దేవరకొండలో విజయ్ ప్రేమ కథ

2021 తెలుగు సినిమాలు

దేవరకొండలో విజయ్ ప్రేమ కథ 2021లో విడుదలైన ఎమోషనల్ ప్రేమ కథ చిత్రం. శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై పడ్డాన మన్మథరావు నిర్మించిన ఈ సినిమాలో విజయ్ శంకర్, మౌర్యాని, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటించగా ఎస్ వెంకటరమణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 10 మార్చ్ 2021లో విడుదలైంది.[1]

దేవరకొండలో విజయ్ ప్రేమ కథ
దర్శకత్వంఎస్ వెంకటరమణ
స్క్రీన్ ప్లేపడ్డాన మన్మథరావు
నిర్మాతపడ్డాన మన్మథరావు
తారాగణంవిజయ్ శంకర్, మౌర్యాని, నాగినీడు
ఛాయాగ్రహణంఅమర్. జి
సంగీతంసదాచంద్ర
నిర్మాణ
సంస్థ
శివత్రి ఫిలిమ్స్‌
విడుదల తేదీ
10 మార్చి 2021 (2021-03-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ నేపథ్యం

మార్చు

దేవరకొండ గ్రామంలో గ్రామ పెద్ద సీతారామయ్య (నాగినీడు), ఆయన కూతురు దేవకి (మౌర్యానీ) అదే ఊరిలో ఆటో నడుపుకునే యువకుడు విజయ్ (విజయ్ శంకర్). అతనిది మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచే విజయ్, దేవకి స్నేహితులు. వారితో పాటు వారి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. ఓ సందర్భంలో వీరి ప్రేమ విషయం బయటపడుతుంది. అంతస్తు, గౌరవం, కులం ఇలా అనేక కారణాలతో దేవకి తండ్రి సీతారామయ్య వీరి ప్రేమను నిరాకరిస్తాడు.తన కూతురు ప్రేమ సంగతి తెలిసిన సీతారామయ్య ఊరి వాళ్ల ముందు తన పరువు తీసిందనే కోపంతో దేవకి, విజయ్ లను ఊరి నుంచే వెలివేస్తాడు. అలా బయటకొచ్చి పెళ్లి చేసుకున్న దేవకి, విజయ్ ఊరు బయట పాడుపడిన ఇంట్లో కాపురం ఉంటారు. బాగా చదువుకుని తండ్రికి పేరు తీసుకురావాలని దేవకి నిర్ణయించుకుంటుంది. భార్యను ఏ లోటూ లేకుండా చూసుకోవాలని విజయ్ ఆలోచిస్తుంటాడు. ఇంతలో కథలు ఒక ఊహించని మలుపు వస్తుంది. ఆ మలుపు ఏంటి, దాంతో ఈ జంట జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. 10TV (11 March 2021). "దేవరకొండలో విజయ్ ప్రేమ కథ రివ్యూ | Devarakondalo Vijay Premakatha Review". 10TV (in telugu). Archived from the original on 19 మే 2021. Retrieved 19 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. HMTV (10 March 2021). "Movie Review: దేవరకొండలో విజయ్ ప్రేమ కథ సినిమా రివ్యూ". Archived from the original on 19 మే 2021. Retrieved 19 May 2021.
  3. Tv5news, Nagesh (11 March 2021). "Devarakondalo vijay prema katha : 'దేవరకొండలో విజయ్ ప్రేమ కథ' మూవీ రివ్యూ". www.tv5news.in (in ఇంగ్లీష్). Retrieved 19 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)