చింతపల్లి రమణ ఒక తెలుగు సినీ మాటల రచయిత. 40 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాడు.[1] సినిమాల్లోకి రాకమునుపు నాటకరంగంలో రచయితగా, దర్శకుడిగా పనిచేశాడు. మొదట్లో సినిమాల్లో సహాయ దర్శకుడిగా చేరి తరువాత సహరచయితగా పనిచేసి తర్వాత పూర్తి స్థాయి రచయితగా మారాడు. రచయితగా రమణ మొదటి సినిమా చిన్నబ్బులు. సుస్వాగతం,[2] తొలిప్రేమ, అరుంధతి లాంటి విజయవంతమైన సినిమాలకు మాటలు రాశాడు. శ్రీను వైట్ల, వై. వి. ఎస్. చౌదరి, పూరీ జగన్నాథ్, వి. వి. వినాయక్, భీమనేని శ్రీనివాసరావు, ఎస్. వి. కృష్ణారెడ్డి, ఎ. కరుణాకరన్ లాంటి ప్రముఖ దర్శకులతో పనిచేశాడు.

చింతపల్లి రమణ
జననం
చింతపల్లి వెంకటరమణ బాబు

ఏప్రిల్ 20
పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా
వృత్తిసినీ రచయిత
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం

వ్యక్తిగత జీవితం

మార్చు

రమణ అసలు పేరు చింతపల్లి వెంకట రమణ బాబు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు లో జన్మించాడు. అతని తండ్రి చింతపల్లి సూర్యనారాయణ రెడ్డి నాటక రచయిత, దర్శకుడు.

సినిమాలు

మార్చు

అసోసియేట్ డైరెక్టరుగా

మార్చు
 • కొంటె కాపురం
 • డబ్బెవరికి చేదు
 • గుండమ్మ గారి కృష్ణులు
 • తోడల్లుళ్ళు
 • భామా కలాపం
 • పూల రంగడు
 • పద్మావతి కల్యాణం
 • పోలీస్ భార్య
 • శ్రీవారి చిందులు
 • కొబ్బరి బోండాం

సహరచయితగా

మార్చు
సినిమా నిర్మాత దర్శకుడు విడుదల సంవత్సరం
శుభాకాంక్షలు (సినిమా) శ్రీ సాయిదేవా ప్రొడక్షంస్ భీమనేని శ్రీనివాస రావు 1997
మా ఆయన బంగారం ఈతరం ఫిలింస్ మోహన్ గాంధీ 1997
సూర్యవంశం సూపర్ గుడ్ ఫిలింస్ భీమనేని శ్రీనివాస రావు 1997

సంభాషణల రచయితగా

మార్చు
సినిమా నిర్మాత దర్శకుడు విడుదల సంవత్సరం
చిన్నబ్బులు శ్రీ సాయిచిత్ర ఎ. ఆర్. కె. మోహన్ 1995
సుస్వాగతం సూపర్ గుడ్ ఫిలింస్ భీమనేని శ్రీనివాస రావు 1998
తొలి ప్రేమ ఎస్. ఎస్. సి ఆర్ట్స్ ఎ. కరుణాకరన్ 1998
సుప్రభాతం ఎన్. వి. ఎస్. ప్రొడక్షన్స్ భీమనేని శ్రీనివాస రావు 1999
తమ్ముడు శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిలింస్ పి. ఎ. అరుణ్ ప్రసాద్ 1999
యువరాజు శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిలింస్ వై. వి. ఎస్. చౌదరి 2000
కౌరవుడు అంజనా ప్రొడక్షన్స్ జ్యోతి కుమార్ 2000
బాచి శ్రీ శ్రీనివాస ఆర్ట్స్ పూరి జగన్నాథ్ 2000
ప్రియమైన నీకు సూపర్ గుడ్ ఫిలింస్ బాలశేఖరన్ 2001
ఆనందం ఉషా కిరణ్ మూవీస్ శ్రీను వైట్ల 2001
స్నేహమంటే ఇదేరా సూపర్ గుడ్ ఫిలింస్ బాలశేఖరన్ 2001
ప్రియనేస్తమా ఉషా కిరణ్ మూవీస్ ఆర్. గణపతి 2002
ఆడుతూ పాడుతూ సి. వి. ఆర్ట్స్ దేవీ ప్రసాద్ 2002
ఫ్రెండ్స్ శ్రీ మాతా ఆర్ట్స్ బండి రమేష్ 2002
లాహిరి లాహిరి లాహిరిలో బొమ్మరిల్లి సినిమా వై. వి. ఎస్. చౌదరి 2002
సొంతం జె. డి. ఆర్ట్స్ శ్రీను వైట్ల 2002
సందడే సందడి ఆదిత్యరాం మూవీస్ ముప్పలనేని శివ 2002
పెళ్ళాం ఊరెళితే సిరి మీడియా ఆర్ట్స్ ఎస్. వి. కృష్ణారెడ్డి 2003
దిల్ శ్రీ వేంకటేశ్వర క్రియేషంస్ వి. వి. వినాయక్ 2003
ఒట్టేసి చెబుతున్నా శ్రీ క్రియేషన్స్ ఇ. సత్తిబాబు 2003
వసంతం శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ విక్రమన్ 2003
అభిమన్యు శ్రీ రాక్ లైన్ మూవీస్ ఎ. మల్లికార్జున్ 2003
నీకే మనసిచ్చాను జి. ఎస్. కె. ఆర్ట్స్ సూర్యతేజ 2003
లవ్ టుడే సూపర్ గుడ్ ఫిలింస్ అర్పుధం 2004
అందరూ దొంగలే జియో మీడియా ఆర్ట్స్ నిధి ప్రసాద్ 2004
దొంగ దొంగది శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ శివ సుబ్రహ్మణ్యం 2004
ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సిరి మీడియా ఆర్ట్స్ వాసు 2004
లేత మనసులు శ్రీ శివసాయి పిక్చర్స్ ఎస్. వి. కృష్ణారెడ్డి 2004
ఒరేయ్ పండు గిరీష్ పిక్చర్స్ ఎస్. వి. కృష్ణారెడ్డి 2005
దేవదాసు బొమ్మరిల్లు సినిమా వై. వి. ఎస్. చౌదరి 2006
రారాజు ఎస్. ఎస్. సి. ఆర్ట్స్ ఉదయ శంకర్ 2006
దుబాయ్ శీను యూనివర్సల్ మీడియా శ్రీను వైట్ల 2007
ఒక్క మగాడు బొమ్మరిల్లు సినిమా వై. వి. ఎస్. చౌదరి 2008
ఉల్లాసంగా ఉత్సాహంగా అమృత్ అమర్నాథ్ ఆర్ట్స్ ఎ. కరుణాకరన్ 2008
అరుంధతి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కోడి రామకృష్ణ 2009
సలీం శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ వై. వి. ఎస్. చౌదరి 2009
నమో వెంకటేశ సురేష్ ప్రొడక్షన్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ శ్రీను వైట్ల 2010
మౌనరాగం శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ విజయ్ బాలాజీ 2010
మారో శ్రీ రాజేశ్వరి ఫిలింస్ సిద్ధిక్ 2011
ఒక్కడినే గులాబీ మూవీస్ శ్రీనివాస్ రాగ 2012

మూలాలు

మార్చు
 1. "చింతపల్లి రమణ". tollywoodtimes.com. టాలీవుడ్ టైమ్స్. Retrieved 12 November 2016.[permanent dead link]
 2. "డై..లాగి కొడితే..." sakshi.com. సాక్షి. Retrieved 12 November 2016.

బయటి లింకులు

మార్చు