దుబాయ్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అత్యధిక జనాభా కలిగిన నగరం
(దుబాయి నుండి దారిమార్పు చెందింది)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశంలోని ఏడు ఎమిరేట్స్ లలో దుబాయ్ (ఆంగ్లము - Dubai, అరబ్బీ భాష - دبيّ ), ఒకటి. మిగిలినవి అబు దాబి, షార్జా, అలైన్, రాస్ అల్ ఖైమా, పుజైరా, ఉమ్మ్ అల్ క్వయిన్ మొదలయినవి. దుబాయ్ సిటీగా పిలిచే ఇది ఆ దేశంలోని ప్రధాన అభివృద్ధి కలిగిన పట్టణం. దుబాయ్ భారతీయులకు అందునా ఆంధ్రులకు చిరపరచితమైన పట్టణం. ఇక్కడ అత్యదికంగా వలస ఆంధ్రులు కలరు. దుబాయ్ గురించిన ఏదో ఒక వార్త తెలుగు పత్రికలలో, చానెళ్లలో ప్రతిరోజూ కనిపిస్తుంటుంది.

ఎమిరేట్ ఆఫ్ దుబాయి
إمارة دبيّ
రాత్రివేళ దుబాయి దృశ్యం
రాత్రివేళ దుబాయి దృశ్యం
రాత్రివేళ దుబాయి దృశ్యం
Flag of ఎమిరేట్ ఆఫ్ దుబాయి
Flag
Location of ఎమిరేట్ ఆఫ్ దుబాయి
Location of ఎమిరేట్ ఆఫ్ దుబాయి
Location of ఎమిరేట్ ఆఫ్ దుబాయి
Location of ఎమిరేట్ ఆఫ్ దుబాయి
అక్షాంశరేఖాంశాలు: 25°16′N 55°20′E / 25.267°N 55.333°E / 25.267; 55.333
ఎమిరేట్ దుబాయి
ప్రభుత్వం
 - Type {{{government_type}}}
 - అమీర్ షేక్ ముహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్
వైశాల్యము [1]
 - మెట్రో 4,114 km² (1,588.4 sq mi)
జనాభా (2006)[2][3]
 - సాంద్రత 345.65/km2 (895.2/sq mi)
 - మెట్రో 14,92,000
కాలాంశం దుబాయి ప్రామాణిక కాలం (UTC+4)
వెబ్‌సైటు:
Dubai Emirate
Dubai Municipality

చరిత్ర

మార్చు
 
సరళీకరించబడిన వంశవృక్షంలో అధికార క్రమము చూడవచ్చు.

డిసెంబరు 2 1971 న అబుధాబి, మిగిలిన ఐదు ఎమిరేట్స్ దుబాయితో కలసి యునైటెడ్ ఎమిరేట్స్ అనే సమూహ దేశంగా ఏర్పడ్డాయి.

భౌగోళికం

మార్చు
నం. Month అల్పం అధికం అత్యధికం అత్యల్పం సగటున వర్షం నమోదయ్యే రోజులు
1 జనవరి 14 22 32 8 3
2 ఫిబ్రవరి 15 23 31 7 1
3 మార్చి 17 27 38 11 1
4 ఏప్రిల్ 20 31 41 9 1
5 మే 24 36 45 18 0
6 జూన్ 27 38 45 22 0
7 జులై 29 39 47 25 0
8 ఆగస్టు 30 39 47.3 25 0
9 సెప్టెంబరు 27 38 44 22 0
10 అక్టోబరు 23 34 40 16 0
11 నవంబరు 19 30 41 13 1
12 డిసెంబరు 16 25 31 6 3
పట్టిక 1[4]: నెలవారిగా నమోదయిన ఉష్ణోగ్రతలు (అన్ని విలువలు °Cలో తెలుపబడ్డాయి).

దుబాయ్ పర్సియన్ గల్ఫ్ సముద్రతీరము వెంబడి ఉంది. ఈ పట్టణం సముద్రమునకు దాదాపు సమానమైన ఎత్తుకలిగి ఉంది. దుబాయ్ యొక్క సరిహద్దులు దక్షణాన అబుదాభి, ఉత్తర తూర్పుగా షార్జా, దక్షణౌత్తరంగా ఒమన్, పశ్చిమాన అజమాన్, తూర్పుగా రస్ అల్ ఖైమా, దుబాయ్ పట్టణాన్ని కొంత చుట్టినట్టుగా హత్తా పర్వతశ్రేణి.

జనగణన

మార్చు

2006 జనాభా లెక్కలననుసరించి దుబాయ్ యొక్క జనాభా 1,422,000. పురుషులు, 1,070,000. స్త్రీలు 349,000. దుబాయ్ యొక్క అధిక జనాభా ఆసియా వారు ( దాదాపు 85%. ఇందులో భారతీయులు 51%, పాకిస్తానీయులు 16%, బంగాలీలు 9%, పిలిప్పీనీయులు 3% ). మొత్తం ఎమిరేట్స్ యొక్క జనాభాలో 71% ఆసియా వారే ఉన్నారు).

