ద్రోణాచార్య పురస్కారం

ద్రోణాచార్య పురస్కారం, క్రీడలలో అత్యుత్తమ శిక్షకులకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం. [1] ఈ పురస్కారానికి కౌరవ పాండవుల గురువైన "ద్రోణాచార్యుని" పేరు పెట్టారు. [2] దీనిని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఏటా ప్రదానం చేస్తుంది. మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ గ్రహీతలను ఎంపిక చేస్తుంది నాలుగు సంవత్సరాల కాలంలో "స్థిరమైన ప్రాతిపదికన అత్యుత్తమమైన ప్రతిభ కనబరిచి, అంతర్జాతీయ పోటీలలో రాణించే క్రీడాకారులను చేసినందుకు" ఈ పురస్కారం ఇస్తారు. కోచింగ్‌లో జీవితకాల కృషి కోసం రెండు పురస్కారాలను కేటాయించారు, 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో "అత్యుత్తమ క్రీడాకారులను" ఉత్పత్తి చేయడంలో సాధించిన విజయాలను వీటి కోసం పరిగణిస్తారు. ఈ పురస్కారంలో భాగంగా ద్రోణాచార్యుని కాంస్య విగ్రహం, సర్టిఫికేట్, ఉత్సవ దుస్తులు, ₹ 15 లక్షలు నగదు బహుమతినీ అందజేస్తారు. [a] [1]

ద్రోణాచార్య పురస్కారం
అత్యుత్తమ క్రీడా శిక్షకులకు ఇచ్చే పురస్కారం
Awarded forక్రీడా శిక్షణ
Sponsored byభారత ప్రభుత్వం
Reward(s)15 లక్షలు
మొదటి బహుమతి1985
Last awarded2020
Highlights
మొత్తం గ్రహీతలు129
తొలి గ్రహీత
  • బాలచంద్ర భాస్కర్ భగవత్
  • ఓం ప్రకాష్ భరద్వాజ్
  • ఒ ఎం నంబియార్

1985లో దీన్ని స్థాపించారు. [4] ఒలింపిక్ క్రీడలు, పారాలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు ప్రపంచ కప్‌తో పాటు క్రికెట్, స్వదేశీ ఆటలు, పారాస్పోర్ట్స్ వంటి పోటీల్లో ఉండే విభాగాలకు మాత్రమే ఈ అవార్డు ఇస్తారు. [1] ఇచ్చిన సంవత్సరానికి సంబంధించిన నామినేషన్లు ఏప్రిల్ 30 వరకు లేదా ఏప్రిల్ చివరి పని దినం వరకు స్వీకరిస్తారు. పది మంది సభ్యుల కమిటీ నామినేషన్లను పరిశీలించి, తమ సిఫార్సులను తదుపరి ఆమోదం కోసం కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రికి సమర్పిస్తుంది. [1]

1985లో పురస్కార ప్రథమ గ్రహీతలైన బాలచంద్ర భాస్కర్ భగవత్ (రెజ్లింగ్), ఓం ప్రకాష్ భరద్వాజ్ (బాక్సింగ్), ఓం నంబియార్ (అథ్లెటిక్స్) లను సత్కరించారు. [5] సాధారణంగా ఒక సంవత్సరంలో ఐదుగురికి మించకుండా ప్రదానం చేస్తారు. 2012 లోను, 2016 నుండి 2020 వరకూ ఎక్కువ మంది గ్రహీతలకు పురస్కారం ఇచ్చారు. [6]

