రోషన్ హర్షాద్‌లాల్ "దీపక్" శోధన్ audio speaker iconpronunciation  (18 అక్టోబరు 1928 – 2016 మే 16) భారతదేశ టెస్టు క్రికెట్ క్రీడాకారుడు.[1] ఆయన మూడు టెస్ట్‌లు ఆడి 181 పరుగులు చేశారు. ఆయన సగటు60.33. అంతేకాక ఆయన 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడి 1802 పరుగులు చేశారు.[2]

దీపక్ శోధన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రోషన్ హర్షడ్‌లాల్ శోధన్
పుట్టిన తేదీ(1928-10-18)1928 అక్టోబరు 18
అహ్మదాబాదు, గుజరాత్
మరణించిన తేదీ2016 మే 16(2016-05-16) (వయసు 87)
అహ్మదాబాదు, గుజరాత్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుLeft-arm medium
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1952 {{{testdebutdate}}} - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1953 {{{lasttestdate}}} - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1946/47–1961/62గుజరాత్ క్రికెట్ టీం
1957/58–1959/60)బరోడా
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 3 43
చేసిన పరుగులు 181 1802
బ్యాటింగు సగటు 60.33 31.61
100లు/50లు 1/0 4/7
అత్యధిక స్కోరు 110 261
వేసిన బంతులు 60 5,358
వికెట్లు 0 73
బౌలింగు సగటు 34.05
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 5/49
క్యాచ్‌లు/స్టంపింగులు 1 27
మూలం: Cricketarchive, 2016 మే 16,

జీవిత విశేషాలు

మార్చు

దీపక్ శోధన్ 1928లో జన్మించారు. ఆయన ఎడంచేతి వాటం బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్ బౌలింగ్ చేసే శోధన్ భారత్ తరఫున మూడు టెస్టులు ఆడారు. 1952లో పాకిస్తాన్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టులో ఆయన అరంగేట్రం చేశారు. ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లోనే సెంచరీ (110 పరుగులు) చేసిన తొలి భారత క్రికెటర్‌గా దీపక్ శోధన్ గుర్తింపు పొందారు. ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్ పర్యటనకు జట్టులో చోటు సంపాదించినా కేవలం ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 45, 11 పరుగులు చేసిన శోధన్ గాయంతో తర్వాతి మూడు టెస్టులకు దూరమయ్యారు. కింగ్‌స్టన్‌లో జరిగిన ఆఖరి టెస్టులో బరిలోకి దిగినా పెద్దగా రాణించలేకపోయారు. ఆ తర్వాత 1962 వరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కొనసాగినా జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. 43 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 1802 పరుగులు, 73 వికెట్లు తీశారు. ఇందులో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి.[3] భారత్‌ తరుఫున టెస్ట్‌లలో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన మొదటి బ్యాట్స్‌మన్‌ ఘనత ఇతని సొంతం.[4]

అత్యున్నత రికార్డు

మార్చు

ఆయన అత్యధిక సరాసరి పరుగులు 60.33 ను భారతీయ బ్యాట్స్‌మన్ గా నెలకొల్పారు. ఆయన గుజరాత్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, అధికంగా రంజీ క్రికెట్లో పాల్గొనేవారు. యువకునిగా యున్నప్పుడు ఆయన హాకీ క్రీడాకారుడు కూడా. ఎడమచేతి బ్యాట్స్‌మన్ అయినందున ఆయన "ఎడమచేతి హాకీ స్టిక్"ను వాడేవారు.

శోధన్ మే 16 2016 న తన 87వ యేట ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారు. ఆయన మరణానికి ఆయన భారతదేశ టెస్టు క్రికెటరుగా అత్యధిక వయసున్నవారు.[5][6]

మూలాలు

మార్చు
  1. "Old-world Shodhan's trip down memory lane". Wisden India. నవంబరు 13 2012. Archived from the original on 4 జూన్ 2016. Retrieved 21 మే 2016. {{cite news}}: Check date values in: |date= (help)
  2. పాతతరం టెస్ట్ క్రికెటర్ దీపక్ శోధన్ కన్నుమూత May 17, 2016[permanent dead link]
  3. మాజీ క్రికెటర్ దీపక్ శోధన్ కన్నుమూత Sakshi | May 17, 2016
  4. పక్‌ శోధన్‌ మృతి
  5. Former India cricketer Deepak Shodhan dies aged 87
  6. When I met India's oldest living Test cricketer

ఇతర లింకులు

మార్చు