నవపాషాణం ఆలయం
నవపాషాణం ఆలయం అనేది దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడు దేవిపట్టణంలో ఉన్న అధిదేవతలైన నవగ్రహాలకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది బంగాళాఖాతంలో నెలకొని ఉన్న హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ నవగ్రహ దేవతల విగ్రహాలను విష్ణువు అవతారమైన శ్రీరాముడు ప్రతిష్టించినట్టు భక్తుల విశ్వాసం.
నవపాషాణం ఆలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 9°28′53″N 78°53′55″E / 9.48139°N 78.89861°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | రామనాథపురం జిల్లా |
ప్రదేశం | దేవిపట్టినం |
సంస్కృతి | |
దైవం | నవగ్రహాలు |
ఈ ఆలయం భక్తులు తమ పూర్వీకుల కోసం కర్మలు చేసే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. రామేశ్వరం రామనాథస్వామి ఆలయం, తిరుపుల్లాణి ఆది జగన్నాథ పెరుమాళ్ ఆలయం లతో పాటు ఇది ఈ ప్రాంతంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కూడా. ఈ ఆలయాన్ని మొదట రామనాథపురం సంస్థానం దేవస్థానం నిర్వహించింది. ఇప్పటికీ రామనాథపురం రాణి వంశపారంపర్య ధర్మకర్త ఆధ్వర్యంలో ఉంది. అయితే, దీనిని తమిళనాడు ప్రభుత్వ హెచ్ఆర్ అండ్ సిఇ విభాగం నియంత్రిస్తుంది.
నవపాషాణం ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై 41 మైళ్ళ దూరంలో ఉన్న దేవిపట్టణం అనే ప్రాంతంలో ఉంది. తొమ్మిది గ్రహాల దేవతల విగ్రహాలు బంగాళాఖాతంలో ఒక అమరికలో ఉన్నాయి. ఒడ్డున ఉన్న ఒక మార్గం గుండా గర్భగుడికి చేరుకోవచ్చు.[1] [2] ఇక్కడ మహిషాసుర మర్దన జరగడంతో ఈ గ్రామంలో దేవి ఆలయం కూడా ఉంది, అందువల్ల ఈ ప్రదేశాన్ని దేవిపట్టణం అని పిలుస్తారు.[3]
పురాణం
మార్చురావణుడు, తనను దేవతలు సైతం సంచరించ లేకుండా బ్రహ్మ నుండి వరాలు పొందాడు. రాక్షసుడిని చంపడానికి, విష్ణు రామునిగా మానవ అవతారం ఎత్తాడు. శ్రీరాముడు, సీతమ్మ అరణ్యవాసంలో ఉండగా రావణుడు వచ్చి ఆమెను అపహరించాడు. రావణుడు బందీగా ఉంచిన అశోకావనం నుండి తన భార్య సీతను విడిపించడానికి రాముడు లంకకు వంతెన నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. లంక చేరుకోవడానికి సమీప ప్రాంతం ధనుష్కోడి నుండి ఈ వంతెనను నిర్మించాలని ప్రతిపాదించాడు. రాముడు మొదట వినాయకుడి అనుగ్రహం కోరుతూ పూజ చేయడం ప్రారంభించాడు. ఆయన పూజ చేసిన ప్రదేశం ఉప్పూరులోని వినయగర్ ఆలయం అని నమ్ముతారు. హిందూ ఆరాధనలో రెండవ దశ నవగ్రహ పూజ, ఇందులో తొమ్మిది గ్రహ దేవతలను పూజ ఉంటుంది, ఇది నవపాషాణంలో జరిగింది.[4] శ్రీరాముడు ఆ ప్రదేశంలో నవగ్రహాలను స్థాపించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది.[5]
ఎలా చేరుకోవాలి?
మార్చుఈ ఆలయాన్ని మొదట శివగంగ దేవస్థానం 2012 వరకు నిర్వహించింది. ఆ తరువాత, దీనిని తమిళనాడు ఎండోమెంట్ బోర్డు చేపట్టింది.[6] కోర్టు జోక్యం తరువాత డిసెంబరు 2015లో ఈ అప్పగింపు జరిగింది.[7] ఈ ఆలయం ప్రతీరోజు ఉదయం 4.30 నుండి సాయంత్రం 6.30 వరకు తెరిచి ఉంటుంది.[8] [9] సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు, బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని దేవతలకు ప్రత్యేకమైన తొమ్మిది వేర్వేరు రకాల ధాన్యాలను అర్పించే పద్ధతి సాధారణంగా ఆలయంలో అనుసరించబడుతుంది.[10]
ఆలయానికి అత్యంత సమీపంలోని విమానాశ్రయం 115 కిలోమీటర్ల దూరంలో మదురైలో ఉంది. రామనాథపురం వద్ద ఆలయానికి 14 కిలోమీటర్ల దూరంలో సమీప రైలు స్టేషన్ ఉంది. కరైకుడి వెళ్లే మార్గంలో దేవిపట్టణంలో బస్సులు ఆగుతాయి. రోడ్డుమార్గంలో కరైకుడి, పిల్లయార్ పట్టి, ఉప్పూరు మీదుగా దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో నవపాషాణం చేరుకోవచ్చు.
మూలాలు
మార్చు- ↑ Illustrated Guide to the South Indian Railway (1926). Illustrated Guide to the South Indian Railway (Incorporated in England): Including the Tanjore District Board, Pondicherry, Peralam-Karaikkal, Travancore State, Cochin State, Coimbatore District Board, Tinnevelly-Tiruchendur, and the Nilgiri Railways. Asian Educational Services. pp. 108–9. ISBN 9788120618893.
- ↑ Select Shrines of Sri Rama. Little Flower Company. 1964. p. 69.
- ↑ Palanithurai, Ganapathy (2008). Change Makers at Grassroots: Local Governance in Action. Concept Publishing Company. p. 24. ISBN 9788180694714.
- ↑ V., Meena. Temples in South India. Kanniyakumari: Harikumar Arts. p. 13.
- ↑ Nair, Shantha N. (2009). The Lord Shiva. Pustak Mahal. p. 180. ISBN 9788122310399.
- ↑ Palanithurai, Ganapathy (2008). Change Makers at Grassroots: Local Governance in Action. Concept Publishing Company. ISBN 9788180694714.
- ↑ D.J., Walter Scott (1 December 2015). "'Navapashanam Temple' comes under HR and CE department". The Hindu. Retrieved 23 January 2021.
- ↑ "Thousands pay obeisance on Thai amavasya". The Hindu. 4 February 2019. Retrieved 23 January 2021.
- ↑ Bajpai, R.S. (2002). The Splendours And Dimensions Of Yoga 2 Vols. Set. Atlantic Publishers & Distributors. p. 484. ISBN 9788171569649.
- ↑ "Sri Navapashana temple". Dinamalar. 2014. Retrieved 10 November 2015.