డెప్సాంగ్ మైదానం
డెప్సాంగ్ మైదానం, లడఖ్ లోని వివాదాస్పద అక్సాయ్ చిన్ వాయవ్య భాగంలో ఉన్న ఎత్తైన కంకర మైదానం. వాస్తవాధీన రేఖ ఈ ప్రాంతాన్ని భారత, చైనా పరిపాలనా భాగాలుగా విభజిస్తుంది. [2] మైదానంలోని పశ్చిమ భాగం లడఖ్‌లో భాగంగా భారతదేశ నియంత్రణలో ఉండగా, తూర్పు భాగం చైనా ఆక్రమణలో ఉంది. ఈ ప్రాంతాన్ని భారతదేశం తనది అని పేర్కొంటోంది. డెప్సాంగ్ మైదానం భారత సైన్యం సబ్-సెక్టర్ నార్త్ (ఎస్ఎస్ఎన్) అని పిలిచే ప్రాంతంలో భాగం.
డెప్పాంగ్ మైదానం | |
---|---|
ఫ్లోర్ ఎత్తు | 17400[1] |
పొడవు | 25 మైళ్లు (40 కి.మీ.) east-west [1] |
వెడల్పు | 12–13 north-south [1] |
విస్తీర్ణం | 310 |
భూగోళ శాస్త్ర అంశాలు | |
దేశం | భారతదేశం, చైనా |
రాష్ట్రం | లడక్, క్సింగ్‌జియాంగ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 35°18′N 78°00′E / 35.3°N 78.0°E |
నది | చిప్ చాప్ నది కరకాష్ నది ఉపనదులు బుర్ట్‌సా నాలా నది ఉపనదులు |
ఈ ప్రాంతంలో భారత చైనాల మధ్య తరచూ ఉద్రిక్తతలు కలుగుతూంటాయి. భారత భూభాగంలోకి చైనా చొరబడుతూ ఉండడం సర్వసాధారణం. 2013, 2015, 2020 లలో ప్రధాన ప్రతిష్టంభనలు ఏర్పడ్డాయి. డెప్సాంగ్ మైదానానికి పశ్చిమాన పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్తాన్ తో ఉన్న 80 కిలోమీటర్ల నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, చొరబాట్లు చేస్తూ ఉంటుంది.
భౌగోళికం
మార్చుడెప్సాంగ్ మైదానం అక్సాయ్ చిన్ ప్రాంతపు వాయవ్య భాగంలో ఉంది. [4] దీనికి ఉత్తరాన చిప్ చాప్ నదీ లోయ, పశ్చిమాన ష్యోక్ నది సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున "లక్ సుంగ్" శ్రేణి లోని కొండలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇవి మైదానాన్ని కరాకాష్ నది బేసిన్ నుండి వేరు చేస్తాయి. దక్షిణాన, డెప్సాంగ్ మైదానం డెప్సాంగ్ లా కనుమ వద్ద ముగుస్తుంది. కానీ సాధారణ పరిభాషలో, బర్ట్సా, ముర్గో ల మధ్య ప్రవహించే బర్ట్సా నాలా వరకు డెప్సాంగ్ ప్రాంతం గానే పరిగణిస్తారు.
కారకోరం కనుమ డెప్సాంగ్‌కు ఉత్తరాన ఉంది. ఆగ్నేయంలో లింగ్జీ థాంగ్ మైదానం ఉంది. పశ్చిమాన షియోక్ నదికి మూలం అయిన రిమో హిమానీనదపు దక్షిణ భాగం ఉంది.
19 వ శతాబ్దం చివరలో ఇక్కడ పర్యటించిన ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ ఈ ప్రాంతాన్ని ఈ క్రింది విధంగా వర్ణించాడు:
డెప్సాంగ్ మైదానం సముద్ర మట్టానికి పదిహేడు వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. అక్కడంతా కంకర ఉంటుంది. కంకర మీద నడుస్తున్నట్లే ఉంటుంది. మా వెనుక మంచుతో కప్పేసి ఉన్న సాసర్, నుబ్రా శిఖరాలు భారీ ఓడల తెరచాపల్లాగా దిగంతంపై కనిపించాయి; కానీ ఎదర మాత్రం కంకర మైదానం, గొప్ప కంకర గుట్టలు, నీరుగార్చేసే భయంకరమైన నిర్జనమైదానం. ఈ మైదానాలలో కళ్ళు కనబడనంతగా ఈదర గాలులు వీచాయి. రాత్రివేళ, ఇప్పుడు నడివేసవిలో ఉన్నప్పటికీ, అనేక డిగ్రీల మంచు కురిసింది.
చరిత్ర
మార్చుబిడారు మార్గం
మార్చుడెప్సాంగ్ మైదానంలో వర్తకుల బిడార్లు ప్రయాణిస్తూండేవి. వాళ్ళు ఉత్తరాన యార్కండ్ నుండి కారకోరం కనుమ ద్వారా వచ్చేవారు. 1913-1914లో ఈ ప్రాంతాన్ని అన్వేషించిన ఫిలిప్పో డి ఫిలిప్పి ఇలా వివరించాడు: [5]
కానీ మరోవైపు, వేసవిలో ఈ బిడార్లు నిరంతరాయంగా, విస్తుపరచే సంఖ్యలో వస్తూ పోతూంటాయి. ఈ సీజన్లో మొదటిది జూన్ 28 న యార్కండ్ రహదారిపై సంజు నుండి వచ్చింది; ఆ తరువాత ఇంకా పెద్దవి వచ్చాయి; జూలైలో ఒకే రోజు నాలుగు వచ్చాయి. దాదాపుగా అవన్నీ మధ్య ఆసియా నుండి లేహ్ వైపు వెళ్ళేవే - లడఖీలు సాధారణంగా వ్యాపారం ఇంట్లోంచే చేస్తారు. ఈ బిడారులు రకరకాల పరిమాణాల్లో ఉండేవి. ఐదారు జంతువులున్న ముగ్గురు నలుగురు మనుషుల గుంపు నుండి, 40 లేదా అంతకంటే ఎక్కువ రవాణా జంతువులుండే పెద్ద గుంపుల వరకు ఉంటాయి; మనుషులు కాలినడకన గానీ, గాడిదలపై గానీ వెళ్తారు. ధనికులైన వ్యాపారులు గొడుగులున్న గుర్రాలపై వెళ్తారు ...
అనుభవజ్ఞులైన బిడారు వర్తకులు డెప్సాంగ్ మైదానంలో ఆగకుండా, దౌలత్ బేగ్ ఓల్డి, ముర్గోల మధ్య ఉన్న 31 మైళ్ళ దూరాన్ని ఒకే రోజులో ప్రయాణిస్తారని ఫిలిప్పి రాశాడు. [5] మిగతావారు డెప్సాంగ్ కనుమకు దక్షిణాన ఉన్న కిజిల్ లాంగర్ వద్ద గానీ, దక్షిణాన బర్ట్సా వద్ద గానీ ఆగేవారు. డెప్సాంగ్ కనుమ క్రింద నుండి ప్రవహించే డెప్సాంగ్ నాలా అనే ప్రవాహం నీటి కారణంగా ఇక్కడ బర్ట్జా మొక్క పెరుగుతుంది. ఇది పశుగ్రాసం గానూ, శిబిరాలకు ఇంధనంగానూ ఉపయోగపడుతుంది. [6]
1940 ల్లో జిన్జియాంగ్ (చైనీస్ తుర్కెస్తాన్) లో ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో వర్తక బిడారుల రాక తగ్గిపోయింది. 1950 ల చివరలో భారత చైనా సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా అవి పూర్తిగా ఆగిపోయారు.
ఆధునిక కాలంలో భారతదేశం, పాత బిడారు మార్గం లోనే డార్బుక్-ష్యోక్-డిబిఓ (దౌలత్ బేగ్ ఓల్డి) రోడ్డు (డిఎస్-డిబిఓ రోడ్డు) ను వేసింది. ఇది సుల్తాన్ చుష్కు, ముర్గో, బర్ట్సా, కిజిల్ లాంగర్ ల గుండా దౌలత్ బేగ్ ఓల్డి (డిబిఓ) ని చేరుకుంటుంది.
