యస్. వి. యస్. రామారావు

(ఎస్.వి.ఎస్. రామారావు నుండి దారిమార్పు చెందింది)

యస్.వి.యస్. రామారావు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు.

శీలంశెట్టి వెంకట శ్రీరామారావు
Svs ramarao.jpg
జననం1913
మరణం1970
చెన్నై, తమిళనాడు, భారతదేశం
విద్యజాతీయ కళాశాల, మచిలీపట్నం
వృత్తికళా దర్శకుడు, సినిమా దర్శకనిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1935–1960
సుపరిచితుడుశ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం

విశేషాలుసవరించు

ఇతని పూర్తి పేరు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు. ఇతడు బందరు లోని జాతీయ కళాశాలలో చదువుకున్నాడు[1]. ఇతడు మంచి పెయింటర్. ఇతడు వేసిన చిత్రాలలో 'లంబాడీ కన్య' అనే వర్ణచిత్రం ఎన్నదగినది. ఇతడు ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్‌లలో తన చిత్రాలను ప్రదర్శించి అనేక బహుమతులు అందుకున్నాడు. 1934లో ఇతడు వేసిన ఒక పెయింటింగ్‌కు "గ్రిగ్ మెమోరియల్ మెడల్" లభించింది. ఈ బహుమతిని పుచ్చుకున్న మొట్టమొదటి భారతీయుడు ఇతడే. ఇతడు ఫ్రీ స్టయిల్ పెయింటింగులో సిద్ధహస్తుడు. ఇతనికి ఆధునిక చిత్రకళ పట్ల కొంత అయిష్టం ఉండేది. బందరుకే చెందిన పి.వి.దాసు ఇతడిని సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. పి.వి.దాసు తన వేల్స్ పిక్చర్స్ స్టూడియోలో ఇతడిని కళా దర్శకత్వ శాఖలో చేర్చుకున్నాడు. ఇతడు కళాదర్శకత్వం వహించిన తొలి సినిమా శ్రీకృష్ణ లీలలు. ఇతనికి గొప్ప పేరు తెచ్చిపెట్టిన చిత్రం 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఈ చిత్రానికి సెట్సు, కాస్ట్యూములు తయారు చేయడంలో ప్రతిభ చూపించాడు. స్టుడియోలో వెంకటేశ్వరుని విగ్రహానికి నిజమైన విగ్రహంలోని నగల్లాంటి నగలను తయారు చేయడానికి చాలా శ్రమించాడు. ఫలితంగా ఆ చిత్రం చూసినవాళ్లవ్వరూ అది స్టూడియో విగ్రహమని నమ్మలేదు. బాలరాజు సినిమాలో హీరో పాత్రకు ఇతడు సృష్టించిన 'మీసం' స్టయిలు ఎంతో మందికి నచ్చింది. ఆ రోజుల్లో చాలామంది ఈ మీసాన్ని అనుకరించారు. ఇతడు నిర్మాతగా కూడా మారి రెండు చిత్రాలను నిర్మించాడు. 1970లో ఇతడు మరణించాడు.

చిత్ర సమాహారంసవరించు

కళాదర్శకుడిగాసవరించు

 1. 1935 : శ్రీకృష్ణ లీలలు
 2. 1936 : ద్రౌపదీ వస్త్రాపహరణం
 3. 1938 : గృహలక్ష్మి
 4. 1938 : మాలపిల్ల
 5. 1939 : రైతుబిడ్డ
 6. 1939 : వందేమాతరం
 7. 1942 : సీతారామ జననం
 8. 1946 : బాలరాజు
 9. 1946 : ముగ్గురు మరాటీలు
 10. 1947 : మాయలోకం
 11. 1947 : యోగివేమన
 12. 1948 : బాలరాజు
 13. 1950 : స్వప్న సుందరి
 14. 1952 : చిన్న కోడలు
 15. 1952 : ధర్మదేవత
 16. 1957 : వినాయకచవితి
 17. 1957 : సారంగధర
 18. 1960 : దీపావళి
 19. 1960 : శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం

దర్శకుడిగా, నిర్మాతగాసవరించు

 1. 1942 : బాలనాగమ్మ
 2. 1952 : చిన్నమ్మ కథ

మూలాలుసవరించు

 1. పి., పుల్లయ్య (1 July 1970). "ఇద్దరు కళాదర్శకులు". విజయచిత్ర. 5 (1): 32–33. |access-date= requires |url= (help)CS1 maint: discouraged parameter (link)

బయటి లింకులుసవరించు