దౌలత్ బేగ్ ఓల్డీ

లడఖ్‌లో భారత సైనిక శిబిరం ఉన్న స్థలం

దౌలత్ బేగ్ ఓల్డీ (డిబిఓ) లడఖ్లో చారిత్రిక ప్రశస్తి కలిగిన శిబిర స్థలం. ప్రస్తుత భారత సైనిక స్థావరం. ఇది లడఖ్‌ను తారిమ్ బేసిన్‌నూ కలిపే పురాతన వాణిజ్య మార్గంలో ఉంది. ప్రస్తుత చైనా లోని యార్కండ్ ప్రాంతాన్ని పరిపాలించే సుల్తాన్ సయిద్ ఖాన్ (దౌలత్ బేగ్) లడఖ్, కాశ్మీర్ లను ఆక్రమించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా అతడు ఈ ప్రదేశం లోనే మరణించాడు. అతడి పేరిటే దీనికి ఈ పేరు వచ్చింది. చిప్ చాప్ నది దౌలత్ బేగ్ ఓల్డీకి దక్షిణాన, తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తుంది. 5,065 మీటర్లు (16,614 అడుగులు) ఎత్తున ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్‌స్ట్రిప్ లలో ఒకటి.

దౌలత్ బేగ్ ఓల్డీ
సైనిక స్థావరం
దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద ఉన్న ALG నుండి భారతీయ వాయుసేన కు చెందిన An-32 విమానం పైకి లేస్తున్న దృశ్యం
దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద ఉన్న ALG నుండి భారతీయ వాయుసేన కు చెందిన An-32 విమానం పైకి లేస్తున్న దృశ్యం
దౌలత్ బేగ్ ఓల్డీ is located in Ladakh
దౌలత్ బేగ్ ఓల్డీ
దౌలత్ బేగ్ ఓల్డీ
లడక్, భారతదేశం
దౌలత్ బేగ్ ఓల్డీ is located in India
దౌలత్ బేగ్ ఓల్డీ
దౌలత్ బేగ్ ఓల్డీ
దౌలత్ బేగ్ ఓల్డీ (India)
Coordinates: 35°23′24″N 77°55′30″E / 35.390°N 77.925°E / 35.390; 77.925
దేశం India
కేంద్రపాలిత ప్రాంతంల్డఖ్
జిల్లాలేహ్
Elevation
5,100 మీ (16,700 అ.)
Time zoneUTC+5:30 (IST)
దౌలత్ బేగ్ ఓల్డీ - వాస్తవాధీన రేఖ దగ్గర
లడఖ్ ఉత్తర భాగంలో దౌలత్ బేగ్ ఓల్డీ (1988 CIA పటం).

ప్రదేశం, భౌతిక పరిస్థితులు మార్చు

దౌలత్ బేగ్ ఓల్డీ భారతదేశానికి ఉత్తరాన, కారకోరం శ్రేణికి తూర్పున ఉన్న శీతల ఎడారి ప్రాంతంలో ఉంది. చైనా సరిహద్దుకు దక్షిణాన కేవలం 8 కి.మీ. దూరంలో. అక్సాయ్ చిన్ లోని వాస్తవ నియంత్రణ రేఖకు వాయవ్యాన 9 కి.మీ. దూరం లోనూ ఉంది. సియాచెన్ హిమానీనదం తరువాత, అత్యంత ఉత్తరాన ఉన్న భారత సైనిక స్థావరం ఇది. దీనికి దక్షిణాన ఉన్న ముర్గో, సమీప పౌర పట్టణం. ఇక్కడ కొద్దిపాటి సంఖ్యలో బాల్టీలు నివసిస్తూంటారు. [1]

లేహ్ నుండి డౌలత్ బేగ్ ఓల్డీ వరకు ఒక రహదారి నిర్మాణానికి భారత ప్రభుత్వం 2001 లో ప్రణాళికలను ప్రకటించింది. ఈ రహదారి 2019 లో పూర్తయింది. 255 కి.మీ డార్బుక్-ష్యోక్-డిబిఓ రోడ్డు 4,000–5,000 మీటర్ల (13,000–16,000 అడుగులు) ఎత్తున నడుస్తుంది. ప్రయాణ సమయం ఆరు గంటలు అని చెబుతారు. [2]

శీతాకాలంలో ఉష్ణోగ్రత -55 oC కంటే తక్కువకు పడిపోతుంది. బలమైన మంచు గాలులతో DBO వాతావరణం తరచూ క్షీణిస్తూంటుంది. ఇక్కడ వృక్ష, జంతు జాలాలు బహు స్వల్పం. ఇన్‌మార్‌శాట్ (ఉపగ్రహ) ఫోన్‌ల ద్వారా మాత్రమే ఇక్కడ కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది.

