ద్రోణవల్లి అనసూయమ్మ తొలితరం తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు, స్నేహశీలి, మానవతావాది.[1]

ద్రోణవల్లి అనసూయమ్మ
Dronavalli anasuya.jpg
జననంద్రోణవల్లి అనసూయమ్మ
1930
కృష్ణాజిల్లా మోటూరు
మరణం2015
విజయవాడ
వృత్తితొలితరం తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు
జీవిత భాగస్వామిసత్యప్రసాద్
పిల్లలుకుమార్తె డాక్టర్‌ జోని, కుమారుడు భరద్వాజ

జీవిత విశేషాలుసవరించు

ఆమె కృష్ణాజిల్లా మోటూరులో 1930 లో జన్మించారు. ఆమె బాబాయి యలమంచిలి వెంకటకృష్ణయ్య ప్రభావంతో జాతీయోద్యమంలో పాల్గొన్నారు. తన గ్రామంలోని గ్రంథాలయంలో రష్యన్‌ సాహిత్యాన్ని చదివి కమ్యూనిస్టు రాజకీయాలవైపు అడుగులు వేశారు. 1946లో కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలయ్యారు. కమ్యూనిస్ట్‌ కార్యకర్త సత్యప్రసాద్‌ను ఆదర్శ వివాహం చేసుకున్నారు. 1946 నుంచి భర్తతో కలిసి నాలుగేళ్లపాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 1950లో ఆమె భర్తను పోలీసులు కాల్చి చంపారు. అయినా, కమ్యూనిస్టు ఉద్యమాన్ని అంటిపెట్టుకొన్న అనసూయమ్మ. 1964 చీలికలో సీపీఎం వైపు, 1967 విభజనలో చారు మజుందార్‌, కొండపల్లి సీతారామయ్యల నాయకత్వంలోని నక్సలైట్‌ ఉద్యమం వైపు మొగ్గారు. కృష్ణాజిల్లా ఐలూరు, గురివిందపల్లె, పెదవేగిలలో 1980లో జరిగిన భూపోరాటాలలో చురుగ్గా పాల్గొని.. దళితులకు భూములు దక్కేలా చేశారు.[2]

మరణంసవరించు

సుదీర్ఘకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అనసూయమ్మ(85) బ్రెయిన్‌ స్టెమ్‌ స్ర్టోక్‌తో గురువారం నవంబరు 12 2015విజయవాడలో మరణించారు.

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు