ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పొన్నూరు నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యే, గా గెలుపొందారు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు,సంగం డెయిరీ ఛైర్మన్ గా ఉన్నారు
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ | |||
| |||
మాజీ ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1994 – 2019 | |||
ముందు | ధూళిపాళ్ల వీరయ్య చౌదరి | ||
---|---|---|---|
నియోజకవర్గం | పొన్నూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చింతలపూడి[1], పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా | 1967 డిసెంబరు 14||
జీవిత భాగస్వామి | జ్యోతిర్మయి[1][2] | ||
సంతానం |
|
జననం & విద్యాభాస్యం
మార్చుధూళిపాళ్ల నరేంద్ర 1967, డిసెంబరు 14న గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం, చింతలపూడి గ్రామంలో జన్మించాడు. నరేంద్ర తండ్రి సంగం పాల డైరీ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు "పాల వీరయ్య" గా ప్రసిద్ధి గాంచిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి. వీరయ్య చౌదరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశాడు.
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పదవ తరగతి వరకు అనంతవరప్పాడు గ్రామంలో చదివాడు. విజయవాడ లయోలా కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, మైసూర్ యూనివర్సిటీ అనుబంధ జయచామరాజేంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ లో బాచ్యులర్ ఇంజినీరింగ్ (బి.ఈ) పూర్తి చేశాడు.[3]
నరేంద్ర రాజకీయాల్లోకి రాకముందు ఐ. ఏ.ఎస్ అధికారి అవ్వాలనే లక్ష్యంగా సివిల్స్ వ్రాస్తున్న సమయంలో తండ్రి ఆకస్మిక మరణం తన లక్ష్యాన్ని విడిచిపెట్టేలా చేసింది.
రాజకీయ ప్రవేశం
మార్చు1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి రోడ్ ప్రమాదంలో మృతి చెందడంతో నరేంద్ర రాజకీయాల్లోకి వచ్చాడు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి టి. వెంకటరామయ్య పై 21,729 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[4] 1994 నుండి 2014 వరకు వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2019లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య చేతిలో ఓటమి పాలయ్యాడు.
అవినీతి ఆరోపణలపై ఆయనను ఏసీబీ అధికారులు 2021 ఏప్రిల్ 23లో అరెస్ట్ చేశారు.[5][6][7]
తెలుగుదేశం పార్టీ :
1994 నుంచి ప్రస్తుతం వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నరేంద్ర 2003 లో పార్టీ రైతు విభాగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడుగా, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు . అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ తరుపున అటూ రాష్ట్రవ్యాప్తంగా ఇటూ గుంటూరు జిల్లాలో అనేక పోరాటాలు చేశాడు.
సంగం డైరీ :
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి సంగం పాల డైరీ ఛైర్మన్ గా ప్రవేశించాడు 1994 -1995 వరకు డైరీ తొలిసారి పనిచేసిన నరేంద్ర తరువాతి కాలంలో డైరీ ఛైర్మన్ గా వైదొలిగి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాడు.
2010 లో మరోసారి డైరీ ఛైర్మన్ గా ఎన్నికయిన నరేంద్ర ఇప్పటి వరకు కొనసాగుతున్నాడు .తన హయాంలో నే రాష్ట్ర సహకార చట్టం మాక్స్ పరిథిలో ఉన్న డైరీని 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంపెనీ చట్టంలోకి మరి కేంద్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య నుంచి విశిష్టమైన ప్రయోజనాలను పొందింది, నరేంద్ర హయాంలో సంగం డైరీ 200 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ నుంచి 1000 కోట్ల రూపాయల టర్నోవర్ కు పెరిగింది అంతేకాకుండా డైరీ అనుబంధ పాల పొడి కేంద్ర సామర్థ్యాన్ని పెంచడంతో పాటుగా పలు నూతన పాల ఆధారిత ఉత్పత్తులు మార్కెట్ లో ప్రవేశ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార డైరీ లలో విజయవంతంగా నడుస్తున్న డైరీల్లో సంగం డైరీ ఒకటిగా నిలిపారు.
సంగం డైరీ తరుపున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను స్థాపించి ప్రజలకి సరసమైన ధరల్లో అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారు.
ఎమ్మెల్యే గా
మార్చుక్రమసంఖ్య | సంవత్సరం | పోటీచేసింది | పార్టీ | నియోజకవర్గం | ప్రత్యర్థి | ఓట్లు | ఆధిక్యం | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|
1 | 1994 | ఎమ్మెల్యే | టీడీపీ | పొన్నూరు | టి. వెంకట రామయ్య కాంగ్రెస్ పార్టీ | 52087 - 30358 | 21729 | గెలుపు[4][8] |
2 | 1999 | టీడీపీ | చిట్టినేని ప్రతాప్ బాబు కాంగ్రెస్ పార్టీ | 54865 - 39332 | 15533 | గెలుపు[4][9] | ||
3 | 2004 | టీడీపీ | మన్నవ రాజా కిషోర్ కాంగ్రెస్ పార్టీ | 51288 - 42243 | 9045 | గెలుపు[4][10] | ||
4 | 2009 | టీడీపీ | రవి వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ | 61008 - 58840 | 2168 | గెలుపు[11] | ||
5 | 2014 | టీడీపీ | రవి వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 88386 - 80625 | 7761 | గెలుపు[12] | ||
6 | 2019 | టీడీపీ | కిలారి వెంకట రోశయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 87570 - 86458 | -1112 | ఓటమి[13][14] |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 https://www.telugupoliticalwiki.com/2016/12/dhulipalla-narendra-kumar.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-08-19. Retrieved 2021-04-23.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Telugu Political Wiki. "ధూళిపాళ్ల నరేంద్ర కుమార్". Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.
- ↑ 4.0 4.1 4.2 4.3 "Ponnur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com.
- ↑ TV9 Telugu (23 April 2021). "Dhulipalla Narendra arrest: అవినీతి ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్.. చింతలపూడిలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ - tdp leader dhulipalla narendra arrest in guntur district". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ News18 Telugu (23 April 2021). "Dhulipalla Narendra: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్.. ఏపీలో రాజకీయ దుమారం". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (23 April 2021). "తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ - tdp leader dhulipalla narendra arrest". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
- ↑ "Andhra Pradesh 1994". Election Commission of India.
- ↑ "Andhra Pradesh 1999". Election Commission of India.
- ↑ "Andhra Pradesh 2004". Election Commission of India.
- ↑ "Andhra Pradesh 2009". Election Commission of India.
- ↑ "Andhra Pradesh 2014". Election Commission of India.
- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2019". Election Commission of India.
- ↑ "Andhra Pradesh Ponnur Elections Result 2019: Ponnur Voting Result Update, Seats Tally". DNA India.