నల్లమిల్లి మూలారెడ్డి

నల్లమిల్లి మూలారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అనపర్తి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

నల్లమిల్లి మూలారెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 2004
ముందు తేతల రామారెడ్డి
తరువాత తేతల రామారెడ్డి
నియోజకవర్గం అనపర్తి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1983 - 1989
ముందు పడాల అమ్మి రెడ్డి
తరువాత తేతల రామారెడ్డి
నియోజకవర్గం అనపర్తి

వ్యక్తిగత వివరాలు

జననం 1942 మే 8
రామవరం, అనపర్తి , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 2022 ఆగస్టు 1
రామవరం, అనపర్తి , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌
తల్లిదండ్రులు నల్లమిల్లి సుబ్బిరెడ్డి, వీరయ్యమ్మ
జీవిత భాగస్వామి సత్యవతి
సంతానం ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

రాజకీయ జీవితం మార్చు

నల్లమిల్లి మూలారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1968లో జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శిగా నియమితుడై, 1970లో రామవరం సర్పంచ్‌గా ఎన్నికై 1983 వరకు రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పని చేసి 1982లో నందమూరి తారకరామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత 1983లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అనపర్తి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

నల్లమిల్లి మూలారెడ్డి 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2009 వరకు జరిగిన తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి 1983, 1985, 1994, 1999 ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మరణం మార్చు

నల్లమిల్లి మూలారెడ్డి 2022 ఆగస్టు 1న అనారోగ్యంతో బాధపడుతూ రామవరంలోని తన స్వగృహంలో మరణించాడు. ఆయనకు భార్య సత్యవతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు.[1][2][3]

మూలాలు మార్చు

  1. Andhrajyothy (2 August 2022). "రాజకీయ దిగ్గజం మూలారెడ్డి ఇకలేరు". Archived from the original on 24 April 2024. Retrieved 24 April 2024.
  2. "Former TD MLA Moola Reddy passes away" (in ఇంగ్లీష్). 2 August 2022. Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.
  3. NTV Telugu (1 August 2022). "టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కన్నుమూత". Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.