దుబాయ్ పట్టణంలో ప్రధాన భాష అరబిక్. అరబిక్ కాకుండా పర్షియన్, మళయాళం, ఆంగ్లం, హిందీ, తెలుగు, ఉర్దూ, బెంగాలీ అధికంగా మాట్లాడుతారు.

ఈ టైమ్-లాప్స్ వీడియో 2000 నుండి 2011 వరకు సంవత్సరానికి ఒక ఫ్రేమ్‌లో దుబాయ్ వృద్ధి రేటును చూపుతుంది. వీడియోను రూపొందించిన తప్పుడు-రంగు ఉపగ్రహ చిత్రాలలో, బేర్ ఎడారి లేత గోధుమరంగు, మొక్కలతో కప్పబడిన భూమి ఎరుపు, నీరు నలుపు, పట్టణం ప్రాంతాలు వెండి.

ఆర్థికము

మార్చు

దుబాయ్ ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్. ఇక్కడ ఉన్న జబెల్ అలి పోర్ట్ జబల్ అలి 1970లో నిర్మింపబడింది. ఇది ప్రపంచంలోనే మనుషులతో నిర్మింపబడిన అతిపెద్ద పోర్ట్. దుబాయ్ మీడియా, కంప్యూటర్, సమాచార రంగాలలో కూడా అభివృద్ధి కలిగిన నగరం. టెకమ్ అని పిలువబడే ( TECOM Dubai Technology, Electronic Commerce and Media Free Zone Authority) లో భాగంగా ఇక్కడ కల దుబాయ్ ఇంటర్నెట్ సిటీ (Dubaai Internet City), దుబాయ్ మీడియా సిటీ (Dubai Media City), నాలెడ్జ్ విలేజ్ (Knowledge Willage, దుబాయ్ ఇంటర్ నేషనల్ ఫైనాన్స్ సెంటర్ (Dubai International Financial Centre (DIFC) మొదలగునవి ఉన్నాయి. ఇంటర్ నెట్ సిటీలో ప్రముఖ సంస్థలైన ఇ యమ్ సి కార్పోరేషన్ (EMC Corporation), ఒరాకిల్ కార్పొరేషన్ (Oracle Corporation), మైక్రోసాప్ట్ కార్పొరేషన్ ([:en:[Microsoft|Microsoft]]),, ఐ బి యమ్ (IBM), వంటివి ఉన్నాయి. మీడియా సిటీలో ప్రముఖ సంస్థలైన ఎమ్ బి ఎమ్ (MBC), సి ఎన్ ఎన్ (CNN), రైటర్స్ (Reuters), అసోసియేటెడ్ ప్రెస్ (AP) వంటివి ఉన్నాయి.

రవాణా

మార్చు

దుబాయ్ యొక్క ప్రధాన రవాణాలు విమానం, బస్సు. ఇక్కడ రైలు సౌకర్యం ఇంతవరకూ అంటే 2007 వరకూ లేదు. నిర్మాణములో ఉన్న ట్రాక్ 2008 సంవత్సరంలో మొదలవుతుంది.

దుబాయ్ నగరానికి ప్రధాన రహదారి షేఖ్ జాయద్ రోడ్. ఇది మొత్తం ఆరు+ఆరు పన్నెండు లైనుల రోడ్. ఈ రహదారిపై వాహనాలకు సిటీలోపల 120, సిటీ బయట 140 కిలోమీటర్ల వేగం వరకూ పరిమితి ఉంది. ఈ రహదారికి కంప్యూటరు అనుసంధానము కలిగిన టాల్ గేట్స్ (వీటిని సాలిక్ (Salik road toll అని పిలుస్తారు) రెండు చోట్ల ఉన్నాయి. డబ్బు చెల్లించే పద్ధతిలో కాక వాహనము ముందు భాగమున ఒక ట్యాగ్ అతికించి ఉంచుతారు, వారికి ఒక అకౌంటు ఉంటుంది, అందులోనుండి వాహనం టోల్ గేట్ నుండి ప్రయాణించినపుడు డబ్బు మినహాయింపబడుతుంటుంది . ఎంత వేగంలో వెళ్ళే వాహనాన్నయినా టోల్ గేట్ దగ్గర కల స్కానర్ కెమెరాలు ట్యాగులను స్కాన్ చేస్తాయి.

దేవాలయాలు

మార్చు

ఇవీ చూడండి

మార్చు

గ్యాలరీ

మార్చు

మూలాలు

మార్చు
  1. Area of "Dubai emirate", includes artificial islands.
  2. "Statistics Centre: Dubai emirate population is 1,422,000", UAE Interact: UAE Ministry Of Information and Culture, 2006-08-30
  3. Density of "Dubai emirate"
  4. OnlineWeather Portal Archived 2008-01-03 at the Wayback Machine. UAEInteract.com. Retrieved 5/1/2007

బయటి లింకులు

మార్చు
Dubai గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

  నిఘంటువు విక్షనరీ నుండి
  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
  ఉదాహరణలు వికికోట్ నుండి
  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

"https://te.wikipedia.org/w/index.php?title=దుబాయ్&oldid=3868214" నుండి వెలికితీశారు