ధర్మచక్రం (1996 సినిమా)

1996 సినిమా

ధర్మచక్రం 1996 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, రమ్యకృష్ణ, ప్రేమ, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకుగాను వెంకటేష్ కు నంది అవార్డ్ వరించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు.[1] అప్పటి దాకా కన్నడంలో కథానాయికగా నటించిన ప్రేమకు ఇదే తొలి తెలుగు సినిమా.

ధర్మచక్రం
Dharma Chakram.jpg
దర్శకత్వంసురేష్ కృష్ణ
రచనఎం. వి. ఎస్. హరనాథ రావు (మాటలు), సురేష్ కృష్ణ (కథ/చిత్రానువాదం)
నిర్మాతడి. రామానాయుడు
నటవర్గంవెంకటేష్,
రమ్యకృష్ణ ,
ప్రేమ,
గిరీష్ కర్నాడ్,
శ్రీవిద్య,
శ్రీలత,
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంకె. రవీంద్రబాబు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఎం.ఎం. శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1996 జనవరి 13 (1996-01-13)
భాషతెలుగు

కథసవరించు

రాకేష్ ఒక న్యాయవాది. తండ్రి పేరున్న రాజకీయ నాయకుడు. తల్లి శారద. రాకేష్ సురేఖ అనే మధ్య తరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇది అతని తండ్రికి నచ్చదు. ఆమెను వేశ్యగా చిత్రీకరించి ఆమె మరణానికి కారణమవుతాడు. దాంతో రాకేష్ తండ్రిని అసహ్యించుకుని వైరం ఏర్పరుచుకుంటాడు. తల్లి శారద భర్త, కొడుకుల మధ్య నలిగిపోతూ ఉంటుంది. రాకేష్ కు తల్లి మాటంటే వేదవాక్కు. ఆమె తనయుడి ఆవేశాన్ని నియంత్రిస్తూ దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది.

తారాగణంసవరించు

నిర్మాణంసవరించు

1995 జూన్ 22 న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభించింది. రెండున్నర పాటలు కెనడాలో చిత్రీకరించారు. కెనడాలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇది. మొత్తం 62 రోజులపాటు చిత్రీకరణ జరగగా వెంకటేష్ 52 రోజులు నటించాడు.[1]

పాటలుసవరించు

  • సొగసు చూడ హాయి హాయిలే.. తెలిసె నేడు ఇంత హాయి

విశేషాలుసవరించు

  • ఈ సినిమా లోని నటనకు గాను వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా నంది బహుమతి వచ్చింది.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 యు, వినాయకరావు (2014). మూవీ మొఘల్. హైదరాబాదు: జయశ్రీ పబ్లికేషన్స్. pp. 218–219.[permanent dead link]