నంగివాండ్లపల్లి

నంగివాండ్లపల్లి అనంతపురం జిల్లా తలుపుల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది మండల కేంద్రమైన తలుపులకు 1.5 కిలోమీటర్ల దూరాన ఉంది.ఈ గ్రామం కుటుంబ విలువలుకు ప్రతీక. దీనికి సమీపంలో "ఓబులెశ్వర స్వామి" కొండలో ఓబులెశ్వర స్వామి (నరసింహ స్వామి) వెలసి ఉన్నాడు.ఈ గ్రామంలో ప్రతి ఏటా మలకల ఫౌర్నమి ఘణంగా జరుగును. జనాభా సుమారు 300.ఈ ఊరు ఆహ్లద వాతావరణం నడుమ, పచ్ఛని చెట్ల నడుమ వున్నది (జామ, మామిడి తోపుల చెంతన). ఈ వూరి ప్రజల జీవనాదారము వ్యవసాయము, పాలు విక్రయించడము. ఇక్కడ ప్రధానంగా వేరుశెనగ పంట. ఒకప్పుడు పట్టు పురుగుల పెంపకం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది. వర్షాభావం వల్ల అది మరుగున పడిపోయింది, ఈ గ్రామానికి 7 కి.మీ దూరాన "తిమ్మమ్మ మర్రిమాను" (తిమ్మమ్మ దేవాలయం) అను మర్రిమాను (లో అతి పెద్ద మర్రిమాను Guinness book of Record) సుమారు 7 ఎకరములు విస్తీర్ణమందు వెలసివుంది. ఈ గ్రామానికి సుమారు 70 కి.మీ. దూరాన పవిత్ర పుణ్య స్థలం "పుట్టపర్తి" వెలసివుంది.

నంగివాండ్లపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
నంగివాండ్లపల్లి is located in Andhra Pradesh
నంగివాండ్లపల్లి
నంగివాండ్లపల్లి
అక్షాంశరేఖాంశాలు: 14°14′35″N 78°15′25″E / 14.243°N 78.257°E / 14.243; 78.257
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం తలుపుల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు