దుబాయ్ శీను
దుబాయ్ శీను 2007, జూన్ 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, నయనతార జంటగా నటించారు.
దుబాయ్ శీను (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శ్రీను వైట్ల |
---|---|
నిర్మాణం | డి.వి.వి. దానయ్య |
చిత్రానువాదం | గోపీమోహన్ |
తారాగణం | రవితేజ, నయనతార |
సంగీతం | మణిశర్మ |
గీతరచన | సాహితి, రామజోగయ్యశాస్త్రి |
సంభాషణలు | చింతపల్లి రమణ |
ఛాయాగ్రహణం | భరణీ కె.ధరన్ |
నిర్మాణ సంస్థ | యూనివర్శల్ మీడియా |
విడుదల తేదీ | 7 జూన్ 2007 |
భాష | తెలుగు |
కథ
మార్చుడబ్బు సంపాదించేందుకు దుబాయ్ వెళ్లే ప్రయత్నంలో బ్రోకర్ (వేణుమాధవ్) చేతిలో మొసపోయిన శ్రీనివాస్ అలియాస్ శీను (రవి తేజ) డబ్బుపోయి వెనక్కు తిరిగిరాలేక యాతనపడుతుంటారు. ఇదిలా ఉండగా పట్నాయక్ (కృష్ణ భగవాన్) అనే మరో మోసగాడు శీను, ఆయన ఫ్రెండ్స్ కు పావ్ బాజి పెట్టుకోవడానికి సాయం చేస్తున్నాననే సాకుతో వారిని ఉపయోగించుకొని డబ్బు సంపాదిస్తుంటాడు. అన్నను వెదకడానికి ముంబయి వచ్సిన మధుమతి (నయనతార) ని అనుకోకుండా కలుసుకున్న శీను ఆమె ప్రేమలో పడతాడు. తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని మధుమతికి చెబుతాడు. ఆ తరువాత శీను మధుమతికి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. పట్నాయక్, శీను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాదనే నిజం మధుమతికి చెబుతాడు.
ఆమె తిరిగి తన స్వస్థలానికి వస్తుంది. ఇదిలా ఉండగా శీను తన మిత్రుడు చక్రిని (జెడి చక్రవర్తి) కలుసుకుంటాడు. పూజ (నేహ) ను ప్రేమిస్తున్న చక్రికి శీను సాయంతో వారు పెళ్లి చేసుకుంటారు. చక్రి, పూజలు శీను దుబాయ్ వెళ్లడానికి సాయపడతామని హామీ ఇస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేస్తారు. వారు తిరిగి హైదరాబాద్ వద్దమని అనుకుంటుండగా తమ బాస్ మాఫియా డాన్ జిన్నా (సుశాంత్) అని తెలుసుకుంటారు. తనను గుర్తించరని తెలుసుకున్న జిన్నా, ఆయన సోదరుడు (రఘు) శీను కళ్లముందే పూజ,చక్రిలను చంపివేస్తారు. చనిపోయేముందు తనకు మధు అనే చెల్లెలు ఉందని చక్రి చెబుతాడు. శీను హైదరాబాద్ తిరిగి వచ్చి చక్రి తండ్రి చేసిన బ్యాంక్ అప్పు తీర్చి తాకట్టులో ఉన్న ఇల్లును విడిపిస్తాడు. జిన్నాను, ఆయన సోదరుడిని చంపి ప్రతీకారం తీర్చుంటాడు.
నటవర్గం
మార్చు- దుబాయ్ శీను గా రవితేజ
- మధుమతి గా నయనతార
- జె.డి.చక్రవర్తి
- బాబ్జీ గా సాయాజీ షిండే
- సుశాంత్ సింగ్
- నేహ
- భానుచందర్
- సునీల్
- ట్రావెల్ ఏజెంటు నేతాజీ గా వేణుమాధవ్
- రామకృష్ణ బ్రహ్మానందం
- పట్నాయక్ గా కృష్ణభగవాన్
- సుప్రీత్
- రాజా రవీంద్ర
- ఫైర్ స్టార్ సాల్మన్ రాజు గా ఎమ్మెస్ నారాయణ
- శ్రీనివాస రెడ్డి
- సురేఖా వాణి
- రఘుబాబు
- తెలంగాణా శకుంతల
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: శ్రీను వైట్ల
- నిర్మాణం: డి.వి.వి.దానయ్య
- సంగీతం: మణిశర్మ
- గీతరచన: సాహితి, రామజోగయ్య శాస్త్రి
- సంభాషణలు: చింతపల్లి రమణ
- ఛాయాగ్రహణం: భరణీ కె.ధరన్
- నిర్మాణ సంస్థ: యూనివర్శల్ మీడియా
- వన్స్ అప్ ఆన్ , రచన:రామజోగయ్య శాస్త్రి , గానం.కార్తీక్, రీటా
పాటల జాబితా
మార్చు- దీవాలి హోళీ , రచన: రామజోగయ్య శాస్ర్తి, గానం.దీపు, కారుణ్య, కౌసల్య
- శీను శీను , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం. నవీన్
- సుప్ప నాతి , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.మాణిక్య వినాయగం, అనురాధ శ్రీరామ్
- కోల్ కోల్, రచన: సాహితి, గానం , రంజిత్, శైందవి
- కన్యా రాశి, రచన:రామజోగయ్య శాస్త్రి, గానం.విజయ్ జేసుదాస్, సుచిత్ర.