అన్వేషణ
మార్చు1893 లో చార్లెస్ ముర్రే మేజర్ రోచెతో కలిసి లడఖ్, టిబెట్, పామిర్‌ల గుండా తాను చేసిన ప్రయాణాల గురించిన రోజువారీ రికార్డులలో, డెప్సాంగ్ మైదానం చుట్టుపక్కల ప్రాంతంలో తాము మస్క్ జింక, కియాంగ్, టిబెటన్ జింక, సీతాకోకచిలుకలను చూసినట్లు రాశాడు. ప్రపంచంలోని రెండవ ఎత్తైన పర్వతం అయిన కె 2 ను ఈ పీఠభూముల నుండి చూడవచ్చని డన్మోర్ గుర్తించాడు. [7] 1906 లో, స్వెన్ హెడిన్ సాంప్రదాయ సిల్కు రోడ్డుపై బర్ట్సా నుండి తూర్పుగా అక్సాయ్ చిన్ సరస్సు వరకు ప్రయాణించాడు. [8] షహీదుల్లాకు వెళ్ళే సాంప్రదాయిక మార్గం ఈ మైదానాల గుండానే వెళ్తుంది; కిజిల్ జిల్గా నుండి హాజీ లంగర్ నుండి షహీదుల్లా వరకు. [4]
వాస్తవాధీన రేఖ
మార్చు1962 లో, భారత చైనాలు సరిహద్దు వివాదం నేపథ్యంలో యుద్ధం చేశాయి, దీని తరువాత ఏర్పడిన వాస్తవాధీన రేఖ (ఎల్ఐసి) డెప్సాంగ్ మైదానాలను రెండు దేశాల మధ్య విభజించింది. ఈ రేఖ సాంప్రదాయిక బిడారు మార్గానికి తూర్పున నడుస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో రెండు దేశాల సైన్యాలు మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడికి అత్యంత సమీపంలో ఉన్న జనావాస గ్రామం ముర్గో. [9]
వృక్ష, జంతుజాలాలు
మార్చు2020 సెప్టెంబరు 18 న, మేజర్ జనరల్ బ్రజేష్ కుమార్, "డెప్సాంగ్ మైదానం 5,500 మీటర్ల ఎత్తున, ఎటువంటి వృక్ష, జంతుజాలాలూ లేని ఒక శీతల ఎడారి. ఈ ప్రదేశంలో ఎటువంటి నివాసాలు లేవు. " అని రాసాడు [10]
మైదానాలకు దక్షిణంగా ఉన్న బర్ట్సాకు, ఈ ప్రాంతంలో పెరిగే అస్టెరేసి కుటుంబానికి చెందిన బర్ట్సే ( ఆర్టెమిసియా ఎస్పిపి. ) మొక్క పేరు మీదుగా ఆ పేరు వచ్చింది. [11]
జంతుజాలం
మార్చుడెప్సాంగ్ మైదానంలో టిబెటన్ జింక (చిరు), కొండ వీసెల్, లడఖ్ పికా, భరాల్ (నీలం గొర్రెలు), టిబెటన్ తోడేలు, బొచ్చు కుందేలు ఉన్నాయి. [12] చిరు జంతువులు వలసపోయే రకానికి చెందినవి.
చిరు జీవించే ప్రదేశాల్లో 5500 మీటర్ల ఎత్తున అత్యంత పశ్చిమాన ఉన్న ప్రాంతం, డెప్సాంగ్ మైదానం. [13] [14] 2005 లో భారత వైల్డ్లైఫ్ ట్రస్టు నిర్వహించిన షాలెర్ పరిరక్షణ సర్వేలో, డెప్సాంగ్ ప్రాంతంలో 149 చిరులు ఉన్నట్టు తేలింది. ఇవన్నీ ఆడవి, పిల్లలే. 22 మందల్లో ఉన్నాయి. చిరు కనిపించిన అత్యంత దక్షిణ ప్రాంతం డెప్సాంగ్ లా సమీపంలో ప్రవహించే తుక్సు డూన్ డూన్ నాలా. [12] [15] టిబెటన్ జింకను షాహూష్ (ఉన్నితొ నేసే శాలువా) కోసం చంపుతారు. భారతదేశంలో వాటిని రక్షించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. [16]
DRDO సాకిన రెండు మూపురాల బాక్ట్రియన్ ఒంటెలను దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద, డెప్సాంగ్ వద్ద గస్తీ, రవాణా కోసం భారత సైన్యం వాడుతోంది. [17] సిల్క్ రోడ్డులో రవాణా కోసం రెండు మూపురాల ఒంటెలను సాంప్రదాయకంగా ఉపయోగించేవారు. జాన్స్కర్ పోనీలను కూడా భారత సైన్యం ఉపయోగిస్తోంది.
