయ్య |
తల్లి | గౌరమ్మ |
బాల్యం, వృత్తి జీవితం
మార్చువరంగల్ జిల్లాలో దీకొండ సారంగపాణి జన్మించారు. బాల్యమంతా హనుమకొండ లలోనే గడిచింది. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన సానా యాదిరెడ్డి సినిమాలతో సినీ నేపథ్య గాయకుడుగా వెలుగులోకొచ్చాడు. అనంతరం జానపద సినీ నేపథ్య గాయకుడుగా సినిమాలలో సారంగపాణి అనేక పాటలు పాడారు. పిట్టల దొర రావే వయ్యరి రాస గుమ్మడి ఈ రాలుగారి పిట్టలదొర నీసరి జోడి. ప్రేమ పల్లకి సినిమాలో కొండకోన తిరిగేటి మామయ్యో నీ అండ నేనుంటాను రావయ్యో లాంటి... తెలుగు సినిమా గాయకుడు చిత్రతో సారంగపాణీ అనేక పాటలు పాడారు. దీకొండ సారంగపాణి, జానపద సినీ నేపథ్య గాయకుడైన వరంగల్ శంకర్కి సమకాలికుడు.
వివాహం
మార్చుప్రమీల సారంగపాణి సతీమణి వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు.
ప్రజాదరణ పొందిన పాటలు
మార్చుదీకొండ సారంగపాణి పాటలు... ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సింగారామ తందనానే తాన... తయ్యందతయ్యం తయ్యందతయ్యం లంబాడోల్లం మేము బాబు బంజాలం ... పండు వెన్నెలే పల్లె నిండా రాలుతూ ... జానపద, సినిమా గేయాలు ఉరుతలుగించినవి[2].
మరణం
మార్చుసికింద్రాబాదు రైల్వే స్టేషన్లో ప్రమాదవ శాత్తు రైలు కింద పడి సారంగపాణి మరణించారు.
మరణాంతరం
మార్చుభర్త స్నేహితులే ఆదుకున్నారు జానపద కళాకారుడిగా సారంగపాణి సంపాదించింది ఏమీ లేదు. ఆయన మరణాంతరం స్నేహితులే కుటుంబాన్ని ఆదుకున్నారు. భర్త లేని తనకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆర్థిక సాయం అందించాడు. సారంగపాణి సతీమణి ప్రమీల.[1].
ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి ఫీజులు లేకుండా చదివించారని సారంగపాణి కొడుకు రాజమహేందర్ తెలియజేశాడు.