నలిమెల భాస్కర్

నలిమెల భాస్కర్ కవి, పరిశోధకుడు, బహుభాషావేత్త.

నలిమెల భాస్కర్
Nalimela Bhaskar.jpg
నలిమెల భాస్కర్
జననం
నలిమెల భాస్కర్

1956 ఫిబ్రవరి 12
వృత్తికవి, పరిశోధకుడు, బహుభాషావేత్త
సుపరిచితుడుకవి, పరిశోధకుడు, బహుభాషావేత్త
తల్లిదండ్రులు
 • రాంచంద్రం (తండ్రి)
 • బుచ్చమ్మ (తల్లి)

జీవిత విశేషాలుసవరించు

అతను 1956 ఫిబ్రవరి 12న రాజన్న సిరిసిల్ల జిల్లా యల్లారెడ్డిపేట్ మండలం నారాయణపూర్‌లో బుచ్చమ్మ, రాంచంద్రం దంపతులకు జన్మించాడు. తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ సామెతలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ చేశాడు.[1] తెలుగు, మళయాళ కుటుంబ సామెతలపై పరిశోధన చేసి అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందాడు. అతనికి 14 భాషల్లో పట్టుంది. తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి 2011 నవంబర్‌లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు.[2] తెలంగాణ పదకోశాన్ని రూపొందించడమే కాకుండా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించాడు. అద్దంలో గాంధారి, మట్టిముత్యాలు, సుద్దముక్క వంటి 17 సంకలనాలను ఆవిష్కరించాడు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాడు. 2014, మార్చి 10న 2013 సంవత్సరానికిగాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీచే పురస్కారం ప్రకటించబడింది.[3] మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన "స్మారక శిశిగల్" నవలను నలిమెల భాస్కర్ తెలుగులో "స్మారక శిలలు" పేరిట తెలుగులోకి అనువదించాడు. పి.వి.నరసింహారావు తర్వాత ఈ పురస్కారం పొందిన కరీంనగర్ జిల్లా రచయితలలో భాస్కర్ రెండో వ్యక్తి.

పురస్కారాలుసవరించు

 • మళయాళంలో అనువాద నవల స్మారకశిలలుకు 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు,
 • డా. బోయి భీమన్న అనువాద పురస్కారం - లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014) [4].
 • 1997లో అద్దంలో గాంధారి అనువాద రచనకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం,
 • 1998లో మద్రాస్ కళాసాగర్ సిరిసిల్ల శాఖ పురస్కారం,
 • 1999లో కళాజ్యోతి కరీంనగర్‌వారి పురస్కారం,
 • 2000లో కవిసమయం పురస్కారం,
 • 2001లో ఏపీ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం,
 • 2001లో బీఎన్ శాస్త్రి పురస్కారం,
 • 2003లో సిరివెలుగులు (సిరిసిల్ల) పురస్కారం,
 • 2006లో అధికార భాషా సంఘం పురస్కారం,
 • 2008లో ద్వానా శాస్త్రి పురస్కారం,
 • 2010లో ఇండియన్ హైకూక్లబ్ అనకాపల్లివారి పురస్కారం,

బయటి లింకులుసవరించు

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

 1. "ఎడారిలో ఒక్క పువ్వే.. తోటంత విలువ చేస్తుంది అన్న కవి".
 2. http://www.jagranjosh.com/current-affairs/telugu-kendra-sahitya-academy-award-announced-for-nalimela-bhasker-1394536647-3
 3. ఈనాడు దినపత్రిక, తేది 11-03-2014
 4. నమస్తే తెలంగాణలో బోయి భీమన్న సాహితీ పురస్కారాలు వ్యాసం