చరిత్ర మార్చు

సయిద్ ఖాన్ (ఎటిమాలజీ) యాత్ర మార్చు

తుర్కి భాషలో దౌలత్ బేగ్ ఓల్డీ అంటే అర్థం "గొప్ప ధనవంతుడు మరణించిన చోటు" అని. [3] [4] ఇది ఎవరి గురించి ప్రస్తావించారనే విషయమై వివిధ జానపద కథలు ఉన్నాయి-ఓ పెద్ద బిడారును నాశనం చేసిన ప్రదేశం అనీ, [5] ఓ ధనవంతుడినీ, అతడి సంపదనూ సమాధి చేసిన స్థలం అనీ.., ఇలాగ. [6]

బ్రిటిషు వలస కాలపు సర్జన్ హెన్రీ వాల్టర్ బెలెవ్ ప్రకారం, [7] దౌలత్ బేగ్ ఓల్డీ అంటే "దేశ ప్రభువు ఇక్కడ మరణించాడు" అని అర్థం అని చెప్పాడు. ప్రభువు అంటే 16 వ శతాబ్దం ప్రారంభంలో యార్కెంట్ ఖానేట్‌కు చెందిన సుల్తాన్ సయిద్ ఖాన్ అని అతడు అన్నాడు. [8] లడఖ్లో ఒక దండయాత్ర చేసి యార్కెంట్‌కు (ప్రస్తుత యార్కండ్) తిరిగి వస్తున్నప్పుడు ఖాన్, ఈ చోటనే మరణించాడు. [9] అతను చేసిన దండయాత్రలకు గాను అతణ్ణి ఘాజా అనే పిలవడం కద్దు. [10]

ఈ సైనిక యాత్రకు సంబంధించిన కథనాన్ని సుల్తాన్ వేలు విడిచిన సోదరుడూ అతని సేనాధిపతీ అయిన మీర్జా ముహమ్మద్ హైదర్ దుగ్లత్, తన రచన తారిఖ్-ఇ-రషీది (رشیدی) ( రషీద్ చరిత్ర ) లో నమోదు చేశాడు. [7]

1531 శరదృతువులో (సఫర్ 938 AH ), సుల్తాన్ సయిద్ ఖాన్ యార్కాండ్ నుండి హైదర్ తో పాటు కొన్ని వేల మంది సైనికులతో బయలుదేరాడు. మొదటిసారి కారకోరం దాటినప్పుడే సుల్తాన్ తీవ్రమైన ఎత్తు ప్రదేశాల్లో వచ్చే అనారోగ్యం పాలయ్యాడు. కాని కోలుకోగలిగాడు. కొన్ని నెలల పాటు సాగిన దండయాత్రలో వారు నుబ్రా లోయను నాశనం చేయగలిగారు. శీతాకాలం సమీపిస్తున్న సమయంలో వారు, తమ బలగాలను విభజించారు. సుల్తాన్ బాల్టిస్తాన్‌కు బయలుదేరగా, హైదర్ కాశ్మీర్‌కు బయలుదేరాడు. బాల్టిస్తాన్లో, సుల్తాన్‌కు స్నేహపూర్వక ముస్లింల జనాభా ఎదురైంది. కాని అతను వారిని చంపడం, బానిసలుగా మార్చడం చేసాడు. బహుశా వారు షియా ప్రజలు కావడం, సనాతన యార్కండి సున్నీలకు వాళ్ళంటే పడకపోవడం అందుకు కారణం కావచ్చు. కాశ్మీర్ మార్గంలో, హైదర్ జోజి లా వద్ద ద్రాస్ ను ఓడించాడు. కాశ్మీర్లో, అతడికి శ్రీనగర్ రాజు ఆతిథ్యం ఇచ్చాడు. వసంత ఋతువులో, రెండు సైనిక దళాలూ మర్యూల్‌‌లో తిరిగి కలుసుకున్నాయి. సుల్తాన్ యార్కండ్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. కాని బయలుదేరే ముందు, ఇస్లాం కోసం టిబెట్‌ను జయించమని అతడూ హైదర్‌ను ఆదేశించాడు . [8] [11]

