స్వర్ణలత (1973 ఏప్రిల్ 29 - 2010 సెప్టెంబరు 12) దక్షిణ భారత గాయని. ఈమె సుమారు 7000 పాటలు తమిళం, కన్నడం, తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, బాడిగ భాషలలో పాడి ప్రేక్షకుల మన్ననలను, ఎన్నో పురస్కారాలు పొందారు.[1]

స్వర్ణలత
ఇతర పేర్లుహమ్మింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా
టోన్స్ క్వీన్
తమిళ నైటింగేల్
కురలరాసి
జననం(1973-04-29)1973 ఏప్రిల్ 29
చిత్తూరు, పాలక్కాడ్, కేరళ, భారతదేశం
మరణం2010 సెప్టెంబరు 12(2010-09-12) (వయసు 37)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలిప్లేబ్యాక్ సింగర్, కర్నాటిక్ సంగీతం, హిందుస్తానీ సంగీతం, గజల్
వృత్తిసింగర్
వాయిద్యాలుగాత్రం
క్రియాశీల కాలం1987–2010

ఈమెకు కరుత్తమ్మ సినిమాలో పొరలె పొన్నుతాయి అనే పాటకు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. ఈ పాటను ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈమె గాత్రం విలక్షణంగా ఉండటం వలన సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు..[2]

జీవిత సంగ్రహం మార్చు

స్వర్ణలత కేరళ రాష్ట్రంలో పలక్కాడ్ లోని చిత్తూర్ గ్రామంలో 1973 ఏప్రిల్ 29న జన్మించింది. ఈమె తల్లితండ్రులు కె.సి.చెరుకుట్టి, కళ్యాణి. ఈమె తండ్రి హార్మోనియం వాద్యంలో నిపుణులు, మంచి గాయకుడు కూడా. ఈమె తల్లికి సంగీతం మీద శ్రద్ధ వలన స్వర్ణలతకు హార్మోనియం, కీ-బోర్డులో శిక్షణ ఇప్పించారు.[3] వీరి కుటుంబం షిమోగాకు తరలి వెళ్ళి అక్కడే స్వర్ణలత చదువుకున్నారు.[4] ఈమెకు గల సంగీతాభిమానం చూసి ఎం.ఎస్. విశ్వనాథన్, జేసుదాసుతో కలిపి మలయాళ యుగళగీతం పాడే అవకాశం 1987లో ఇచ్చారు.[2],[4]

ఇక స్వర్ణలత వెనుతిరుగలేదు, చాలా మంది సంగీత దర్శకులు తమ పాటలకోసం ఆమెను సంప్రదించారు. ఆమె ఇళయరాజా, ఎ. ఆర్. రెహమాన్.. లాంటి ప్రముఖ సంగీత దర్శకులతో ఎక్కువ పనిచేసారు. స్వర్ణలత పాడిన హిందీ పాటలలో రంగీలాలోని "హై రామ యే క్యా హువా" ఎక్కువ ప్రాచూర్యం పొందింది.

తెలుగులో మణిశర్మ, రమణ గోగుల, రాజ్‌-కోటి, వందేమాతరం శ్రీనివాస్‌ల సంగీత దర్శకత్వంలో స్వర్ణలత మరిన్ని పాటలను రికార్డ్ చేసింది. వాటిలో రామ్మా చిలకమ్మా, ఒసేయ్ రాములమ్మా, నిజాం బాబులు వంటి అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు ఉన్నాయి.