స్థలాలు
మార్చుబర్ట్సా చారిత్రికంగా బిడారు విశ్రాంతి స్థలం. డెప్సాంగ్ మైదానపు దక్షిణ కొసన, డెప్సాంగ్ నాలా, రాకీ నాలాలు కలిసి బర్ట్సా నాలాగా ఏర్పడే చోట ఇది ఉంది. [a] ఇది ప్రస్తుతం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి), భారత సైన్యాలకు సైనిక శిబిరంగా ఉంది. ఇది వాస్తవాధీన రేఖ నుండి భారతదేశం వైపు 15 కిలోమీటర్ల దూరంలో, డార్బుక్-ష్యోక్-DBO మార్గంలో ఉంది .
బర్ట్సా దగ్గర, రాకీ నాలా గర్భంలో "బాటిల్ నెక్" లేదా "వై-జంక్షన్" ఉంది. వాహనాల రాకపోకలను పరిమితించేలా ఏర్పడిన సహజ రాతి నిర్మాణం వలన బాటిల్ నెక్‌కు ఆ పేరు వచ్చింది. బర్ట్సా నుండి వచ్చే దారి ఇక్కడ రెండుగా చీలడం వలన ఈ ప్రదేశాన్ని వై-జంక్షన్ అని కూడా పిలుస్తారు. ఒక దారి రాకీ నాలా వెంట గస్తీ కేంద్రం 10 (పిపి 10) వరకు వెళుతుంది. రెండవది పిపి -13 కి వెళుతుంది. [18] [19]
బర్ట్సాకు ఉత్తరాన కిజిల్ లాంగర్ ఉంది. దీనిని ఖాజీ లాంగర్ అని కూడా పిలుస్తారు. ఇది దెప్సాంగ్ లాకు దక్షిణాన సన్నటి ఎర్రటి గండిలో ఉంది. [20] డెప్సాంగ్ నాలా ప్రవాహం పడమటి నుండి ఈ గండి లోకి ప్రవహించి, కిజిల్ లాంగర్ వద్ద దక్షిణానికి తిరుగుతుంది.
చిప్ చాప్ నది, ష్యోక్ నది సంగమం వద్ద ఉన్న హాల్టింగు ప్రదేశం గప్షాన్ లేదా యప్షాన్ . [21] [22] గతంలో, అనేక సందర్భాల్లో, చోంగ్ కుమ్దాన్ హిమానీనదం ష్యోక్ నది ప్రవాహాన్ని అడ్డుకుంది. అపుడు గప్షాన్ సరస్సు ఏర్పడింది; మంచుకట్ట కరిగినపుడు, సరస్సు ఖాళీ అయిపోతుంది. [23] [24] గప్షాన్ నుండి, షాహి కాంగ్రీ శిఖరాల సమూహం మైదాన ప్రాంతాలలో ప్రముఖంగా కనిపిస్తుంది. [22]
DBO నాలా వెంట DBO కి నాలుగు మైళ్ళ ఉత్తరాన, పోలు (లేదా పులో / పోలా అనేది స్థానికంగా లభించే మట్టిని ఉపయోగించి నిర్మించిన సాంప్రదాయ తాత్కాలిక ఆశ్రయం) క్యాంపింగ్ మైదానంలో, 1935 లో మేజర్ AM సేథీ, డాక్టర్ పిహెచ్ సి విస్సర్ వదిలిపెట్టిన స్మారక శిలను కనుగొన్నాడు. [25]
భారత చైనా ఉద్రిక్తతలు
మార్చు1958 కి ముందు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో వారి గస్తీ దళాలు డెప్సాంగ్ మైదానంలో చైనా కార్యకలాపాలను గమనించింది. [4] డెప్సాంగ్ మైదానంలో చైనీయుల దావా రేఖలు 1956 నుండి మారుతూ వచ్చాయని మనోజ్ జోషి చప్పాడు. స్పష్టమైన సరిహద్దు లేకపోవడంతో చైనా ఈ ప్రాంతంలో చిన్నచిన్న చొరబాట్లు చేస్తూ భూభాగాన్ని కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ వస్తోంది. [26]
సైనిక ఉద్రిక్తత
మార్చు2013 ఏప్రిల్‌లో చైనా పిఎల్‌ఎ దళాలు రాకీ నాలా, డెప్సాంగ్ నాలా కూడలి చైనా భూభాగమే నని పేర్కొంటూ, అక్కడ తాత్కాలిక శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. కానీ, మూడు వారాల ప్రతిష్టంభన తరువాత, భారత్‌తో దౌత్య ఒప్పందం ఫలితంగా వారు వైదొలిగారు. 2015 లో చైనా, బర్ట్సా సమీపంలో వాచ్ టవర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. డెప్సాంగ్‌కు ఏర్పడే ముప్పు ఏదైనా భారతదేశపు DS-DBO రహదారిని ప్రభావితం చేస్తుంది. ప్రారంభంలో భారతదేశం ఎస్ఎన్ఎన్లో సుమారు 120 ట్యాంకులను మోహరించి ఉంచారు, కాలక్రమంలో ఈ సంఖ్య పెరిగింది.