1533 వేసవిలో (939 AH ముగింపు) యార్కండ్కు తిరిగి వెళ్ళేటప్పుడు, సుల్తాన్ మరోసారి ఎత్తు ప్రదేశాల అనారోగ్యానికి గురయ్యాడు. ఈసారి కారకోరం కనుమ సమీపంలో అనారోగ్యానికి గురయ్యాడు. అతడు దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద మరణించాడని బెల్ల్యూ వాదించాడు. సుల్తాన్ మరణ వార్త వారసుల మధ్య రక్తపాతానికి దారితీసింది. అబ్దురషీద్ ఖాన్ గద్దెనెక్కాడు. అబ్దురషీద్ ఖాన్ టిబెట్‌లోని బలగాలను వెనక్కి రప్పించి హైదర్‌ను దేశం నుండి బహిష్కరించాడు. అప్పటికి, హైదర్, బర్యాంగ్ వద్ద చాంగ్‌పా టిబెటన్లపై కొన్ని విజయాలను సాధించాడు. కానీ ఎత్తు ప్రదేశాల వలన, ప్రకృతి తాకిడికీ అతడు చాలామంది సైనికులను కోల్పోయాడు. బయలుదేరేటప్పుడు వేలాది మంది ఉన్న సైన్యంలో యార్కండ్‌కు తిరిగి వచ్చిన వాళ్ళ సంఖ్య డజను కన్నా తక్కువే. బహిష్కృతుడైన్ హైదర్, బదక్షణ్‌ లోని తన పిన్ని వద్ద ఆశ్రయం పొందాడు. అతను చివరికి మొఘల్ సామ్రాజ్య సైన్యంలో చేరాడు. అక్కడే అతడు తారిఖ్-ఇ-రషీదీ వ్రాసాడు. [8] [11] [12]

ఆధునిక యుగం మార్చు

కారకోరం కనుమ ద్వారా పోయే వాణిజ్య మార్గాన్ని లే, తారిమ్ బేసిన్‌ల మధ్య ప్రయాణించే యాత్రికులు ఉపయోగించారు. ఓల్డీ, యాత్రికులకు విశ్రాంతి ప్రదేశమే తప్ప, అక్కడ శాశ్వత నివాసమున్న జనాభా ఉండేది కాదు. 1962 భారత చైనా యుద్ధం తరువాత భారత, చైనాలు తమ సరిహద్దులను మూసివేసాయి. సరిహద్దు వాణిజ్యాన్ని చాలావరకు ఆగిపోయింది.

ఏప్రిల్ 2013 లో, చైనా సైన్యానికి చెందిన ప్లాటూన్-పరిమాణపు బృందం DBO కి ఆగ్నేయంగా 30 కి.మీ. దూరాన ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. [13] ఇది భారత సైన్యానికి చెందిన "DBO సెక్టార్" లోని స్థానం. వాస్తవాధీన రేఖ స్థానం గురించి తమకున్న అవగాహన మేరకు భారత శిబిరం, చైనా 10 కి.మీ.. దూరం చిరబడిందని మొదట పేర్కొంది. ఆ తరువాత దాన్ని 19 కి.మీ. అని సవరించింది. [14] ఈ సంఘటనలో చైనా సైనిక హెలికాప్టర్లు భారత గగనతలాన్ని ఉల్లంఘించాయని కూడా పేర్కొన్నారు. [15] మే ప్రారంభంలో, ఇరుపక్షాలు తమ యూనిట్లను వెనక్కి తీసుకున్నాయి.

అధునాతన ల్యాండింగ్ గ్రౌండ్ మార్చు

దౌలత్ బేగ్ ఓల్డీ అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్
 
సంగ్రహం
విమానాశ్రయ రకంసైనిక
కార్యనిర్వాహకత్వంభారతీయ వాయుసేన
ప్రదేశంలడఖ్, భారతదేశం
ఎత్తు AMSL16,730 ft / 5,099 m

