దురస్తు (తెలంగాణ కథ 2022)


దురస్తు (తెలంగాణ కథ 2022) అనేది సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) ప్రచురించిన పుస్తకం.[1] తెలంగాణ కథా సిరీస్ లో భాగంగా ప్రచురించబడిన పదవ పుస్తకం ఇది. 16 కథలున్న ఈ పుస్తకంలోని కథలు 2022 నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను అనేక కోణాల్లో, ఎంతో సమర్థవంతంగా చిత్రించాయి.

దురస్తు (తెలంగాణ కథ 2022)
దురస్తు (తెలంగాణ కథ 2022) పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కథా సంకలనం
సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్
డా. వెల్దండి శ్రీధర్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: సింగిడి (తెలంగాణ రచయితల సంఘం)
విడుదల: 2023 డిసెంబరు 24
పేజీలు: 156

సంపాదకులు

మార్చు

కథల నేపథ్యం

మార్చు

నిరుద్యోగం, మద్యపానం, తాత్సారపు రాజకీయాలు, మారుతున్న సమాజంలో ఆధిపత్య సంస్కృతి, సాంకేతిక ప్రగతి, ఆధునిక జీవనసరళి, మనుషుల ఎగుడు దిగుడుల స్వభావాలు, స్త్రీల హక్కులు, ఆటిజం, విప్లవోద్యమాల డొల్లతనం వంటి సమస్యలు ఈ సంకలనంలోని కథలు ఇతివృత్తాలుగా తీసుకోబడ్డాయి.[2]

బలవంతులు బలహీనుల భూములను తమ పేరు మీద మార్చుకొని దర్జాగా అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో ‘భూమిపట్టా’, ‘ఋణం’ కథలు... మనుషుల మధ్య భూమి సృష్టిస్తున్న అలజడి, భూమి కోసం రక్త సంబంధీకులు కూడా దూరం అవుతున్నారని మానవ సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలే ప్రధానమనే విధంగా జీవితాలు మారిపోయన్న నేపథ్యంలో ‘జాయిజాదులు’, ‘పెద్దబతుకమ్మ’ కథలు... పేదరికం నేపథ్యంలో ‘అలుకుపూత’ కథ... భూమిని వదిలిపెట్టి కుల వృత్తిని నమ్ముకున్నా బతుకుదెరువు కరువే అయిందన్న నేపథ్యంలో ‘సారె’, ‘జెజ్జెనక..’ కథలు... బాధను గుండెలో దాచుకొని పరిస్థితుతో కలబడే నేపథ్యంలో ‘బోన్గిరి టు లష్కర్’, ‘సుభాషిణి పెళ్లి’ కథలు... ఐటి రంగంలోని డొల్లల నేపథ్యంలో ‘సూర్యుని నీడ’ కథ...

ఆవిష్కరణ

మార్చు

నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల వేదికగా 2023, డిసెంబరు 24న ఈ పుస్తకం ఆవిష్కరించబడింది.[3] డా. సంగిశెట్టి శ్రీనివాస్‌ సభాధ్యక్షతన జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ పుస్తకావిష్కరణ చేశాడు.[4] ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి మేరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్‌ పగడాల నాగేందర్‌, నల్లగొండ కథ పాఠశాల నిర్వాహకులు పెరుమళ్ల ఆనంద్‌, డాక్టర్‌ సాగర్ల సత్తయ్య, డాక్టర్‌ బెల్లి యాదయ్య, భూతం ముత్యాలు, ఉప్పల పద్మ, మునాస్‌ వెంకట్‌, అంబటి వెంకన్న, తండు కృష్ణకౌండిన్య, విశ్రాంత ఐఏఎస్‌ చొల్లేటి ప్రభాకర్‌, స్కై బాబ తదితరులు పాల్గొన్నారు.[5]

విషయసూచిక

మార్చు
క్రమసంఖ్య కథ పేరు రచయిత పేరు
1 మా సెల్లే మల్లక్క జూపాక సుభద్ర
2 అలుకుపూత రావుల కిరణ్మయి
3 బోన్గిర్ టు లష్కర్ డా. జైనీ ప్రభాకర్
4 స్తూపం పి. చందు
5 సుభాషిణి పెళ్ళి విశీ
6 భూమి పట్టా బద్ది గణేశ్
7 సూర్యుడి నీడలు కె.వి. మన్ ప్రీతమ్
8 వెలుగు రేక స్వర్ణ కిలారి
9 జాయిజాదులు కొట్టం రామకృష్ణారెడ్డి
10 పెద్ద బతుకమ్మ చందు తులసి
11 ఆత్మ.. అగ్ని అది నిన్ను దహిస్తుంది రామా చంద్రమౌళి
12 ఖుష్ మిజాజ్ స్కై బాబ
13 ఉల్లిపూసలు పెద్దింటి అశోక్ కుమార్
14 ఋణం గాజోబు నాగభూషణం
15 సారె డా. సాగర్ల సత్తయ్య
16 జెజ్జెనక డా. పసునూరి రవీందర్

మూలాలు

మార్చు
  1. "నడుస్తున్న చరిత్రకు కథ ప్రతిబింబం: సుద్దాల". EENADU. 2023-12-25. Archived from the original on 2024-02-16. Retrieved 2024-02-16.
  2. krishna (2023-12-17). "జీవితాలను 'దురస్తు' చేసిన కథలు". Mana Telangana. Archived from the original on 2023-12-17. Retrieved 2024-02-17.
  3. ABN (2023-12-25). "నడుస్తున్న చరిత్రకు ప్రతిబింబం 'కథ'". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-12-24. Retrieved 2024-02-16.
  4. Velugu, V6 (2023-12-25). "నడుస్తున్న చరిత్రకు కథ ప్రతిబింబం : సుద్దాల అశోక్ తేజ". V6 Velugu. Archived from the original on 2023-12-26. Retrieved 2024-02-16.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. telugu, NT News (2023-12-25). "సామాజిక చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందజేసేవే కథలు". www.ntnews.com. Archived from the original on 2023-12-26. Retrieved 2024-02-16.