సినిమాలు మార్చు

2007 నీవల్లే నీవల్లే (వైశాఖ వెన్నెల)

2005 తిరుపాచి

2004 స్వయంవరం (కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం)

2004 యజ్ఞం

2002 వాసు (పాటకు ప్రాణం పల్లవి అయితే..ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా)

2001 వన్ మ్యాన్ షో

2001 సుందర పురుషన్

2001 డుం డుం డుం 2001 డబుల్స్

2001 భలేవాడివి బాసు

2001 ప్రేమతో రా

2001 ప్రియమైన నీకు

2001 ఖుషి (హోలీ... గజ్జె ఘల్లుమన్నాదిరో)

2001 మృగరాజు

2000 తెంకాశిపట్టణం

2000 సఖి (కలలై పొయెను నా ప్రేమలు)

2000 బాచి

2000 జయం మనదేరా

2000 దేవుళ్లు (సిరులు నొసగు సిరిశాంతులు)

2000 దేవీ పుత్రుడు

2000 దిల్ హయ్ దిల్ మే (ప్లేబ్యాక్ సింగర్: "డోల డోలా")

2000 కలిసుందాం రా

2000 ఆవారాగాడు

1999 శీను

1999 ప్రేమికుల రోజు (ప్రేమ అనే పరీక్ష రాసి)

1999 మోనిషా ఎన్ మోనాలిసా

1999 ఒకే ఒక్కడు (ఏరువాక సాగుతుండగా)

1999 ముధల్వాన్

1999 వాలి

1998 ఎన్ ఆసై రసవే

1998 ఆటో డ్రైవర్

1998 సూర్యవంశం

1998 ఆవిడా మా ఆవిడే

1998 ఆవారాగాడు

1998 చూడాలని వుంది (రామ్మా చిలకమ్మా)

1998 లవ్‌స్టోరీ 1999

1997 ప్రియమైన శ్రీవారు

1997 ముద్దుల మొగుడు

1997 మిన్సార కనవు

1997 మెరుపు కలలు (స్ట్రాబెర్రీ కన్నె)

1997 అనగనగా ఒక రోజు

1997 దొంగాట

1997 పెళ్ళి చేసుకుందాం (ఓ లైలా లైలా)

1997 ప్రేమించుకుందాం రా (పెళ్లికళ వచ్చేసిందే బాలా)

1996 Mr. రోమియో

1996 ఇండియన్

1996 ప్రేమ లేఖ

1996 రాముడొచ్చాడు

1996 ఇందిర (ప్రియాంక)

1996 కాతిల్ ఒరు కిన్నారం

1995 సిసింద్రీ (చిన్ని తండ్రీ నిను చూడగ)

1995 శాస్త్రి (వయసు వచ్చిందమ్మా, దింతలకిడి దిల్లాలి)

1995 రంగీల (హే రామా)

1995 బాద్షా

1995 బొంబాయి (కుచ్చి కుచ్చి కూనమ్మా)

1995 సదరం

1994 పవిత్ర

1994 వీర

1993 వద్దు బావా తప్పు

1992 దళపతి (ముద్దబంతి పూచేనులే, యమునా తటిలో నల్లనల్లకై ఎదురుచూసెను రాధ)

1992 ఈడు నమ్మ భూమి

1992 పెద్దరికం

1991 ధర్మ దురై

1991 నిర్ణయం (ఓ పాపలూ పాపలు ఐ లవ్ యూ)

1990 క్షత్రియుడు

టెలివిజన్ మార్చు

స్వర్ణలత 2000ల ప్రారంభంలో కొన్ని సంగీత రియాలిటీ షోలలో పాల్గొన్నారు. 2001లో విజయ్ టీవీ రియాల్టీ షోలో, 2004లో జయ టీవీ రాగమాలిక షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

మరణం మార్చు

స్వర్ణలత 37 సంవత్సరాల వయసులో ఇడియోపతిక్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Playback singer Swarnalatha passes away". The Hindu. September 12, 2010. Retrieved September 12, 2010.
  2. 2.0 2.1 National award winning playback singer Swarnalatha passes away, Asian Tribune, Tue, 2010-09-14 03:25
  3. "Swarnalatha Biography". Archived from the original on 2012-07-14. Retrieved 2011-01-02.
  4. 4.0 4.1 "Manorama Online | Malayalam News". Archived from the original on 2010-09-15. Retrieved 2011-01-02.

బయటి లింకులు మార్చు