దేవేష్ చంద్ర ఠాకూర్

దేవేష్ చంద్ర ఠాకూర్ (జననం 3 జూలై 1953) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2002 నుండి 2020 వరకు నాలుగు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్‌గా, మంత్రిగా పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీతామర్హి లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

దేవేష్ చంద్ర ఠాకూర్
దేవేష్ చంద్ర ఠాకూర్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు సునీల్ కుమార్ పింటూ
నియోజకవర్గం సీతామర్హి

పదవీ కాలం
25 ఆగస్టు 2022 – 14 జూన్ 2024
గవర్నరు రాజేంద్ర అర్లేకర్
ఫగు చౌహాన్
ముందు అవధేష్ నారాయణ్ సింగ్

బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి
పదవీ కాలం
2008 – 2008
గవర్నరు ఆర్.ఎస్. గవై
ఆర్.ఎల్. భాటియా

పదవీ కాలం
2002 – 14 జూన్ 2024
నియోజకవర్గం తిర్హట్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1953-07-03) 1953 జూలై 3 (వయసు 71)
సీతామర్హి
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (యునైటెడ్)
నివాసం సీతామర్హి
పూర్వ విద్యార్థి • ఫెర్గూసన్ కాలేజ్, పూణే (బిఎ ఆనర్స్ )
• ఐఎల్ఎస్, పూణే (ఎల్‌ఎల్‌బీ)
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

దేవేష్ చంద్ర ఠాకూర్ 1953 జూలై 3న సీతామర్హిలో జన్మించాడు. ఆయన తన ప్రాథమిక విద్యను గ్రామంలో పూర్తి చేసి ఆ తర్వాత పూణేలోని సైనిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. దేవేష్ చంద్ర ఠాకూర్ పూణేలోని ఫెర్గూసన్ కాలేజీ నుండి ఉన్నత విద్యను, ఆ తరువాత ఐఎల్ఎస్ లా కాలేజీ (పుణె) నుండి న్యాయశాస్త్రం (ఎల్‌ఎల్‌బీ) పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

దేవేష్ చంద్ర ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేసి ఆ తరువాత 1990 బీహార్ శాసనసభ ఎన్నికలలో బత్నాహా శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సూర్యదేవ్ రే చేతిలో ఓడిపోయి మూడవ స్థానంలో నిలిచాడు. ఆయన ఆ తరువాత 2002లో జరిగిన బీహార్ శాసనమండలి ఎన్నికలలో తిర్హట్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత జేడీయూలో చేరాడు.

దేవేష్ చంద్ర ఠాకూర్ 2008, 2014, 2020లో జరిగిన బీహార్ శాసనమండలి ఎన్నికలలో తిర్హట్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్సీగా ఎన్నికై విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా, 25 ఆగస్టు 2022 నుండి 14 జూన్ 2024 వరకు బీహార్ శాసనమండలి చైర్మన్‌గా పని చేశాడు.[2][3]

దేవేష్ చంద్ర ఠాకూర్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీతామర్హి లోక్‌సభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి అర్జున్ రాయ్‌పై 51,356 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

మార్చు
  1. TV9 Bharatvarsh (17 June 2024). "यादवों और मुसलमानों का कोई काम नहीं करेंगे... ऐलान करने वाले JDU सांसद देवेश चंद्र ठाकुर कौन हैं?". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. News18 (25 August 2022). "JD(U) Leader Devesh Chandra Thakur Elected Chairman of Bihar Legislative Council" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Week (14 June 2024). "Bihar Legislative Council chairman resigns" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  4. Election Commision of India (5 June 2024). "2024 Loksabha Elections Results - Sitamarhi". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.