నాథన్ మెకల్లమ్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

నాథన్ లెస్లీ మెకల్లమ్ (జననం 1980, సెప్టెంబరు 1) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. వన్డే ఇంటర్నేషనల్స్, ట్వంటీ20 ఇంటర్నేషనల్స్‌లో న్యూజీలాండ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1] ఆరు (2007, 2009, 2010, 2012, 2014, 2016) టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఫుట్‌బాల్ కూడా ఆడాడు. మంచి స్ట్రైకర్‌గా పరిగణించబడ్డాడు.

నాథన్ మెకల్లమ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నాథన్ లెస్లీ మెకల్లమ్
పుట్టిన తేదీ (1980-09-01) 1980 సెప్టెంబరు 1 (వయసు 44)
డునెడిన్, ఒటాగో, న్యూజీలాండ్
మారుపేరుమ్యాడ్-ఐ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలింగ్ ఆల్ రౌండర్
బంధువులుబ్రెండన్ మెక్‌కలమ్ (సోదరుడు)
స్టువర్ట్ మెకల్లమ్ (తండ్రి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 156)2009 8 September - Sri Lanka తో
చివరి వన్‌డే2015 19 August - South Africa తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.15
తొలి T20I (క్యాప్ 26)2007 19 September - South Africa తో
చివరి T20I2016 26 March - Bangladesh తో
T20Iల్లో చొక్కా సంఖ్య.15
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999/2000–2015/16Otago (స్క్వాడ్ నం. 8)
2010Lancashire
2011Pune Warriors India
2011/12–2012/13Sydney Sixers (స్క్వాడ్ నం. 15)
2013Glamorgan (స్క్వాడ్ నం. 9)
2015St Lucia Zouks
కెరీర్ గణాంకాలు
పోటీ ODI T20I FC LA
మ్యాచ్‌లు 84 63 65 203
చేసిన పరుగులు 1,070 299 2,329 3,077
బ్యాటింగు సగటు 20.98 11.50 25.04 23.31
100లు/50లు 0/4 0/0 1/14 1/16
అత్యుత్తమ స్కోరు 65 36* 106* 119
వేసిన బంతులు 3,536 1,123 11,508 9,079
వికెట్లు 63 58 139 169
బౌలింగు సగటు 46.92 22.03 40.05 41.41
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 3 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/24 4/16 6/90 5/39
క్యాచ్‌లు/స్టంపింగులు 41/– 26/– 71/– 97/–
మూలం: Cricinfo, 2016 26 March

కుడిచేతి లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి ఆఫ్-బ్రేక్ బౌలర్ గా రాణించాడు. ఒటాగో వోల్ట్స్ సభ్యుడిగా స్టేట్ ఛాంపియన్‌షిప్, స్టేట్ షీల్డ్, స్టేట్ ట్వంటీ 20 పోటీలలో పాల్గొన్నాడు.

2016 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[2][3]

దేశీయ క్రికెట్

మార్చు

1999-2000 సీజన్‌లో ఒటాగో తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. 2000–01 సీజన్‌లో మొదటి లిస్ట్ ఎ మ్యాచ్ ఆడాడు. 2006, జనవరి 13న క్రైస్ట్‌చర్చ్‌లో కాంటర్‌బరీతో మొదటి ట్వంటీ20 దేశీయ మ్యాచ్ ఆడాడు. 2007లో, నెదర్లాండ్స్‌లో పర్యటించాడు. హీర్మేస్ క్రికెట్ క్లబ్‌కు ఆటగాడు-కోచ్‌గా పనిచేశాడు, వయోవర్గం, ప్రధాన జట్టుకు బాధ్యత వహించాడు.[4]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2007, సెప్టెంబరు 19న దక్షిణాఫ్రికాలో జరిగిన ట్వంటీ20 ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజీలాండ్ తరపున ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[5] అయినప్పటికీ, తన టీ20 అరంగేట్రం తర్వాత జట్టు నుండి తొలగించబడ్డాడు. న్యూజీలాండ్ జట్టులోకి తిరిగి రావడానికి మైక్ హెస్సన్‌తో కలిసి మరింత కష్టపడ్డాడు.[6] 2009 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా తొలగించబడ్డాడు.[7]

27 సంవత్సరాల వయస్సులో 2009 సెప్టెంబరు 8న కొలంబోలో శ్రీలంకపై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[8] 2011 ఫిబ్రవరిలో, తీవ్ర జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరిన తర్వాత కెన్యాతో జరిగిన న్యూజీలాండ్ ప్రారంభ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.[9][10] 2011 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు, తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో 221 డిఫెండింగ్‌లో 3/24 తీసుకున్నాడు.[11][12][13]

మూలాలు

మార్చు
  1. "Nathan McCullum Profile – ICC Ranking, Age, Career Info & Stats" (in ఇంగ్లీష్). Cricbuzz. Retrieved 2021-07-10.
  2. "Nathan McCullum to quit international cricket at end of NZ season". ESPNcricinfo. Retrieved 11 March 2017.
  3. "New Zealand pick spin trio for World T20". ESPNcricinfo. Retrieved 11 March 2017.
  4. "Mac the pragmatic" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-07-10.
  5. "Full Scorecard of New Zealand vs South Africa 20th Match, Group E 2007/08 – Score Report | ESPNcricinfo.com" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-07-10.
  6. "Nathan McCullum: Nine interesting things to know about the New Zealand all-rounder". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-09-01. Retrieved 2021-07-10.
  7. "Tuffey and Diamanti in for Champions Trophy" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-07-10.
  8. "Full Scorecard of Sri Lanka vs New Zealand 1st Match 2009 – Score Report | ESPNcricinfo.com" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-07-10.
  9. "Nathan McCullum likely to miss first game" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-07-10.
  10. "Nathan McCullum admitted to hospital with fever". Stabroek News (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-02-19. Retrieved 2021-07-10.
  11. "ICC World Cup 2011: Plucky New Zealand defeat favourites South Africa in a cliffhanger". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-26. Retrieved 2021-07-10.
  12. "Taylor blitz sets up NZ victory" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2011-03-09. Retrieved 2021-07-10.
  13. "ICC World Cup 2011 quarter-final: New Zealand spinners choke South Africa". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-02-02. Retrieved 2021-07-10.

బాహ్య లింకులు

మార్చు