దీపావళి (1960 సినిమా)
1960లో విడుదలైన ఈ చలనచిత్రం విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇది కృష్ణుడి పాత్రలో ఎన్.టి.ఆర్ కు మూడవ చిత్రం. ఈ చిత్రం "నరకాసుర వధే" అనే పేరుతో కన్నడలోకి అనువదించబడింది.
దీపావళి (చలన చిత్రం) (1960 తెలుగు సినిమా) | |
దస్త్రం:TeluguFilm Deepavali 1960.jpg | |
---|---|
దర్శకత్వం | ఎస్.రజనీకాంత్ |
నిర్మాణం | కె. గోపాలరావు |
కథ | సముద్రాల రాఘవాచార్య |
చిత్రానువాదం | కె. గోపాలరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, కృష్ణకుమారి, యస్వీ.రంగారావు, కాంతారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, ఋష్యేంద్రమణి |
సంగీతం | ఘంటసాల |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది సత్యం |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | సి.నాగేశ్వరరావు |
కళ | ఎస్.వి.ఎస్. రామారావు |
నిర్మాణ సంస్థ | అశ్వరాజ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చిత్రకథ
మార్చుపాత్రలు-పాత్రధారులు
మార్చు- నందమూరి తారక రామారావు - కృష్ణుడు
- సావిత్రి - సత్యభామ
- కృష్ణకుమారి - రుక్మిణి
- యస్వీ.రంగారావు - నరకుడు
- తాడేపల్లి కాంతారావు - నారదుడు
- గుమ్మడి వెంకటేశ్వరరావు - నాగదత్తుడు
- ఎస్. వరలక్ష్మి - వసుమతి, నాగదత్తుని కుమార్తె, నరకుని భార్య
- రమణారెడ్డి - శిష్యాసురుడు
- ఋష్యేంద్రమణి - దేవమాత అదితి
- సుజాత - రంభ
పాటలు
మార్చు- అలుకా మానవయా జాలి బూనవయా నరకాధీశ్వరా త్రిలోకజీవ పాలా - ఘంటసాల
- ఓ దేవా కనలేవా మొర వినవా ఓ దేవా కనలేవా మొర వినవా - ఘంటసాల బృందం
- కరణా చూడవయా వరముజూపవయా మురళీ మోహనా వినీల మేఘశ్యామా - ఘంటసాల బృందం
- కూరిమి గొనుమా ఓ రాజశేఖర కూరిమి తీరక - ( గాయని ?)
- కంసహీతిని తండ్రి కాల్వ్‌ట్టి పట్టించి పరుగిల్ ( పద్యం) - మాధవపెద్ది సత్యం
- జయ విజయీభవ గోపాలా ప్రతివీర భయంకర బాహుబలా - పి.సుశీల బృందం
- జయ జయ జయహో .. రణాంగణమున నన్నెదిరంచే దనుధ్దరుండు - మాధవపెద్ది సత్యం బృందం
- దేవజాతికి ప్రియము సాధించగోరి దానవకులంబులోన (పద్యం) - మాధవపెద్ది సత్యం
- నరకుని రక్షింప పరివార సహితుడై నిఠలాక్షుడే వచ్చి నిలచుగాక (పద్యం) - ఘంటసాల
- పోనీవోయి తాతా నన్ను పోనీవోయి తాతా ఓ మూడుకాళ్ళ ముసలితాత - కె.రాణి, జె.వి. రాఘవులు
- పాలు త్రాగు నెపాన ప్రాణమ్ములను లాగి (పద్యం) - మాధవపెద్ది సత్యం
- మాదే కదా భాగ్యము సౌభాగ్యము చరితార్థమాయె మా కులము - ఘంటసాల, పి.సుశీల, ఎ.పి.కోమల బృందం
- యదుమౌళి ప్రియసతి నేనే నాగీటు దాటి చనజాలడుగా - పి.సుశీల, ఎ.పి.కోమల, ఘంటసాల
- విరాళీ సైపలేనురా అయ్యో విరాళీ - ఎ.పి.కోమల బృందం
- వచ్చింది నేడు దీపావళి పరమానంద మంగళ శోభావళి - ఘంటసాల, పి.సుశీల బృందం
- సరియా మాతో సమరాన నిలువగలడా - ఎ.పి. కోమల
- సరసిజాక్షి నీ యానతి లేనిదే ( యక్షగానము) - ఘంటసాల, మాధవపెద్ది సత్యం, ఎ.పి. కోమల బృందం
- సురలను గొట్టునాడు అతిథి సుందర కుండలముల ధరించి ( పద్యం) - ఘంటసాల
- అమరాధిపత్యమ్ము (పద్యం) - ఘంటసాల
- దీనుల పాలీ దైవమందురే - ఘంటసాల
- మహాదేవ దేవా మహీయ ప్రభావ మము , ఎస్.వరలక్ష్మి
- అగ్నిసాక్షిగా వివాహంబైన పురుషుడే (పద్యం), ఎస్.వరలక్ష్మి
- నేనే శ్రీహరి పాద పద్మ భజనా నిష్ఠా గరిష్ఠ(పద్యం), పి సుశీల
- హాయి హాయి అందాలరాజా వెయ్యేళ్ళు వర్ధిల్లు మా చిన్నిరాజా , ఎస్.వరలక్ష్మి.