నామినేషన్లు

మార్చు

అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌లు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ ప్రమోషన్ అండ్ కంట్రోల్ బోర్డ్‌లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాల నుండి పురస్కారానికి నామినేషన్లను స్వీకరిస్తారు. వీరు ప్రతి క్రీడకూ ఇద్దరు కంటే ఎక్కువ కాకుండా శిక్షకుల నామినేషన్లు పంపవచ్చు. క్రికెట్ విషయానికొస్తే, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సమాఖ్య లేనందున భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుండి నామినేషన్లు స్వీకరిస్తారు. గుర్తింపు రద్దు చేయబడిన లేదా సస్పెన్షన్‌లో ఉన్న జాతీయ క్రీడా సమాఖ్యల తరపున నామినేషన్‌లను సమర్పించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)కు అధికారం ఉంది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున పురస్కారం, ద్రోణాచార్య పురస్కారం, ధ్యాన్ చంద్ పురస్కారాల పురస్కార గ్రహీతలు కూడా తాము పురస్కారం పొందిన క్రీడకు సంబంధిన ఒక శిక్షకుని నామినేట్ చేయవచ్చు. నామినేటింగ్ అథారిటీల నుండి ఎలాంటి నామినేషన్లు రాని పక్షంలో అర్హులైన సందర్భాలలో ప్రభుత్వమే ఇద్దరు శిక్షకులను నామినేట్ చేయవచ్చు. నామినేషన్లను ఏటా ఏప్రిల్ 30 వరకు లేదా ఏప్రిల్ చివరి పని దినం వరకు స్వీకరిస్తారు. [1]

ఎంపిక ప్రక్రియ

మార్చు

స్వీకరించిన అన్ని నామినేషన్లను SAI కీ, సంబంధిత జాతీయ క్రీడా సమాఖ్యలకూ ధృవీకరణ కోసం పంపిస్తారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ డోపింగ్ క్లియరెన్స్ ఇచ్చే బాధ్యత వహిస్తుంది. ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ నిషేధించిన డ్రగ్స్ లేదా పదార్ధాల వినియోగంపై జరిమానా విధించబడిన లేదా విచారణలో ఉన్న క్రీడాకారులతో సంబంధం ఉన్న శిక్షకులు ఈ పురస్కారానికి అర్హులు కాదు. అలాగే గతంలో ధ్యాన్ చంద్ పురస్కారం పొందినవారు కూడా ఈ పురస్కారానికి అర్హులు కాదు. జాయింట్ సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ డైరెక్టర్/డిప్యూటి సెక్రటరీ, సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్/SAI కి చెందిన డైరెక్టరు (టీమ్స్) లతో కూడిన కమిటీ నామినేషన్లను ధృవీకరిస్తుంది. [1]

చెల్లుబాటు అయ్యే నామినేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ పరిగణలోకి తీసుకుంటుంది. ఈ పదకొండు మంది సభ్యుల కమిటీలో మంత్రిత్వ శాఖ నామినేట్ చేసిన ఒక చైర్‌పర్సన్, ఇద్దరు సభ్యులు (ఒలింపియన్‌లు లేదా గతంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న లేదా అర్జున పురస్కార గ్రహీతలు), వివిధ క్రీడా విభాగాలకు చెందిన ముగ్గురు మాజీ ద్రోణాచార్య పురస్కార గ్రహీతలు, ఇద్దరు స్పోర్ట్స్ జర్నలిస్టులు/ నిపుణులు/వ్యాఖ్యాతలు, ఒక స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్, SAI డైరెక్టర్ జనరల్, స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రటరీ ఉంటారు. ఏ ఒక్క క్రీడా విభాగం నుండీ ఒకరి కంటే ఎక్కువ మంది క్రీడాకారులను కమిటీలో చేర్చరు. [1] సమ్మర్, వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ గేమ్స్, ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌, వివిధ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లు, ఈవెంట్‌లలో గెలిచిన పతకాలకు 80% వెయిటేజీ ఇవ్వబడుతుంది. మిగిలిన 20% వెయిటేజీ వారి శిష్యులు పతకాలు గెలుచుకున్న ఈవెంట్‌ల ప్రొఫైలుకు, వాటి ప్రమాణాల స్థాయికీ ఇవ్వబడుతుంది. ఒలింపిక్, ఆసియా క్రీడలు, క్రికెట్, స్వదేశీ ఆటల వంటి కామన్వెల్త్ గేమ్‌లలో చేర్చని ఇతర ఆటల కోసం, వ్యక్తిగత ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుంటారు. గరిష్ఠ పాయింట్లు ఉన్న కోచ్‌కు 80 మార్కులు ఇవ్వగా, మిగిలిన కోచ్‌లకు గరిష్ట పాయింట్లకు అనులోమానుపాతంలో మార్కులు ఇస్తారు. జట్టు ఈవెంట్‌లకు, జట్టు బలాన్ని బట్టి మార్కులు ఇస్తారు. [1] వివిధ పోటీల్లో పతకాల కోసం ఇచ్చిన పాయింట్లు క్రింది విధంగా ఉంటాయి:

గత నాలుగు సంవత్సరాలలో శిష్యులు పొందిన పతకాలను బట్టి శిక్షకులకు ఇచ్చిన పాయింట్లు
బంగారం వెండి కంచు
ఒలింపిక్ గేమ్స్ / పారాలింపిక్ గేమ్స్ 80 70 55
ప్రపంచ ఛాంపియన్‌షిప్ / ప్రపంచ కప్ [b] 40 30 20
ఆసియా క్రీడలు 30 25 20
కామన్వెల్త్ గేమ్స్ 25 20 15

ఏ క్రీడలోనైనా, ఇద్దరు శిక్షకులకు మించకుండా - ఒక పురుషుడు, ఒక స్త్రీ - అత్యధిక మార్కులు ఇస్తారు. అన్ని విభాగాల్లోనూ అత్యధిక మార్కులు సాధించిన కోచ్‌కి పురస్కారం ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేయకపోవచ్చు. కానీ ఒక్కో క్రీడా విభాగంలో అత్యధిక మార్కులు పొందిన వారిని మాత్రమే సిఫార్సు చేయగలదు. ఎంపిక కమిటీ సిఫార్సులు తదుపరి ఆమోదం కోసం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు వెళ్తాయి. [1]

గ్రహీతలు

మార్చు
సూచిక
  § పారా క్రీడలను సూచిస్తుంది
  # మరణానంతర ప్రదానాన్ని సూచిస్తుంది
పురస్కార గ్రహీతలు
సంవత్సరం గ్రహీత క్రీడ Refs.
1985 బాలచంద్ర భాస్కర్ భగవత్ రెజ్లింగ్ [7]
1985 ఓం ప్రకాష్ భరద్వాజ్ బాక్సింగ్ [7]
1985 O. M. నంబియార్ వ్యాయామ క్రీడలు [7]
1986 దేశ్ ప్రేమ్ ఆజాద్ క్రికెట్ [7]
1986 రఘునందన్ వసంత గోఖ్లే చదరంగం [7]
1987 గురువు హనుమంతుడు రెజ్లింగ్ [7]
1987 గురుచరణ్ సింగ్ క్రికెట్ [7]
1988 అవార్డు ఇవ్వలేదు [7]
1989 అవార్డు ఇవ్వలేదు [7]
1990 రమాకాంత్ అచ్రేకర్ క్రికెట్ [7]
1990 సయ్యద్ నయీముద్దీన్ ఫుట్బాల్ [7]
1990 ఎ. రమణారావు వాలీబాల్ [7]
1991 అవార్డు ఇవ్వలేదు [7]
1992 అవార్డు ఇవ్వలేదు [7]
1993 అవార్డు ఇవ్వలేదు [7]
1994 ఇలియాస్ బాబర్ వ్యాయామ క్రీడలు [7]
1995 శ్యామ్ సుందర్ రావు వాలీబాల్ [7]
1995 కరణ్ సింగ్ వ్యాయామ క్రీడలు [7]
1996 విల్సన్ జోన్స్ బిలియర్డ్స్ & స్నూకర్ [7]
1996 పాల్ సింగ్ సంధు బరువులెత్తడం [7]
1997 జోగిందర్ సింగ్ సైనీ వ్యాయామ క్రీడలు [7]
1998 G. S. సంధు బాక్సింగ్ [8]
1998 హరగోవింద్ సింగ్ సంధు వ్యాయామ క్రీడలు [8]
1998 బహదూర్ సింగ్ చౌహాన్ వ్యాయామ క్రీడలు [8]
1999 కెన్నెత్ ఓవెన్ బోసెన్ వ్యాయామ క్రీడలు [9]
1999 హవా సింగ్# బాక్సింగ్ [9]
1999 అజయ్ కుమార్ సిరోహి బరువులెత్తడం [9]
2000 S. M. ఆరిఫ్ బ్యాడ్మింటన్ [10]
2000 గుడియాల్ సింగ్ భంగు హాకీ [10]
2000 భూపేందర్ ధావన్ పవర్ లిఫ్టింగ్ [10]
2000 గోపాల్ పురుషోత్తం ఫడ్కే ఖో ఖో [10]
2000 హంస శర్మ బరువులెత్తడం [10]
