నాగారం (కీసర మండలం)
నాగరం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న నాగారం పురపాలకసంఘం ఏర్పడింది.[2]
నాగారం | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°28′59″N 78°36′30″E / 17.483010°N 78.608299°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
మండలం | కీసర |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ 500083 | |
ఎస్.టి.డి కోడ్ 08720 |
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం. 30502, పురుషులు 15504, స్త్రీలు 14998, నివాస గృహాలు.1985. ఆరు 6 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు 3680, అక్షరాస్యులు 22907 ప్రధాన భాష. తెలుగు.
సమీప గ్రామాలు
మార్చుపర్వతపూర్ 5 కి.మీ. చీర్యాల్ 5 కి.మీ. చంగిచెర్ల 6 కి.మీ. జవహర్ నగర్ 7 కి.మీ. యాద్గార్ పల్లి 7 కి.మీ దూరంలో ఉన్నాయి.
విద్యాసంస్థలు
మార్చుగ్రామంలో హరిజన కాలేజి ఆఫ్ ఫార్మసి, గౌతమీ వికాస్ మోడల్ స్కూల్, సెయింట్ మేరీ బెతోని కాన్వెంట్ స్కూల్, సెయింట్ ఆంతోని గ్రామర్ స్కూల్, జిల్లాపరిషత్ హైస్కూల్ ఉన్నాయి.[3]
అభివృద్ధి పనులు
మార్చునాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డులలో 75 లక్షల 30 వేల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు 2022 జూన్ 22న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్ ఎ. వాణిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేష్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 2 April 2021.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-26. Retrieved 2016-06-06.
- ↑ telugu, NT News (2022-06-22). "తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే : మంత్రి మల్లారెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-06-22. Retrieved 2022-06-22.