సంభాషణలు
మార్చుదీపావళి చిత్రంలో ఆఖరి ఘట్టాన్ని బాగా పండించారు. మచ్చునకు కొన్ని సంభాషణలు.
నరకుడు: త్రిభువన విజేత నరక సార్వభౌముని సంహరించడానికి శపథము చేసిన వాడు వీరాధివీరుడనుకున్నను అయుధములతో అలంకరించుకొన్న అబలను అండగా తెచ్చుకొనేంత అధముడనుకోలేదు. కృష్ణా! సతీ సమేతంగ రవడానికీ, చందన సత్కారములు స్వీకరించడనికీ ఇదేమి కల్యాణ మండపమా? దుర్భర రణభేరీ భాంకృతీ విదారిత శత్రు శ్రవణము శత సహస్రక్షొవీల కర సంచలిత ఖడ్గ ధారా భయంకరమైన యుద్ధ రంగమిది యెరుగుదువా?
సత్యభామ: ప్రభూ! భక్త జనమందారమైన మందహాసానికి ఇదా తరుణం? ఈ పరమ ధూర్తుని వాచాలత ఒక్క త్రుటి కాలము కూడా సహించలేను. తక్షణం ఈ దుష్ట ప్రేలాపి కంఠం ఉత్తరించి లోక రక్షణ చేయండి.
శ్రీకృష్ణుడు: ఆ సమయము సమీపిస్తున్నది. శాంతించు సత్యా. ఓరీ గర్వాగ్ని దుర్విదగ్ధా నీవు చేసిన లొకాపచారాలకు నిన్నేనాడో సంహరించి ఉండవలసింది. కాని నీకు అవ్యక్తము, పరమ నిగూఢము, బలవత్తరము ఐన వాత్సల్యంతో నీకు మరో అవకాశం ఇస్తున్నాను. పశ్చాతప్తుడవై సాధు, సజ్జన హింస మాని వంచనతో తస్కరించిన మా ద్వారకా నగర కాంతలను మాకప్పగించి ధర్మపరతంత్రుడవై ప్రవర్తించు. దేవమాత అదితి కర్ణకుండలాలు అమెకర్పించు. నీ అపరాధాలను మన్నించి నిన్ను రక్షిస్తాను.
నరకుడు: నీవా నన్ను మన్నించేది? నీవా నన్ను రక్షించేది? అహ్హహ్హహ్హహ్హ
పద్యం:
కంసభీతిని తండ్రి కాల్వట్టి అర్థించి పరులిల్లు జేరిన పారుబోతా
కులగోత్రగౌరవమ్ములు గంగపాల్జేసి పలు వేసములు జేయు వంచకుండా
సంగరమ్మున జరాసంధునకోడి సాగరములో దాగిన పిరికిపందా
వీరసింహుకునిల్చి పోరాడ వెరగంది ఆడుసాయమ్ము తెచ్చుకొన్నట్టి అరద
నిరుపమాన భుజాబల నిశ్చితామరేంద్ర గర్వాంధ తిమిర విజేత నరక
దానవేంద్రుని వెరపింప తరమెనీకు విక్రమించు వీరుడవేని తులువా
సకల శాత్రవ సేనావాహినీ నిర్మూలన శక్తివంతము అగ్నిపర్వత గర్భోఛ్ఛిత వహ్నీకీల భయంకరము ఐన ఈ నరక క్రోధాగ్నిని చవిచూడుము.