2001 మైఖేల్ ఫెరీరా బిలియర్డ్స్ & స్నూకర్ [11]
2001 సన్నీ థామస్ షూటింగ్ [11]
2002 మహారాజ్ కృష్ణ కౌశిక్ హాకీ [12]
2002 రేణు కోహ్లీ వ్యాయామ క్రీడలు [12]
2002 హోమి మోతివాలా యాటింగ్ [12]
2002 ఇ. ప్రసాదరావు కబడ్డీ [12]
2002 జస్వంత్ సింగ్ వ్యాయామ క్రీడలు [12]
2003 సుఖ్‌చైన్ సింగ్ చీమా రెజ్లింగ్ [13]
2003 రాబర్ట్ బాబీ జార్జ్ వ్యాయామ క్రీడలు [13]
2003 అనూప్ కుమార్ బాక్సింగ్ [13]
2003 రాజిందర్ సింగ్ జూనియర్ హాకీ [13]
2004 సైరస్ పోంచా స్క్వాష్ [14]
2004 అరవింద్ సావూరు బిలియర్డ్స్ & స్నూకర్ [14]
2004 సునీతా శర్మ క్రికెట్ [14]
2005 ఇస్మాయిల్ బేగ్ రోయింగ్ [15]
2005 మహ సింగ్ రావు రెజ్లింగ్ [15]
2005 బల్వాన్ సింగ్ కబడ్డీ [15]
2005 ఎం. వేణు బాక్సింగ్ [15]
2006 కోనేరు అశోక్ చదరంగం [16]
2006 దామోదరన్ చంద్రలాల్ బాక్సింగ్ [16]
2006 R. D. సింగ్ వ్యాయామ క్రీడలు [16]
2007 జగదీష్ సింగ్ బాక్సింగ్ [17]
2007 జగ్మీందర్ సింగ్ రెజ్లింగ్ [17]
2007 సంజీవ కుమార్ సింగ్ విలువిద్య [17]
2007 G. E. శ్రీధరన్ వాలీబాల్ [17]
2008 అవార్డు ఇవ్వలేదు [7]
2009 జయదేవ్ బిష్ట్ బాక్సింగ్ [18]
2009 పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ [18]
2009 S. బలదేవ్ సింగ్ హాకీ [18]
2009 సత్పాల్ సింగ్ రెజ్లింగ్ [18]
2010 సుభాష్ అగర్వాల్ బిలియర్డ్స్ & స్నూకర్ [19]
2010 అజయ్ కుమార్ బన్సాల్ హాకీ [19]
2010 కెప్టెన్ చంద్రప్ రెజ్లింగ్ [19]
2010 ఎ. కె. కుట్టి వ్యాయామ క్రీడలు [19]
2010 ఎల్ ఇబోమ్చా సింగ్ బాక్సింగ్ [19]
2011 దేవేందర్ కుమార్ రాథోడ్ జిమ్నాస్టిక్స్ [20]
2011 రాంఫాల్ రెజ్లింగ్ [20]
2011 ఇనుకుర్తి వెంకటేశ్వర రాయ్ బాక్సింగ్ [20]
2012 సునీల్ దబాస్ కబడ్డీ [21]
2012 B. I. ఫెర్నాండెజ్ బాక్సింగ్ [21]
2012 వీరేంద్ర పూనియా వ్యాయామ క్రీడలు [21]
2012 సత్యపాల్ సింగ్§ వ్యాయామ క్రీడలు [21]
2012 హరేంద్ర సింగ్ హాకీ [21]
2012 యశ్వీర్ సింగ్ రెజ్లింగ్ [21]
2013 పూర్ణిమ మహతో విలువిద్య [22]
2013 నరేందర్ సింగ్ సైనీ హాకీ [22]
2013 మహావీర్ సింగ్ బాక్సింగ్ [22]
2014 మహాబీర్ ప్రసాద్ రెజ్లింగ్ [23]
2015 అనూప్ సింగ్ దహియా రెజ్లింగ్ [24]
2015 నావల్ సింగ్§ వ్యాయామ క్రీడలు [24]
2016 సాగర్ మల్ ధయాల్ బాక్సింగ్ [25]
2016 బిశ్వేశ్వర నంది జిమ్నాస్టిక్స్ [25]
2016 నాగపురి రమేష్ వ్యాయామ క్రీడలు [25]
