నగరి పురపాలక సంఘం
నగరి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరుకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం లోని, నగరి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
నగరి | |
స్థాపన | 2005 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చునగరి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుకు చెందిన పురపాలక సంఘం.ఇది 2005 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.[1]
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం 62,253 జనాభా ఉండగా అందులో పురుషులు 31,363, మహిళలు 30,890 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 77.85% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 86.49% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 69.15%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6842 ఉన్నారు.[2]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
మార్చుప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా కె.శాంతి, [3] వైస్ చైర్మన్‌గా పి.జి. నీలమేఘం పనిచేస్తున్నారు.[3]
ఇతర వివరాలు
మార్చుఈ పురపాలక సంఘం 38.77.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.11 రెవెన్యూ వార్డులు,27 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి,6 ఇ-సేవా కేంద్రాలు,133 పవర్ బోర్లు,154 చేతి బోర్లు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "Nagari Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-11.
- ↑ 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.