బిక్రమి కాలెండర్

బిక్రమి, లేదా దేశీ యియర్స్ లేదా పంజాబీ మహెనె క్రీస్తు పూర్వం 57 లో పరిపాలించిన విక్రమాదిత్యుని తరువాత ప్రారంభించబడినవి. ఈ కాలెండరులో రెండు అంశాలైన చాంద్రమాన, సౌరమానాలున్నాయి. ఈ కాలెండరు చాంద్రమాన నెల అయిన చెతర్ నుండి ప్రారంభమవుతుంది. అనగ్గా మార్చి నుండి ప్రారంభమవుతుంది లేదా వసంతకాలం ప్రారంభంతో ప్రారంభమై 365 రోజుల వరకు ఉంటుంది. భారతదేశంలోని అనేక రాష్ట్రాల కాలెండర్లలో చెతర్ (చైత్రం) తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. సింధ్, కేరళ వంటి ప్రాంతాలలొ చెతర్ తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

Two illustrated portions of a manuscript
జైన సన్యాసి కళకాచార్య, శక రాజు (కళకార్చ్య కథ మాన్యుస్క్రిప్ట్, చత్రపతి శివాజీ సంగ్రహాలయం, ముంబై)

సౌరమానం ప్రకారం వైశాఖ్ నెల ఏప్రిల్ లో ప్రారంభమవుతుంది. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో కాలెండర్లు సౌరమానంతో మొదటి నెలతో ప్రారంభమవుతాయి. పంజాబ్‌లో వైశాఖి నెల యొక్క మొదటి రోజుతో కాలెండరు ప్రారంభమవుతుంది. బెంగాల్‌లో ప్రారంభ దినం పొహలా బోషఖ్ (కొత్త సంవత్సరం) గా పిలువబడుతుంది.

సౌర మాసాలలో తొమ్మిది 30 రోజులతోనూ, ఒకటి 31 (వైశాఖ్), యితర రెండు (జెత్, ఆషాఢ) 32 రోజులతోనూ కూడుకొని ఉంటాయి. ఈ కాలెండరు పంజాబ్‌లో సాంప్రదాయకంగా వాడబడుతుంది. (భారతదేశం, పాకిస్తాన్‌లలోని పంజాబ్ ప్రాంతాలు). తరువాత ఇస్లామిక్ కాలెండరు, ననాక్షహి కాలెండరు అంరియు గ్రెగారియన్ కాలెండరుగా మార్పులు వచ్చాయి.[1]

సౌర కాలెండరు మార్చు

ఎ దిగువ ఉన్న కాలెండరు సౌర మాసమైన వైశాఖ్ నుండి ప్రారంభమవుతుంది. ఈ నెలల పేర్లు ఈ క్రింది విధంగా ఉంటాయి.

వ.సం సౌరమాసం పేరు కాలం
1. వైశాఖ్ (బెసాఖ్) ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు
2. జెత్ మే మధ్య నుండి జూన్ మధ్య వరకు
3. హర్ జూన్ మధ్య నుండి జూలై మధ్య వరకు
4. సావన్ జూలై మధ్య నుండి ఆగస్టు మధ్య వరకు
5. భదాన్ ఆగస్టు మధ్య నుండి సెప్టెంబరు మధ్య వరకు
6. అసూజ్ సెప్టెంబరు మధ్య నుండి అక్టోబరు మధ్య వరకు
7. కట్టెక్ అక్టోబరు మధ్య నుండి నవంబరు మధ్య వరకు
8. మఘర్ నవంబరు మధ్య నుండి డిసెంబరు మధ్య వరకు
9. పోహ్ డిసెంబరు మధ్య నుండి జనవరి మధ్య వరకు
10. మాఘ్ జనవరి మధ్య నుండి ఫిబ్రవరి మధ్య వరకు
11. ఫాగ్గన్ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు
12. చెతర్ మార్చి మధ్య నుండి ఏప్రిల్ మధ్య వరకు

ప్రతి రూజూ 8 పెహిర్/పహార్ లను కలిగి ఉంటుంది. ప్రతీ పహార్ 3 గంటల కాలం ఉంటుంది. ఈ పహార్లను ఈ క్రింది విధంగా పిలుస్తారు.

1: సాజర్ వేలా లేదా స్వెర్ వేలా =ఉదయం/డే బ్రేక్ (6'o clock to 9'o clock).

2: ధమ్మీ వేళ = మధ్యాహ్నం కన్నా ముందు (9'o clock to 12'o clock).

3: పైషీ వేళ = మధ్యాహ్నం (12'o clock to 3'o clock).

4: దీగర్ వేళ = సాయంత్రం (3'o clock to 6'o clock).

5: నిమషీన్ / నమషన్ వేల = సూర్యాస్తమయం + సాయంత్రం + రాత్రిలో మొదటి భాగం(6'o clock to 9'o clock).

6: కుఫ్తాన్ వేల = అర్థరాత్రికి ముందు సమయం (9'o clock to 12'o clock).

7: అధ్ రాత్ వేల = అర్థ రాత్రి నుండి 3 గంటలు (12'o clock to 3'o clock).

8: సార్ఘీ వేల = సూర్యోదయం కన్నా ముందు (3'o clock to 6'o clock).

వేల అనే పదం "వైలా" గా పిలువబడుతుంది. అనగా "రోజులో కొంత కాలం" అని అర్థం.

చాద్రమాన కాలెండరు మార్చు

ఈ క్రింద 2014/2015 సంవత్సరముల చంద్ర కాలెండరు సూచించబడినది. పౌర్ణమికి ఒక రోజు తరువాత చాంద్రమాన నెల ప్రారంభమవుతుంది.[2] (పంజాబీ కాలెండరు ప్రకారం).[3] అయినప్పటికీ లూనార్ సంవత్సరం పౌర్ణమి కి ఒకరోజు తరువాత ప్రారంభమవుతుంది. ఈ నెల చెతర్ తో ప్రారంభమవుతుంది.

వ.సం చాంద్ర మాసంపేరు తేదీ
1. చెతర్ 17 మార్చి 2014
2. విశాఖ్ 16 ఏప్రిల్ 2014
3. జెత్ 15 మే 2014
4. హర్ 14 జూన్ 2014
5. సావన్ 13 జూలై 2014
6. భదోన్ 11 ఆగస్టు 2014
7. అసూజ్ 10 సెప్టెంబరు 2014
8. కట్టెక్ 9 అక్టోబరు 2014
9. మఘర్ 7 నవంబరు 2014
10. పోహ్ 7 డిసెంబరు 2014
11. మాఘ్ 6 జనవరి 2015
12. ఫగ్గన్ 4 ఫిబ్రవరి 2015

చాంద్ర సంవత్సరంలో 12 నెలలుంటాయి. రెండు పక్షాలుంటాయి. ఈ రోజులను "టిధిస్" అని పిలుస్తారు. ప్రతీ నెల 30 టిధిస్ లుగా ఉంటుంది. టిధిస్ అనగా 20-27 గంటల కాలం ఉంటుంది. చంద్ర కళలను బట్టి తిథులను "శుక్ల" లేదా కళల దశలు గా పిలుస్తారు. అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని కృష్ణ పక్షమనీ, తరువాత పౌర్ణమి వరకు ఉన్న పక్షాన్ని శుక్ల పక్షమని పిలుస్తారు.[4][5]

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "NanakShahi Calendar Controversy". Archived from the original on 2007-09-28. Retrieved 2016-07-31.
  2. http://moongiant.com/Full_Moon_New_Moon_Calendar.php
  3. http://www.drikpanchang.com/faq/faq-ans8.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-06. Retrieved 2016-07-31.
  5. Mughal, Muhammad Aurang Zeb (2014-10-20). "Calendars Tell History: Social Rhythm and Social Change in Rural Pakistan". History and Anthropology. 25 (5): 592–613. doi:10.1080/02757206.2014.930034. ISSN 0275-7206.