2016 రాజ్‌కుమార్ శర్మ క్రికెట్ [25]
2017 ఆర్. గాంధీ# వ్యాయామ క్రీడలు [6]
2017 హీరా నంద్ కటారియా కబడ్డీ [6]
2018 సుబేదార్ చేనంద అచ్చయ్య కుట్టప్ప బాక్సింగ్ [26]
2018 విజయ్ శర్మ బరువులెత్తడం [26]
2018 ఎ. శ్రీనివాసరావు టేబుల్ టెన్నిస్ [26]
2018 సుఖ్‌దేవ్ సింగ్ పన్ను వ్యాయామ క్రీడలు [26]
2019 మొహిందర్ సింగ్ ధిల్లాన్ వ్యాయామ క్రీడలు [27]
2019 యు.విమల్ కుమార్ బ్యాడ్మింటన్ [27]
2019 సందీప్ గుప్తా టేబుల్ టెన్నిస్ [27]
2020 జూడ్ సెబాస్టియన్ హాకీ [28]
2020 యోగేష్ మాలవీయ మల్లఖాంబ్ [28]
2020 జస్పాల్ రాణా షూటింగ్ [28]
2020 కులదీప్ కుమార్ హ్యాండూ వుషు [28]
2020 గౌరవ్ ఖన్నా§ బ్యాడ్మింటన్ [28]
జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు
సంవత్సరం జీవన సాఫల్య పురస్కార గ్రహీత క్రీడ Refs.
2011 కుంతల్ కుమార్ రాయ్ వ్యాయామ క్రీడలు [20]
2011 రాజిందర్ సింగ్ జూనియర్ హాకీ [20]
2012 జస్వీందర్ సింగ్ భాటియా వ్యాయామ క్రీడలు [21]
2012 భవానీ ముఖర్జీ టేబుల్ టెన్నిస్ [21]
2013 రాజ్ సింగ్ రెజ్లింగ్ [22]
2013 K. P. థామస్ వ్యాయామ క్రీడలు [22]
2014 గుర్చరన్ గోగి జూడో [23]
2014 జోస్ జాకబ్ రోయింగ్ [23]
2014 ఎన్. లింగప్ప వ్యాయామ క్రీడలు [23]
2014 గణపతి మనోహరన్ బాక్సింగ్ [23]
2015 నిహార్ అమీన్ ఈత [24]
2015 హర్బన్స్ సింగ్ వ్యాయామ క్రీడలు [24]
2015 స్వతంతర్ రాజ్ సింగ్ బాక్సింగ్ [24]
2016 S. ప్రదీప్ కుమార్ ఈత [25]
2016 మహావీర్ సింగ్ ఫోగట్ రెజ్లింగ్ [25]
2017 G. S. S. V. ప్రసాద్ బ్యాడ్మింటన్ [6]
2017 బ్రిజ్ భూషణ్ మొహంతి బాక్సింగ్ [6]
2017 P. A. రాఫెల్ హాకీ [6]
2017 సంజోయ్ చక్రవర్తి షూటింగ్ [6]
2017 రోషన్ లాల్ రెజ్లింగ్ [6]
2018 క్లారెన్స్ లోబో హాకీ [26]
2018 తారక్ సిన్హా క్రికెట్ [26]
2018 జీవన్ కుమార్ శర్మ జూడో [26]
2018 V. R. బీడు వ్యాయామ క్రీడలు [26]
2019 రంబీర్ సింగ్ ఖోకర్ కబడ్డీ [27]
2019 సంజయ్ భరద్వాజ్ క్రికెట్ [27]
2019 మెర్జ్బాన్ పటేల్ హాకీ [27]
2020 ధర్మేంద్ర తివారీ విలువిద్య [28]
2020 పురుషోత్తం రాయ్ వ్యాయామ క్రీడలు [28]
2020 శివ సింగ్ బాక్సింగ్ [28]
2020 రొమేష్ పఠానియా హాకీ [28]
2020 క్రిషన్ కుమార్ హుడా కబడ్డీ [28]
2020 విజయ్ భాలచంద్ర మునీశ్వర్§ పవర్ లిఫ్టింగ్ [28]
2020 నరేష్ కుమార్ టెన్నిస్ [28]
2020 ఓం ప్రకాష్ దహియా రెజ్లింగ్ [28]

