ప్రధాన మెనూను తెరువు

శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్, కళలు, విజ్ఞానం, సాహిత్యం, వైద్యం, పత్రికలు, Humanities మరియు ఇతర మేధోకృషులను గుర్తించి ఆయా రంగాలలో ఉన్నత సాధన జరిపినవారిని సన్మానించడానికి వెలకొల్పబడిన ఒక సంస్థ. 1979లో చెన్నైలో పి.వి.రమణయ్య రాజా అనే వాణిజ్యవేత్త ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ రాజా లక్ష్మీ అవార్డు అనే బహుమతిని ప్రారంభించింది. ఈ బహుమతిలో భాగంగా లక్ష రూపాయల నగదును, ప్రశంసా పత్రాన్ని, Plaqueను అందజేస్తారు. అదే బహుమతి గ్రహీత అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన తెలుగు కళా సమితి (Telugu Fine Arts Society TFAS) నుండి డా. కె.వి.రావు, డా. జ్యోతిరావు బహుమతిగా 2000 అమెరికన్ డాలర్ల బహుమతి కూడా అందుకొంటారు.

రాజా-లక్ష్మీ అవార్డు
RLF logo.jpg
పురస్కారం గురించి
విభాగం కళలు, సంగీతం, విజ్ఞానం, పత్రికారంగం
వైద్యం, సమాజ సేవ
వ్యస్థాపితం 1979
మొదటి బహూకరణ 1979
క్రితం బహూకరణ 2007
మొత్తం బహూకరణలు 29
బహూకరించేవారు శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్
నగదు బహుమతి లక్ష రూపాయలు
మొదటి గ్రహీత(లు) శ్రీశ్రీ
క్రితం గ్రహీత(లు) డా. సి.హెచ్. జ్ఞానేశ్వర్ మెమోరియల్ ఎండోమెంట్ ఫండ్
రాజ్యలక్ష్మీ పౌండేషన్ వ్యవస్థాపకులు పి.వి.రమణయ్య రాజా

రాజా లక్ష్మీ ఫౌండేషన్ "రాజా లక్ష్మీ సాహిత్య అవార్డు" ( (1987-1999) మరియు "గురువును గుర్తించండి" ("Recognise the Teacher") అవార్డును కూడా పా్రాంభించింది. కొన్ని ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం "రాజా-లక్ష్మీ అవార్డు", "లక్ష్మీ-రాజా వైదిక అవార్డు" (1994 నుండి) ఇస్తున్నారు. ఈ అవార్డులను శ్రీమతి మహాలక్ష్మీ రాజా పుట్టినరోజు అయిన ఆగస్టు 15న ప్రకటిస్తారు. రమణయ్య రాజా పుట్టినరోజు అయిన నవంబరు 19న బహూకరిస్తారు. చెన్నై ఐ.ఐ.టి. M.Sc. Chemistryలో ఉత్తమ విద్యార్థికి రత్నారావు స్మారక బహుమతిని ఇస్తున్నారు. ప్రతి యేటా మార్చి 13న మహాలక్ష్మీరాజా స్మారక ఉపన్యాస సభను నిర్వహిస్తున్నారు.

2008 సంవత్సరానికి గాను రాజా లక్ష్మీ అవార్డు కోనేరు హంపికి, ఆచంట శరత్ కమల్‌కు క్రీడారంగంలో వాఱి ప్రతిభకు గుర్తింపుగా ప్రకటించారు. క్రీడా రంగంలో ఫౌండేషన్ నుండి ఇది మొదటి అవార్డు.

ప్రచురణలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

రాజ్యలక్ష్మీ పౌండేషన్ లో అవార్డు గ్రహీతల చిత్రాలుసవరించు

బయటి లింకులుసవరించు