నానక్‌షాహి కేలండర్
నానక్‌షాహి (పంజాబీ: ਨਾਨਕਸ਼ਾਹੀ, nānakashāhī) కాలెండరు సౌర కాలెండరు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ 1998 లో దీన్ని స్వీకరించింది.[1] 2003 నుండి అమలు చెయ్యడం మొదలుపెట్టింది.[2][3] ఈ కాలెండరులో ముఖ్యమైన సిక్కుల సంఘటలు, పండగలూ ఉంటాయి. ప్రసిద్ధ సిక్కు గురువు ప్రొఫెసర్ కృపాల్ సింగ్ బాదుంగర్ ఎస్.జి.పి.సి అధ్యక్షునిగా ఉన్న సమయంలో తఖ్త్ శ్రీ దమ్‌దమా సాహిబ్ వద్ద ఈ కేలండరును స్వీకరించాడు.[4] దీనిని పాల్ సింగ్ పూరేవాల్ రూపొందించాడు. ఇది శక కాలెండరు స్థానంలో వచ్చి 2003 నుండి వాడకంలో ఉన్నది. ఈ కాలెండరు యొక్క శకం మొదటి సిక్కుల గురువైన గురు నానక్ దేవ్ జన్మసంవత్సరమైన 1469 నుండి ప్రారంభమౌతుంది. ప్రతీ సంవత్సరం గ్రెగోరియన్ కాలెండరు ప్రకారం మార్చి 14 న మొదలౌతుంది.[4] ఈ కాలెండరును ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం గురుద్వారాలలో స్వీకరించారు. సిక్కుల సనాతన శాఖలలో ఈ కాలెండరు గూర్చి వివాదాలున్నాయి.[5] కొన్ని సనాతన సిక్కు శాఖలు దీనిని అంగీకరించడం లేదు.
ఈ కాలెండరు యొక్క ముఖ్యమైన లక్షణాలు:
- సౌర సంవత్సరాన్ని వాడుతుంది.
- గురునానక్ పేరు మీదుగా నానక్‌షాహి కాలెండరు అని పిలుస్తారు.
- గురునానక్ జన్మ సంవత్సరం (1469 CE) ఈ క్యాలెండరులో మొదటి సంవత్సరం. ఉదాహరణకు, ఏప్రిల్ 2014 CE అనగా నానక్‌షాహి 546.
- పశ్చిమ కాలెండరు వలెనే సంవత్సరం నిడివి ఒకే విధంగా ఉంటుంది. (365 రోజుల 5 గంటల 48 నిమిషాల 45 సెకండ్లు)
- ఐదు నెలల్లో నెలకు 31 రోజులు ఉంటాయి, తరువాతి ఏడు నెలల్లో నెలకు 30 రోజులు ఉంటాయి.
- ప్రతీ నాలుగు సంవత్సరాలకు లీపు సంవత్సరం వస్తుంది. ఆ ఏడు చివరి నెలైన ఫాల్గున మాసంలో ఒక రోజు ఎక్కువ వస్తుంది.
- 2003 లో అకల్ తఖ్త్ దీన్ని అమోదించింది. [6]
నెలలు
మార్చునానక్షాహి కేలండరులో నెలల వివరాలు: [4][7]
నెం. | పేరు | పంజాబీ | రోజులు | గ్రెగారియన్ నెకలు |
---|---|---|---|---|
1 | చెత్ | ਚੇਤ | 31 | 14 మార్చి – 13 ఏప్రిల్ |
2 | వైశాఖ్ | ਵੈਸਾਖ | 31 | 14 ఏప్రిల్ – 14 మే |
3 | జెత్ | ਜੇਠ | 31 | 15 మే – 14 జూన్ |
4 | హర్ | ਹਾੜ | 31 | 15 జూన్ – 15 జూలై |
5 | సావన్ | ਸਾਵਣ | 31 | 16 జూలై – 15 ఆగస్టు |
6 | భాడన్ | ਭਾਦੋਂ | 30 | 16 ఆగస్టు – 14 సెప్టెంబరు |
7 | ఆస్సు | ਅੱਸੂ | 30 | 15 సెప్టెంబరు – 14 అక్టోబరు |
8 | కటక్ | ਕੱਤਕ | 30 | 15 అక్టోబరు – 13 నవంబరు |
9 | మఘర్ | ਮੱਘਰ | 30 | 14 నవంబరు – 13 డిసెంబరు |
10 | పోహ్ | ਪੋਹ | 30 | 14 డిసెంబరు – 12 జనవరి |
11 | మాఘ్ | ਮਾਘ | 30 | 13 జనవరి – 11 ఫిబ్రవరి |
12 | ఫాగున్ | ਫੱਗਣ | 30/31 | 12 ఫిబ్రవరి – 13 మార్చి |
ముఖ్యమైన సంఘటనలు | నానాక్‌షాహి తేదీ | గ్రెగోరియన్ తేదీ |
---|---|---|
గురుగోవింద సింగ్ జన్మదినం, పదవ సిక్కు గురువు | 23 పోహ్ | 5 జనవరి |
గురు హర్ రాయి జన్మదినం, ఏడవ సిక్కుగురు | 19 మాఘ్ | 31 జనవరి |
గురు హర రాయ్ ఏడవ గురువుగా వచ్చిన రోజు నానాక్షహి కేలండరు కొత్త సంవత్సరం. హోలా మొహల్లా పండగ |
1 చెత్ | 14 మార్చి |
గురు హర్‌గోవింద, ఆరవ సిక్కు గురువు మరణం. | 6 చెత్ | 19 మార్చి |
ఖల్సా యొక్క సమన్వయం. గురునానక్ జన్మదినం |
1 వైశాఖ్ | 14 ఏప్రిల్ |
గురు అంగద్, రెండవ సిక్కు గురువు సృష్టికర్త తిరిగి విలీనం | 3 వైశాఖ్ | 16 ఏప్రిల్ |
గురు అమరదాస్ మూడవ సిక్కు గురువుగా స్వీకారం. | 3 వైశాఖ్ | 16 ఏప్రిల్ |
గురు హర్‌కిషన్, ఎనిమిదవ సిక్కు గురువు మరణం. | 3 వైశాఖ్ | 16 ఏప్రిల్ |
గురు తేఘ్ బహదూర్ తొమ్మిదవ సిక్కు గురువుగా స్వీకారం. | 3 వైశాఖ్ | 16 ఏప్రిల్ |
గురు అంగద్ జన్మదినం, రెండవ సిక్కు గురువు. | 5 వైశాఖ్ | 18 ఏప్రిల్ |
గురు తేఘ్ బహదూర్ జన్మదినం, తొమ్మిదవ సిక్కు గురువు. | 5 వైశాఖ్ | 18 ఏప్రిల్ |
గురు అర్జన్ జన్మదినం, ఐదవ సిక్కు గురువు. | 19 వైశాఖ్ | 2 మే |
గురు అమరదాస్ జన్మదినం, మూడవ సిక్కుగురువు. | 9 జెత్ | 23 మే |
గురు హరగోవింద సిక్కుల ఆరవ సిక్కు గురువుగా స్వీకారం. | 28 జెత్ | 11 జూన్ |
గురు అర్జన్ , ఐదవ సిక్కు గురువు లాహోర్లో వీరమరణం | 2 హర్ | 16 జూన్ |
గురు హరగోవింద సింగ్, ఆరవ సిక్కు గురువు జన్మదినం. | 21 హర్ | 5 జూలై |
గురు గోవింద సాహిబ్ | 6 సావన్ | 21 జూలై |
గురు హర్ కిషన్ సాహిబ్ | 8 సావన్ | 23 జూలై |
గురు గ్రంథ్ సాహిబ్, సిక్కు మతగ్రంథం, స్వర్ణ దేవాలయంలో మొదటిసారి ఉంచారు. | 17 భడోన్ | 1 సెప్టెంబరు |
గురు అమర్ దాస్ , మూడవ సిక్కు గురువు మరణం. | 2 అస్సు | 16 సెప్టెంబరు |
గురు రామ దాస్, నాల్గవ సిక్కు గురువు స్వీకారం. | 2 అస్సు | 16 సెప్టెంబరు |
గురు రామదాస్, నాల్గవ సిక్కు గురువు మరణం. | 2 అస్సు | 16 సెప్టెంబరు |
గురు అర్జన్ ఐదవ సిక్కు గురువుగా ప్రమాణం. | 2 అస్సు | 16 సెప్టెంబరు |
గురు అంగద్ రెండవ సిక్కు గురువుగా ప్రమాణం. | 4 అస్సు | 18 సెప్టెంబరు |
గురు నానక్, మొదటి సిక్కు గురువు మరణం. | 8 అస్సు | 22 సెప్టెంబరు |
గురు రామదాస్ ,నాల్గవ సిక్కు గురువు జననం. | 25 అస్సు | 9 అక్టోబరు |
గురు హర్ రాయి, ఏడవ సిక్కు గురువు మరణం. | 6 కటక్ | 20 అక్టోబరు |
గురు హర్‌కిషన్ ఐదవ సిక్కు గురువుతా స్వీకారం. | 6 కటక్ | 20 అక్టోబరు |
సిక్కు గ్రంథం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రకటించారు. | 6 కటక్ | 20 అక్టోబరు |
గురు గోవింద సింగ్, పదవ సిక్కు గురువు మరణం | 7 కటక్ | 21 అక్టోబరు |
గురు గోవింద సింగ్ పదవ సిక్కు గురువుగా స్వీకారం | 11 మఘర్ | 24 నవంబరు |
గురు తేజ్ బహాదూర్ ఢిల్లీలో బలి. | 11 మఘర్ | 24 నవంబరు |
గురు గోవింద్ సింగ్ కుమారులు అజిత్ సింగ్, జుఝార్ సింగ్ ల బలి | 8 పోహ్ | 21 డిసెంబరు |
గురు గోవిద సింగ్ కుమారులు జోరావర్ సింగ్, ఫతేహ్ సింగ్ లను సిర్హింద్‌లో వధించారు | 13 పోహ్ | 26 డిసెంబరు |
ఇవి కూడా చూడండి.
మార్చుమూలాలు
మార్చు- ↑ Louis E. Fenech, W. H. McLeod (2014) Historical Dictionary of Sikhism. Rowman & Littlefield [1]
- ↑ Knut A. Jacobsen (2008) South Asian Religions on Display: Religious Processions in South Asia and in the Diaspora. Routledge [2]
- ↑ Nesbitt, Eleanor (2016) Sikhism: A Very Short Introduction. Oxford University Press [3]
- ↑ 4.0 4.1 4.2 "What is the Sikh Nanakshahi calendar". allaboutsikhs.com. Archived from the original on 2008-05-10. Retrieved 2016-07-31.
- ↑ "Nanakshahi Calendar at BBC". BBC. 2003-07-29. Retrieved 2008-05-09.
- ↑ Parkash, Chander (14 March 2003). "Nanakshahi calendar out". www.tribuneindia.com. The Tribune. Retrieved 13 March 2018.
- ↑ Gurbani And Nanakshahi Calendar Nanakshahi Sangrand Dates in Gregorian Calendar - Forever from 14 మార్చి 2003 CE / 535 NS
ఇతర లింకులు
మార్చు- Nanakshahi.net, website of Mr. Pal Singh Purewal, the creator of the Nanakshahi Calendar, this site contains detailed articles about this calendar
- Nanakshahi Calendar at SGPC.net
- Nanakshahi Calendar at BBC
- Gurpurab Nanakshahi Calendar
- Nanakshahi Calendar (JavaScript)
- Nanakshahi Day with Holidays and API Archived 2016-05-03 at the Wayback Machine