భారత సైన్యం ఇక్కడ హెలిప్యాడ్‌లు, ఎయిర్‌స్ట్రిప్‌నూ నిర్వహిస్తోంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్‌స్ట్రిప్. ఇక్కడున్న దళాలకు సహాయ సామాగ్రిని అందించడానికి ఏఎన్-32 విమానాలను వాడుతూంటారు. [16] 1962 నాటి భారత చైనా యుద్ధ సమయంలో ఈ స్థావరాన్ని స్థాపించారు. మొదటి ల్యాండింగుతో స్క్వాడ్రన్ లీడర్ సికెఎస్ రాజే, ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తున చేసిన ల్యాండింగుగా రికార్డు సృష్టించాడు. ఇది 1962 నుండి 1966 వరకు అమెరికా సరఫరా చేసిన ఫెయిర్‌చైల్డ్ ప్యాకెట్‌లతో నిర్వహించారు. భూకంపం వలన నేల వదులైపోవడంతో దీన్ని మూసివేయవలసి వచ్చింది. ఆ తరువాత ఈ ప్రాంతం విమానాల ల్యాండింగుకు అనుకూలంగా లేదు. [17] ఎయిర్‌ఫీల్డ్ మళ్లీ పనిచేసేలా పనులు చేపట్టారు. 2008 మే 31 న, ఒక భారతీయ వైమానిక దళపు ఏఎన్-32 మళ్ళీ ల్యాండ్ అయింది. [18]

భారత వైమానిక దళం1962 - 1965 మధ్య ఇక్కడ రవాణా చేసింది. మళ్ళీ 43 సంవత్సరాల విరామం తరువాత, 2008 లో DBO వద్ద ల్యాండింగులు ప్రారంభించింది. దాని సామర్థ్యాలను గణనీయంగా ప్రదర్శిస్తూ, భారత వైమానిక దళం 2013 ఆగస్టు 20 న దౌలత్ బేగ్ ఓల్డీలో, 2013 దౌలత్ బేగ్ ఓల్డీ సంఘటన జరిగిన ప్రదేశం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో సి -130 జె సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని దించింది. ఈ ఎత్తులో ఒక మీడియం-లిఫ్ట్ విమానం ల్యాండింగవడం ప్రపంచ రికార్డు అవుతుంది. [19] [20] [21]

భారత చైనా సరిహద్దు సమావేశ స్థలం మార్చు

భారత సైన్యం, చైనా సైన్యం క్రమం తప్పకుండా సంప్రదింపులు, పరస్పర చర్యలు జరిపేందుకు అధికారికంగా అంగీకరించిన ఐదు సరిహద్దు అధికారుల సమావేశ స్థలాల్లో దౌలత్ బేగ్ ఓల్డీ - టియాన్వెండియన్ అత్యంత ఎత్తున ఉన్నది. ఇది ప్రతిష్ఠంభనలను తగ్గించడంలో తోడ్పడుతుంది. [22] ఈ ప్రదేశంలో మొదటి సమావేశం 2015 ఆగస్టు 1 న ( పిఎల్‌ఎ డే ) జరిగింది. ఈ కార్యక్రమాలలో చైనీస్ సాంస్కృతిక కార్యక్రమం సంబంధాలు మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఇతర వేడుకలూ ఉన్నాయి. ఆ నెలాఖరులో, భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత సైన్యం, పిఎల్‌ఎ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇచ్చింది. భారతీయ సంస్కృతి, గట్కా మార్షల్ ఆర్ట్స్మ్, ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ ప్రదర్శించిన మోటారుసైకిల్ విన్యాసాలు, సాంప్రదాయిక పాటలు, నృత్యాలతో వేడుక జరుపుకున్నారు. [23] నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా మొట్టమొదటి సారి సమావేశం 2016 లో జరిపారు.