సబ్ సెక్టర్ నార్త్
మార్చుభారత సైన్యపు సబ్ సెక్టర్ నార్త్ (ఎస్‌ఎస్‌ఎన్) సియాచెన్ హిమానీనదానికి తూర్పున ఉంది. ఇది చైనా వైపున్న సాసర్ శిఖరానికీ, పాకిస్తాన్ సరిహద్దులోని సాల్టోరో రిడ్జ్ కూ మధ్యన ఉంది. భారతదేశంపై రెండు-రంగాల యుద్ధం చేసే సందర్భంలో, ఈ ప్రాంతమే పాకిస్తాన్, చైనాలకు అనుసంధానం కలిగించగలదు. [27] డెప్సాంగ్ మైదానం-కారకోరం కనుమ-ష్యోక్ లోయ సృష్టించిన ప్రాదేశిక చీలిక, ఈ అనుసంధానాన్ని అడ్డగిస్తుంది.
ఇవి కూడా చూడండి
మార్చు- దౌలత్ బేగ్ ఓల్డి
- భారత చైనా సరిహద్దు వివాదం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Filippi, The Italian Expedition (1932), p. 308.
- ↑ Manoj Joshi (2013-05-07). "Making sense of the Depsang incursion". The Hindu.
- ↑ India, Ministry of External Affairs, ed. (1962), Report of the Officials of the Governments of India and the People's Republic of China on the Boundary Question, Government of India Press, Chinese Report, Part 1 (PDF) (Report). pp. 4–5.
The location and terrain features of this traditional customary boundary line are now described as follows in three sectors, western, middle and eastern. ... The portion between Sinkiang and Ladakh for its entire length runs along the Karakoram Mountain range. Its specific location is as follows: From the Karakoram Pass it runs eastwards along the watershed between the tributaries of the Yarkand River on the one hand and the Shyok River on the other to a point approximately 78° 05' E, 35° 33' N, turns southwestwards and runs along a gully to approximately 78° 01' E, 35° 21' N; where it crosses the Chipchap River. It then turns south-east along the mountain ridge and passes through peak 6,845 (approximately 78° 12' E, 34° 57' N) and peak 6,598 (approximately 78° 13' E, 34° 54' N). - ↑ 4.0 4.1 4.2 Palit, D. K. (1991). War in High Himalaya: The Indian Army in Crisis, 1962. Hurst. pp. 32, 43. ISBN 978-1-85065-103-1.
- ↑ 5.0 5.1 Filippi, The Italian Expedition (1932).
- ↑ Bhattacharji, Ladakh (2012).
- ↑ Dunmore (1893). The Pamirs - Vol.1. John Murry, London. pp. 191–194 – via archive.org.
- ↑ Karkra, B. K. (2019-10-23). The Police Warriors on The Indo-Chinese Border in Ladakh. Walnut Publication. pp. 14, 87. ISBN 978-81-943486-1-0.
- ↑ A skull from Daulat Baig Oldie, The Tribune (Chandigarh), 26 May 2019.
- ↑ Kumar, Maj Gen Brajesh (18 September 2020). "Why Depsang Plains Are The New Conflict Point For India & China". The Dialogue (in ఇంగ్లీష్). Retrieved 2020-10-01.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ Bora, Nirmala (2004). Ladakh: Society and Economy. Anamika Publishers & Distributors. p. 123. ISBN 978-81-7975-012-4.
