దేవూరి శేషగిరిరావు

దేవూరి శేషగిరిరావు (1918 సెప్టెంబరు 9, -1948 ఫిబ్రవరి 15 ) తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు.[1] 1935లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌ను ప్రారంభించి, కార్మికులను వెట్టిచాకిరీ నుంచి విముక్తి చేయడంలో కీలకపాత్ర పోషించాడు.[2]

దేవూరి శేషగిరిరావు
దేవూరి శేషగిరిరావు
జననందేవూరి శేషగిరిరావు
సెప్టెంబర్ 9, 1918
మరణంఫిబ్రవరి 15, 1948
మరణ కారణంరజాకార్లచే తుపాకీతో కాల్చివేత
ప్రసిద్ధితెలంగాణా సాయుధ పోరాటం లో నాయకుడు

శేషగిరిరావు 1918, సెప్టెంబరు 9న నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాళెం గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.

విద్యాభ్యాసం - ఉద్యోగం

మార్చు

1939లో నెల్లూరులో వెంకటగిరి రాజా కాలేజీలో బి.ఎ. పట్టాపొందిన శేషగిరిరావు, కొత్తగూడెం సింగరేణి కాలరీస్‌ హెడ్ ఆఫీసులో అకౌంటెంట్‌గా చేరాడు.

ఉద్యమ ప్రస్థానం

మార్చు

సింగరేణిలో రజాకార్ల దుర్మార్గాలు, కాంట్రాక్టర్ల దోపిడీలను చూసిన శేషగిరిరావు వాటిపై తిరుగుబాటుచేశాడు. సర్వదేవభట్ల రామనాథం, కారేపల్లి రాఘవరావు, ఎం. కొమరయ్య, పర్సా సత్యనారాయణ, మగ్దూం మొహియుద్దీన్, రాజ్ బహదూర్ గౌర్ మొదలై నాయకులతో కలిసి కార్మికుల సమస్యలపై కమ్యూనిస్టు పార్టీ తరపున ఉద్యమం చేశాడు. 1935లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌ను ప్రారంభించాడు. కొత్తగూడెం ప్రాంతంలో ఆజ్ఞాతంలో ఉన్న శేషగిరిరావు, అక్కడినుండి యూనియన్‌ కార్యకలాపాలు నిర్వహించారు. 1947, ఫిబ్రవరిలో నైజాం పోలీసులు శేషగిరిరావును అరెస్టు చేసి హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలుకు తరలించారు. విడుదలైన తరువాత గెరిల్లా దళనాయకుడిగా కొత్తగూడెం వచ్చి, భద్రాచలం సెంటర్‌లో రహస్యంగా తిరుగుతూ పార్టీ నిర్మాణ పనులు చేశాడు. ఆ తరువాత 10 మందితో చిన్నచిన్న గెరిల్లా బృందాలను ఏర్పాటుచేసి, దళ నాయకులుగా ఉన్నాడు.

1948, ఫిబ్రవరి 15న శేషగిరిరావు తన ఇద్దరు సహచరులతో గోదావరి నది దాటి నెల్లిపాక మీదుగా తుమ్మల చెరువు ప్రాంతానికి వెళ్తున్న సమయంలో నిజాం పోలీసులు చుట్టుముట్టి శేషగిరిరావు, ఒంటెద్దు రంగయ్య, కంగాల పాపయ్యలను కాల్చి చంపారు.

మూలాలు

మార్చు
  1. శ్రామిక జన ఆశాజ్యోతి కామ్రేడ్‌ శేషగిరిరావు,'ఖమ్మంజిల్లా కమ్యూనిస్టు యోధులు', బోడేపూడి విజ్ఞానకేంద్రం (ఖమ్మం), జనవరి 2012, పుట. 126.
  2. నమస్తే తెలంగాణ, నిపుణ (13 October 2015). "రాష్ట్రంలో సంఘాలు - విశేషాలు". Archived from the original on 24 December 2018. Retrieved 24 December 2018.