సమావేశ స్థానం తెరిచిన సుమారు సంవత్సరం తరువాత సమావేశాల కోసం ఒక గుడిసెను నిర్మించారు. [24]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. PTI (19 April 2013). "Chinese troops intrude into Indian territory in Ladakh, erect a tented post". The Economic Times. Retrieved 2 January 2020. The nearest inhabited town is Murgo to the south, which has a small population of Baltis who primarily depend on apricot farming and yak rearing.
  2. "India completes vital Ladakh road".
  3. Swami, Praveen (23 April 2013). "Ladakh incursion: India, China face-off at the 'gate of hell'". Firstpost. Retrieved 2 January 2020. Daulat Beg Oldi, the spot where the great and rich man died
  4. Trotter, H. (1878). "On the Geographical Results of the Mission to Kashghar, under Sir T. Douglas Forsyth in 1873-74". Journal of the Royal Geographical Society of London. 48: 177. doi:10.2307/1798763. ISSN 0266-6235. JSTOR 1798763. Daulat Beguldi (Turki for "Daulat Beg died", an appropriate name for so desolate a spot)
  5. Teg Bahadur Kapur (1987). Ladakh, the Wonderland: A Geographical, Historical, and Sociological Study. Mittal Publications. p. 28. ISBN 978-81-7099-011-6. Daulat Beg and his large caravan was entirely destroyed about eighteen miles from the Karakoram pass on the Indian side.
  6. Kapadia, Harish (2005). Into the Untravelled Himalaya: Travels, Treks, and Climbs. Indus Publishing. p. 186. ISBN 978-81-7387-181-8. It was believed that the rich man, Daulat Beg was buried here with his treasure.
  7. 7.0 7.1 Bellew, Henry Walter (1875). The history of Káshgharia. Calcutta: Foreign Department Press. pp. 66–67. (p66) Daulat Beg Uild ... "The lord of the State died" ... (p67) Hydar ... wrote the Tarikhi Rashidi from which these details are derived
  8. 8.0 8.1 8.2 Kohli, Harish (2000). Across the Frozen Himalaya: The Epic Winter Ski Traverse from the Karakoram to Lipu Lekh. Indus Publishing. pp. 66–67. ISBN 978-81-7387-106-1. According to H.W. Bellew, he was no ordinary traveller but a great warrior, a partisan of Babur, the conqueror of Ferghana and the king of Yarkand and Kashgar.
  9. Albert von Le Coq (14 December 2018). Buried Treasures of Chinese Turkestan: An Account of the Activities and Adventures of the Second and Third German Turfan Expeditions. Taylor & Francis. p. 292. ISBN 978-0-429-87141-2. Daulat Bak Oldi (the royal prince died here), close to the Karakorum pass, is so called because the Sultan Said Khan of Kashgar, on his return from a successful campaign against West Tibet, died here from mountain sickness (Plate 50)
  10. Bhattacharji, Romesh (7 June 2012). Ladakh - Changing, yet Unchanged. Rupa Publications Pvt Ltd. ISBN 978-8129117618. Some 400 years earlier, in ad 1527, a Yarkandi invader, Sultan Saiad Khan Ghazi (also known as Daulat Beg) of Yarkand, briefly conquered Kashmir after fighting a battle along this pass. He died in 1531 at Daulat Beg Oldi (meaning, where Daulat Beg died) at the foot of the Karakoram pass, after he was returning from an unsuccessful attempt to invade Tibet.
  11. 11.0 11.1 Bellew, Henry Walter (1875). "Kashmir and Kashghar. A narrative of the journey of the embassy to Kashghar in 1873-74". Trubner & Co. pp. 95–98. Retrieved 3 January 2020 – via Internet Archive.
  12. Rasuly-Paleczek, Gabriele (2005). Katschnig, Julia (ed.). Central Asia on Display: Proceedings of the VII Conference of the European Society for Central Asian Studies. Vol. 2. LIT Verlag Münster. p. 29. ISBN 978-3-8258-8586-1. Retrieved 2 January 2020. On the 16th dhu-l-hiddjja 939/July 9th, 1533, on the way back from campaign in Minor Tibet (Ladakh) the founder of the Moghuliyya-Chaghataid state in Eastern Turkestan, Sultan Said-khan died.
  13. "India is no Pushover". Retrieved 7 May 2013.
  14. "China's Ladakh Incursion Well-planned". The Times of India. Archived from the original on 2013-04-30. Retrieved 7 May 2013.
  15. "China's Helicopters Violate Indian Airspace". Archived from the original on 13 May 2013. Retrieved 7 May 2013.
  16. "IAF Aircraft lands at the highest airstrip in the world". The Times of India. 31 May 2008. Archived from the original on 5 జూలై 2012. Retrieved 31 May 2008.
  17. "IAF reopens old airbase in Ladakh region". The Times of India. 31 May 2008. Retrieved 31 May 2008.
  18. "IAF reopens old air base near China border". The Times of India. 31 May 2008. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 31 May 2008.
  19. "IAF's C-130J transporter lands near India-China border". Business Standard. 20 August 2013. Retrieved 20 August 2013.
  20. "10 reasons why IAF's C-130J Super Hercules landing in Daulat Beg Oldie, Ladakh is important". India Today. 20 August 2013. Retrieved 20 August 2013.
  21. "In show of strength to China, Air Force lands C 130J-30 at Daulat Beg Oldie". NDTV. 20 August 2013. Retrieved 20 August 2013.
  22. "Indian, Chinese armies decide to improve ties at functional level". News18. Retrieved September 14, 2017.
  23. Akhzer, Adil (Aug 15, 2015). "New Indo-China border meeting point at Daulat Beg Oldie in Ladakh sector". The Indian Express. Retrieved April 26, 2016.
  24. "India, China hold meet in Ladakh on Independence Day". India at Melbourne. August 16, 2016. Archived from the original on December 1, 2017. Retrieved November 19, 2017.