వివాదాలు

మార్చు

కొందరు గ్రహీతలు తమ పేర్లతో పతక విజేత సాధించిన విజయాలను తప్పుడు క్లెయిమ్ చేశారని ఆరోపించారు. సత్పాల్ సింగ్ (2009), రాంఫాల్ (2011), యశ్వీర్ సింగ్ (2012) లు ముగ్గురూ, రెండుసార్లు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న రెజ్లర్ సుశీల్ కుమార్ తమ శిష్యుడేనని పేర్కొన్నారు. [29] 2012 సంవత్సరానికి గాను ఈ అవార్డును పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ కోచ్ సత్యపాల్ సింగ్‌కు అందించారు. అయితే, 2010 అర్జున అవార్డు గెలుచుకున్న పారా అథ్లెట్ జగ్సీర్ సింగ్, ఈ పురస్కారం కోసం సత్యపాల్ సింగ్‌ తనను శిష్యుడిగా తప్పుగా పేర్కొన్నాడని ఆరోపించాడు. 2006 ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఆర్‌డి సింగ్‌ తనకు ప్రధాన కోచ్‌ అని, సత్యపాల్ సింగ్ సహాయ కోచ్‌ అనీ జగ్సీర్ సింగ్ చెప్పాడు. సత్యపాల్ సింగ్ అలా చెప్పిన సంగతి తనకు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసిందని జగ్సీర్ సింగ్ పేర్కొన్నాడు. [30] 2013 అవార్డు గ్రహీత రాజ్ సింగ్ కూడా సుశీల్ కుమార్, 2012 సమ్మర్ ఒలింపిక్స్ మెడల్ గెలుచుకున్న రెజ్లర్ యోగేశ్వర్ దత్‌లను తమ శిష్యులని పేర్కొన్నాడు. [31] ప్రకటన తర్వాత, ఆగస్టు 2015లో వినోద్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. మాజీ చీఫ్ రెజ్లింగ్ శిక్షకుడైన పిటిషనరు, తాను 2010 నవంబరు నుండి 2015 ఏప్రిల్ వరకు పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ జట్టుకు ప్రధాన జాతీయ శిక్షకుడిగా ఉన్నాననీ గ్రహీత అనూప్ సింగ్ దహియా (375) కంటే తనకు ఎక్కువ పాయింట్లు (420) ఉన్నాయనీ పేర్కొన్నాడు. ఆ అవార్డును కుమార్‌కు ప్రదానం చేయాలని కోర్టు మంత్రిత్వ శాఖను ఆదేశించింది నిర్ణయాన్ని సవాలు చేయడానికి మంత్రిత్వ శాఖకు ఒక వారం గడువు ఇచ్చింది. అయితే, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కుమార్‌ను 2015 మేలో తొలగించినందున మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు [32]

వివరణలు

మార్చు
  1. The cash prize was revised from 5 lakh (US$6,300) to 25 lakh (US$31,000) in 2020.[3]
  2. A World Championship/World Cup is generally organised every four years. For different cyclicities, proportionate marks are given.