నరకుడు: ఛీ నీచుడా విరథునితో యుధ్ధం వీరోచితం కాదు. ఈ నరకుడు విరథుడైనంత మాత్రాన విజేతనని విర్రవీగబోకు. శూరుడవైతే ధర్మయుద్ధం చెయ్యి.
శ్రీకృష్ణుడు: దానవసార్వభౌములు ఇది ధర్మము ఇది అధర్మము అని విచక్షణ కూడా చేస్తున్నరా? ధర్మం
పద్యం:
సురలను గొట్టు నాడు అదితి సుందర కుండలముల్ హరియించి అచ్చరలను బట్టు నాడు
చెరసాలల మౌనుల నెట్టునాడు - ఏమైంది నీ ధర్మం - మా పురమున దూరి కన్నెలను మ్రుచ్చిలి నాపై బెట్టునాడు నీ
వెరుగవు ధర్మమన్న పదమే కనిపించెనే నేడు నీచుడా
నరకుడు: ఛీ మదోన్మత్త ప్రలాపీ కట్టిపెట్టు నీ వాచలత. ఈ నరక ప్రతాపాగ్ని దుర్నిరీక్ష్యమూ దుర్జయమూ దుస్సహమూ. ఓం నమః శివాయ. భయంకర తపోవిభ్రాంత శంకర సత్కృపా పరిలబ్ధ మహాభీలశూలధాటికి నేలగూలెదవుగాక. ఓం నమః శివాయ.
సత్యభామ: స్వామీ
శ్రీకృష్ణుడు: దేవీ
సత్యభామ: స్వామీ..ఓరీ దురహంకార దుర్విధగ్ధా రాక్షసాధమా నారీజన హృదయోద్గత శాపాగ్ని కీలలు నిన్ను దహించివేసే సమయం ఆసన్నమైనది. బంధీకృత స్త్రీజనశోకాగ్ని నిన్ను భస్మీపటలం చేయకమానదు.
నరకుడు: భువనైక సుందరీ! శరచ్చంద్ర చంద్రికా సుఖానుభూతిలో విరహగీతలాలపించవలసిన విలాసినివి వీరాలాపాలతో విజృంభించడం వికృతంగా ఉంది. శిరీష కుసుమ పేశల మనోఙ్ణ మూర్తివి నీవెక్కడ? రణరంగమెక్కడ? యమభటసమాన భయంకర వీరభటావృతంబై బలాకరంబుల నఖంబులబేండు బడజేయు మదోద్దండ వేదండ పాదఘట్టనా భూపరాగ విషదరాన్వితంబై హృదయపుట భేదనసమర్థన భాస్కరాశ్వ సమఘోటక హేషాఘోష సంకులమై రంగారు సంగరరంగమెక్కడ? అబలవు నీవెక్కడ? శాత్రవ మదమత్తేభ కంఠీరవుదు నరకసార్వభౌముదు అభం శుభం ఎరగని ఒక అబలతోనా యుద్ధం చేయుత? ఛా ...ఆ.. అస్త్రశస్త్రాలకు స్వస్తి చెప్పీ నన్నాశ్రయించు నిన్ను మన్నించి నీ సౌందర్యాన్నారాధిస్తాను.
సత్యభామ: ఛీ నీచాధమా! పరస్త్రీలు మాతృసమాన పూజ్యలు. పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు. ఆ పవిత్ర సత్యాన్ని పాటించక పాపచింతతో పతితుడవైనప్పుడు ఆ మాతృస్వరూపం సంక్షిభించి అగ్నిపర్వతంవలే బ్రద్దలై భయంకర కోపాగ్ని కీలలు నిన్నావరించి దహించునప్పుడు బ్రహ్మవిష్ణుమహేశ్వరులేకమై వచ్చినా నిన్ను రక్షించలేరు. నీతో భూదేవి కృంగిపోతున్నది. నిన్ను వధించి భూభారం తొలగిస్తాను. కాచుకో.
ఓరీ మదొన్మాదీ! నీకు చావు తప్పదు.
పద్యం:
నేనె శ్రీహరి పాదపద్మభజనా నిష్ఠాత్మనౌనేనిన్
కాళి సమాన భారత సతీ నిత్యప్రతాపంబు నాలోనవెల్గునేని
సర్వ వనితాలోకంబు మోదింప ఈ బాణోగ్రాహతి
గూలుగాక నరకాప్రాచ్యుండు భూమీతలిన్.
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)