నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అని కూడా పిలువబడే నల్లారి కిషన్ కుమార్ రెడ్డి 1965 సెప్టెంబర్ 13న జన్మించారు. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన తన తండ్రి దివంగత అమర్‌నాథ్ రెడ్డి నుండి రాజకీయ మూలాలను కిషోర్ కుమార్ రెడ్డి వారసత్వంగా పొందారు.[] ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డికి అన్న అవుతాడు.[1]
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి | |
---|---|
జననం | 1965 సెప్టెంబర్ 13 కలికిరి, అన్నమయ్య జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ(2017-ప్రస్తుతం) |
భార్య / భర్త | తనుజా రెడ్డి |
పిల్లలు | నల్లారి అమర్నాథ్ రెడ్డి |
నల్లారి కుటుంబం చిత్తూరు జిల్లాలో రాజకీయంగా పేరుగాంచిన కుటుంబం.
కిషోర్ కుమార్ రెడ్డి ఎన్ తనుజా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు, కుమారుడు నల్లారి అమరనాథ్ రెడ్డి [2] ఒక కుమార్తె N. వైష్ణవి రెడ్డి, ప్రస్తుతం వైష్ణవి రెడ్డి వైద్యురాలిగా కొనసాగుతోంది.
జీవిత విశేషాలు
మార్చుకిషోర్ కుమార్ రెడ్డి ఏపీ వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. నల్లారి కిషోర్ కుమార్ చిత్తూరు జిల్లా నగరిపల్లెకు చెందినవారు కిషోర్ కుమార్ రెడ్డి 1984లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను, 1987లో నృప్తుంగ జూనియర్ కాలేజ్ హైదరాబాదు నుండి ఇంటర్మీడియట్ 1990 సంవత్సరంలో హైదరాబాద్ నిజాం కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసాడు [3]
రాజకీయ జీవితం
మార్చుకిషోర్ కుమార్ రెడ్డి తన అన్నయ్య కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి కిషోర్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 ఎన్నికలలో జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) తరపున కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు అసెంబ్లీ నుండి పోటీ చేసి 57,000 ఓట్లు సాధించారు. [4] [5] [6] [7]
2017లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. [8]
2014 ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో కిషోర్‌కుమార్‌రెడ్డి ఓడిపోయారు. [9] ఏపీ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కిషోర్ కుమార్ రెడ్డి ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు. [10] [11] [12] కిషోర్ కుమార్ రెడ్డి ఏపీ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (2024). "AP Nallari Kishore Kumar Reddy contesting in Assembly Election Profile Information". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Vaartha Vaani (23 November 2017). "Nallari Amarnath Reddy Comments on YS Jagan - Vaartha Vaani" – via YouTube.
- ↑ Rao, CH V. M. Krishna (17 November 2017). "Former AP CM Nallari Kiran Kumar Reddy's brother joins Telugu Desam". Deccan Chronicle.
- ↑ Venkat (16 November 2017). "Nallari Brother To Shift Loyalties To TDP!". greatandhra.com.
- ↑ readwhere. "Nallari Kishore kumar reddy Archives". Archived from the original on 2022-03-15. Retrieved 2023-11-27.
- ↑ "nallari kishore kumar reddy Archives".
- ↑ "Nallari Kishore Kumar Reddy joins TDP". chittoor.suryaa.com. Archived from the original on 2019-02-13. Retrieved 2023-11-27.
- ↑ The Hans India (2017-09-12). "Nallari group likely to join TDP". Thehansindia.com. Retrieved 2019-04-19.
- ↑ "Pileru Elections Results 2014, Current MLA, Candidate List of Assembly Elections in Pileru, Andhra Pradesh". www.elections.in.
- ↑ Umashanker, K. (21 September 2017). "Nallari brothers reaching out to people for 'political suggestions'" – via www.thehindu.com.
- ↑ Srinivas, Mittapalli (7 December 2017). "నల్లారి కిశోర్ టీడీపీ చేరిక వెనుక: కిరణ్ ఇంట్లో పెద్ద చర్చే!, చాలానే జరిగింది." telugu.oneindia.com.
- ↑ I News (25 April 2016). "Nallari Kishore Kumar Reddy Takes Charge as AP Housing Corporation Chairman - iNews" – via YouTube.