మూలాలు

మార్చు

 

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Scheme for Dronacharya Award For Outstanding Coaches In Sports And Games (Amended as on 3 February 2016)" (PDF). Ministry of Youth Affairs and Sports. 3 February 2016. Archived (PDF) from the original on 31 January 2017. Retrieved 18 January 2017.
  2. "Dronacharya award". Sports Logon. 2017. Archived from the original on 21 June 2016. Retrieved 16 February 2017.
  3. "Khel Ratna awardees to receive 25 lakh, 15 lakh for Arjuna awardees". The Indian Express. 29 August 2020. Retrieved 29 August 2020.
  4. Bhardwaj, D. K. "India in Sports: Some Fabulous Achievements". Press Information Bureau, India. Archived from the original on 13 August 2017. Retrieved 11 February 2017.
  5. "Dronacharya Award: Honouring the teacher who moulds an athlete into a star". Olympic Channel. 9 March 2021. Retrieved 27 March 2021.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 6.7 "National Sports Awards 2017" (Press release). Press Information Bureau, India. 22 August 2017. Archived from the original on 23 August 2017. Retrieved 22 August 2017.
  7. 7.00 7.01 7.02 7.03 7.04 7.05 7.06 7.07 7.08 7.09 7.10 7.11 7.12 7.13 7.14 7.15 7.16 7.17 7.18 7.19 7.20 7.21 "List of Dronacharya Awardees". Sports Authority of India. Archived from the original on 7 January 2017. Retrieved 7 January 2017. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. 8.0 8.1 8.2 "Arjun Awards 1998 announced Ms. Jyotirmoyee Sikdar gets Rajiv Gandhi Khel Ratna Award 1998–99" (Press release). Press Information Bureau, India. Archived from the original on 26 April 2016. Retrieved 17 April 2016.
  9. 9.0 9.1 9.2 "Arjuna Awards Presented" (Press release). Press Information Bureau, India. Archived from the original on 8 January 2017. Retrieved 7 January 2017.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 "President presents Rajiv Gandhi Khel Ratna, Arjuna and Dronacharya Awards" (Press release). Press Information Bureau, India. 29 September 2001. Archived from the original on 3 March 2016. Retrieved 17 April 2016.
  11. 11.0 11.1 "President presents Rajiv Gandhi Khel Ratna, Arjuna and Dronacharya Awards" (Press release). Press Information Bureau, India. 29 August 2002. Archived from the original on 26 April 2016. Retrieved 17 April 2016.
  12. 12.0 12.1 12.2 12.3 12.4 "Arjuna Awards, Rajiv Gandhi Khel Ratna, Dhyan Chand and Dronacharya Awards given away" (Press release). Press Information Bureau, India. 29 August 2003. Archived from the original on 26 April 2016. Retrieved 17 April 2016.
  13. 13.0 13.1 13.2 13.3 "President gives away Arjuna Awards and Dronacharya Awards" (Press release). Press Information Bureau, India. 21 September 2004. Archived from the original on 26 April 2016. Retrieved 17 April 2016.
  14. 14.0 14.1 14.2 "President gives away Arjuna Awards and Dronacharya Awards" (Press release). Press Information Bureau, India. 29 August 2005. Archived from the original on 26 April 2016. Retrieved 17 April 2016.
  15. 15.0 15.1 15.2 15.3 "Rajiv Gandhi Khel Ratna award, 2005, Arjuna awards 2005, Dhyan Chand awards, 2006 and Dronacharya awards for the year 2005 Announced" (Press release). Press Information Bureau, India. 23 August 2006. Archived from the original on 26 April 2016. Retrieved 17 April 2016.
  16. 16.0 16.1 16.2 "President gives away Arjuna Awards and Dronacharya Awards" (Press release). Press Information Bureau, India. 29 August 2007. Archived from the original on 26 April 2016. Retrieved 17 April 2016.