- ↑ 12.0 12.1 Sarkar, Prabal; Takpa, Jigmet; Ahmad, Riyaz; Tiwari, Sandeep Kumar; Pendharkar, Anand; Saleem-ul-Haq; Miandad, Javaid; Upadhyay, Ashwini; Kaul, Rahul (2008). Mountain Migrants: Survey of Tibetan Antelope (Pantholops Hodgsonii) and Wild Yak (Bos Grunniens) in Ladakh, Jammu & Kashmir, India (PDF). Conservation action series. Wildlife Trust of India.
- ↑ Ahmad, Khursheed; Kumar, Ved P.; Joshi, Bheem Dutt; Raza, Mohamed; Nigam, Parag; Khan, Anzara Anjum; Goyal, Surendra P. (2016). "Genetic diversity of the Tibetan antelope (Pantholops hodgsonii) population of Ladakh, India, its relationship with other populations and conservation implications". BMC Research Notes. 9 (477). doi:10.1186/s13104-016-2271-4. PMID 27769305.
It is clear that there has been reported migration and exchange of individuals towards the western part in its range, but habitat suitability analysis is needed for a better understanding of the reasons for lack of major exchange of individuals between the western most (Depsang Plains close to DBO in northern Ladakh and Aksi Chin near Kunlun range) and other populations.
{{cite journal}}
: CS1 maint: unflagged free DOI (link) - ↑ Ahmad, Khursheed; Bhat, Aijaz Ahmad; Ahmad, Riyaz; Suhail, Intesar (2020). "Wild Mammalian Diversity in Jammu and Kashmir State". Biodiversity of the Himalaya: Jammu and Kashmir State. Topics in Biodiversity and Conservation. Vol. 18. p. 945. doi:10.1007/978-981-32-9174-4_36. ISBN 978-981-32-9173-7.
Chiru is a keystone species and world's hardiest mountain ungulates that can survive in temperatures as low as –40C. Most of their distribution range falls above 4,000 m, and in Depsang Plains in northern Ladakh, they can be found as high as 5500 m. [...] The Shahtoosh is banned as chiru are killed for Shahtoosh, from which fine woolen yarn is produced which commands a high price in the market
- ↑ Ahmad, Khursheed; Ahmad, Riyaz; Nigam, Parag; Takpa, Jigmet (2017). "Analysis of temporal population trend and conservation of Tibetan Antelope in Chang Chenmo Valley and Daulat beg Oldi, Changthang, Ladakh, India". Gnusletter. 34 (2): 16–20.
- ↑ Ahmad, Khursheed; Ahmad, Riyaz; Nigam, Parag; Takpa, Jigmet (2017). "Analysis of temporal population trend and conservation of Tibetan Antelope in Chang Chenmo Valley and Daulat beg Oldi, Changthang, Ladakh, India". Gnusletter. 34 (2): 16–20.
- ↑ Bhalla, Abhishek (19 September 2020). "Indian Army to use double-humped camels for transportation, patrolling in Ladakh". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-10-01.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Singh, Sushant (2020-06-25). "Closer to strategic DBO, China opens new front at Depsang". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2020-09-29.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Gautam, Nishtha (2020-06-25). "India-China 'Bottleneck': Are Indian Patrols Limited Since March?". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2020-09-29.
- ↑ Dainelli, Giotto (1933). Buddhists and Glaciers of Western Tibet. Kegal, Paul, Trench, Trubner & Co. p. 217 – via archive.org.
- ↑ Kapadia, High Himalayas (2002).
- ↑ 22.0 22.1 Kapadia, Into the Untravelled Himalaya (2005).
- ↑ Mason, Major Kenneth (1929). "Indus Floods and Shyok Glaciers: Himalayan Journal vol.01/3". Himalayan Club. Retrieved 2020-09-20.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "The Himalayas - Ladakh Himalayas - Glaciers - Biafo and Chong Kumdan". www.schoolnet.org.za. Retrieved 2020-09-20.
- ↑ Kapadia, Harish (2002). High Himalaya Unknown Valleys. Indus Publishing. p. 306. ISBN 978-81-7387-117-7.
- ↑ Joshi, Manoj (2013-05-07). "Making sense of the Depsang incursion-IN". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-09-19.
- ↑ Banerjee, Lt Gen Gautam (2019). "7: The Hub of OBOR. Where Five National Boundaries Meet". China's Great Leap Forward-II: The China Pakistan Economic Corridor and Strategic Reshaping of Indian Neighbourhood. Lancer Publishers LLC. pp. 88–. ISBN 978-1-940988-43-6.
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు