1926, అక్టోబర్ 27న గుజరాత్ లోని బరోడాలో జన్మించిన నానా జోషి (Padmanabh Govind "Nana" Joshi) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు ప్రధానంగా వికెట్ కీపర్ బాధ్యతలను నిర్వహించాడు. 1951-52లో తన తొలి టెస్టును ఢిల్లీలో ఇంగ్లాండుపై ఆడి తొలి ఇన్నింగ్సులోనే 2 క్యాచ్‌లు, 2 స్టంపింగులతో నలుగురిని పెవిలియన్ పంపించాడు. 1952-53లో వెస్ట్‌ఇండీస్ పై 4 టెస్టులు, ఇంగ్లాండుపై 3 టెస్టులు ఆడినాడు. 1957-58లో ఒకే ఇన్నింగ్సులో ప్రత్యర్థికి చెందిన మొత్తం 10 వికెట్లను పడగొట్టడంలో తన సహకారాన్ని అందించాడు.[1]. 1960 డిసెంబర్లో పాకిస్తాన్ పై చివరి టెస్ట్ ఆడినాడు. 1987, జనవరి 8న నానా జోషి మరణించాడు.

Nana Joshi
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి Right-hand bat (RHB)
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు Indian
కెరీర్ గణాంకాలు
పోటీ Tests First-class
మ్యాచులు 12 78
చేసిన పరుగులు 207 1,710
బ్యాటింగ్ సరాసరి 10.89 16.93
100s/50s 0/1 1/8
అత్యధిక స్కోరు 52* 100*
బౌలింగ్ చేసిన బంతులు - 6
వికెట్లు - 0
బౌలింగ్ సరాసరి - -
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు - 0
మ్యాచ్ లో 10 వికెట్లు - 0
ఉత్తమ బౌలింగ్ - -
క్యాచులు/స్టంపులు 18/9 120/61
Source: [1],

టెస్ట్ క్రికెట్ గణాంకాలుసవరించు

జోషి 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 18 క్యాచ్‌లు, 9 స్టంపింగులతో 27 బ్యాట్స్‌మెన్లను ఔట్ చేశాడు. బ్యాటింగ్‌లో 207 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక స్కోరు 52 నాటౌట్.

ఫస్ట్ క్లాస్ క్రికెట్గణాంకాలుసవరించు

నానా జోషి 120 ఫస్ట్ క్లాస్ పోటీలు ఆడి 120 క్యాచ్‌లు, 61 స్టంపింగులు సాధించాడు. 16.93 సగటుతో 1710 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 100 నాటౌట్.

మూలాలుసవరించు

  1. Obituary in Indian Cricket 1987. It would be interesting to know whether these were all wicket-keeping dismissals because Wisden 2006 lists only one instance in minor cricket of a wicket-keeper having a hand (through catches and stumpings) in all 10 dismissals in an innings

ఇతర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నానా_జోషి&oldid=3184217" నుండి వెలికితీశారు