  17. 17.0 17.1 17.2 17.3 "Rajiv Gandhi Khel Ratna & Arjuna Awards announced" (Press release). Press Information Bureau, India. 19 August 2008. Archived from the original on 26 April 2016. Retrieved 17 April 2016.
  18. 18.0 18.1 18.2 18.3 "Rajiv Gandhi Khel Ratna, Arjuna Awards and other Sports Awards Announced" (Press release). Press Information Bureau, India. 29 July 2009. Archived from the original on 26 April 2016. Retrieved 17 April 2016.
  19. 19.0 19.1 19.2 19.3 19.4 "President Gives Away Sports and Adventure Awards" (Press release). Press Information Bureau, India. 29 August 2010. Archived from the original on 8 January 2017. Retrieved 7 January 2017.
  20. 20.0 20.1 20.2 20.3 20.4 "Rajiv Gandhi Khel Ratna, Arjuna Awards and other Sports Awards Announced" (Press release). Press Information Bureau, India. 18 August 2011. Archived from the original on 26 April 2016. Retrieved 17 April 2016.
  21. 21.0 21.1 21.2 21.3 21.4 21.5 21.6 21.7 "President Gives Away National Sports and Adventure Awards" (Press release). Press Information Bureau, India. 29 August 2012. Archived from the original on 8 January 2017. Retrieved 7 January 2017.
  22. 22.0 22.1 22.2 22.3 22.4 "Rajiv Gandhi Khel Ratna and Arjuna Awards" (Press release). Press Information Bureau, India. 22 August 2013. Archived from the original on 26 April 2016. Retrieved 17 April 2016.
  23. 23.0 23.1 23.2 23.3 23.4 "National Sports Awards 2014" (Press release). Press Information Bureau, India. 21 August 2014. Archived from the original on 26 April 2016. Retrieved 17 April 2016.
  24. 24.0 24.1 24.2 24.3 24.4 "National Sports and Adventure Awards" (Press release). Press Information Bureau, India. 29 August 2015. Archived from the original on 8 January 2017. Retrieved 7 January 2017.
  25. 25.0 25.1 25.2 25.3 25.4 25.5 "National Sports Awards 2016" (Press release). Press Information Bureau, India. 22 August 2016. Archived from the original on 25 August 2016. Retrieved 23 August 2016.
  26. 26.0 26.1 26.2 26.3 26.4 26.5 26.6 26.7 "National Sports Awards 2018 announced; Mirabai Chanu and Virat Kohli to get Rajiv Gandhi Khel Ratna" (PDF) (Press release). Press Information Bureau, India. 20 September 2018. Archived from the original (PDF) on 20 September 2018. Retrieved 20 September 2018.
  27. 27.0 27.1 27.2 27.3 27.4 27.5 "National Sports Awards - 2019 announced Bajrang Punia and Deepa Malik to get Rajiv Gandhi Khel Ratna Award" (Press release). Press Information Bureau, India. 20 August 2019. Archived from the original on 22 August 2020. Retrieved 20 August 2019.
  28. 28.00 28.01 28.02 28.03 28.04 28.05 28.06 28.07 28.08 28.09 28.10 28.11 28.12 "National Sports Awards 2020 announced – Rohit Sharma, Mariyappan T., Manik Batra, Ms Vinesh and Ms Rani bag the Khel Ratna" (Press release). Press Information Bureau, India. 21 August 2020. Archived from the original on 22 August 2020. Retrieved 21 August 2020.
  29. "Where credit isn't due". Hindustan Times. 23 August 2012. Archived from the original on 13 February 2017. Retrieved 12 February 2017.
  30. "Has Dr Satyapal Singh get Dronacharya award by cheating?". Zee News. New Delhi: Youtube. 18 April 2015. Archived from the original on 13 February 2017. Retrieved 12 February 2017.
  31. Singh, Navneet (31 August 2013). "Cooked up claims get Dronacharya award for wrestling secretary". Hindustan Times. Archived from the original on 13 February 2017. Retrieved 12 February 2017.
  32. Hussain, Sabi (29 August 2015). "Give Dronacharya Award to Vinod, court tells Ministry". New Delhi. Archived from the original on 13 February 2017. Retrieved 12 February 2017.