నారాయణం నరసింహ మూర్తి

ఎన్ ఎన్ మూర్తి అని ప్రముఖంగా పిలువబడే ఆయన పూర్తి పేరు నారాయణం నరసింహ మూర్తి. అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఓ ప్రముఖ పర్యవరణ వేత్త. ఆయన పర్యావరణ కవితోద్యమం అనే ఉద్యమాన్ని తెలుగు నాట 2008 లో ప్రారంభించారు. ఆయన జాగృతీ కిరణ్ ఫౌండేషన్ అనే సంస్థను నాగపూర్లో 1993 లో స్థాపించాడు. ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది [ఆధారం చూపాలి]. ఈ సంస్థ ద్వారా ఆంధ్ర ప్రదేశ్లో తెలుగు సాహిత్య, సామాజిక వికాసానికి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు.

నారాయణం నరసింహ మూర్తి
నారాయణం నరసింహ మూర్తి
జననంనారాయణం నరసింహ మూర్తి
1964, మే 02
నరసరావుపేట ,ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంనాగపూర్
ఇతర పేర్లుఎన్ ఎన్ మూర్తి
వృత్తినాణ్యత, పర్యావరణ నిపుణుడు, కవి పండితుడు
ప్రసిద్ధి"విద్యావాచస్పతి" డాక్టర్ ఎన్ ఎన్ మూర్తి
మతంహిందు
భార్య / భర్తశ్రీవాణి
పిల్లలుకేశవ శ్రీనివాస జాగృత్
తండ్రిశ్రీనివాసాచార్యులు
తల్లిపారుజాతలక్ష్మి

కుటుంబం

మార్చు

ఆయన 1964 లో గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణంలో నారాయణం శ్రీనివాసులు, పారిజాత లక్ష్మి దంపతులకు మొదటి పుత్రుడుగా జన్మించాడు. .

జీవిత ప్రస్థానం

మార్చు

విద్యావిజయాలు

మార్చు

ఆయన అనేక డిగ్రీలు సంపాదించాడు. 29 డిగ్రీలు 21 విశ్వవిద్యాలయాల నుండి సాధించి 2008 సంవత్సరంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్[2] లో స్థానం సంపాదించాడు.

ప్రత్యేక విజయాలు

మార్చు

ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం:2011 సంవత్సరం జూన్ లో థాయిలాండ్ లోని బాంగ్కాక్ నగరంలో ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్) లో ప్రత్యేక ప్రసంగికుడిగా ఆహ్వానము పొంది ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడము సాధారణమైన విషయము కాదు. ఒక మేధావి, విద్యావేత్త, ప్రాధ్యాపకునికి జీవితంలో ఎంతోమంది కోరుకునేది కానీ సాధ్యపడేది కాదు. దీనికి అకుంఠిత దీక్ష, పట్టుదల, ఎంతో విషయం పరిజ్ఞానం, అనేక విషయాలమీద అవగాహన, అంతర్జాతీయ ఖ్యాతి, గుర్తింపు అవసరం. అట్లాంటి వ్యక్తులకే ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడానికి అవకాశం ఇస్తారు. ఇది ప్రపంచంలోనే అతి కొద్దీ మందికి వచ్చే ఒక అరుదైన అవకాశం. 

రష్యా పర్యటన :

2015 లో ఆయన రష్యాలో పర్యటించారు. 

సెరిబియ పర్యటన :

2015 లో ఆయన సెరిబియ (ఒకప్పటి యుగోస్లోవియాలో భాగము) లో పర్యటించారు. ప్రపంచ జీవవైవిధ్య కాంగ్రెసులో ప్రసంగించడానికి సెరిబియ వెళ్లారు. 

విదేశీ పర్యటనలు

మార్చు

అనేక దేశాలు పర్యటించాడు. వివిధ దేశాలకు దాదాపు 70 సార్లు : బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, దక్షిణ ఆఫ్రికా, దుబాయ్, షార్జాహ్, అబూదాబి, కతార్, బహరైన్, కువైట్, ఇరాన్, ఆస్ట్రియా, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, లెగజంబర్గ్, థాయిలాండ్, చైనా, కొరియా, టర్కీ, ఇస్రాఇల్, పాలస్తీనా మొదలైన దేశాలు పర్యటించాడు. మయన్మార్, కొన్ని దేశాలు పలుమార్లు వెళ్ళాడు.

దేశవిదేశాలలో ఉపన్యాసాలు

మార్చు

ఆయన 2004లో జర్మనీలో పర్యటించాడు. జర్మనీలో దాదాపు 4000 కి.మీ ప్రయాణించాడు.

సావరిన్ ఆర్డర్ ఆఫ్ నైట్స్ ఆఫ్ జస్టిస్ అనే సంస్ఠ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్, దేశభక్తి అనే అంశం పై ముఖ్య ఉపన్యాసం వెలువరించాడు. ఈ సదస్సు బ్లాక్ ఫారెస్ట్ లోని ఒక రాజభవనంలో జరిగింది.

ఆయన 2005 లో ఆస్ట్రియాలో పర్యటించాడు. అక్కడ సెల్జ్బర్గ్ రాష్ట్ర గవర్నరు ఆహ్వానం మీద, ప్లేజ్ అనే సంస్ఠ ఆస్ట్రీయా లోని సెల్జ్బర్గ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన "అణుఇంధనం ప్రపంచ భవిష్యత్తు" అనే అంశం పై ముఖ్య ఉపన్యాసం వెలువరించారు. ఈ ఉపన్యాసం ఆయనకు ఎంతో పేరు తెచ్చింది,[1] [2]

ఆయన 2009 లో నెదర్లాండ్స్ లో పర్యటించాడు. నెదర్లాండ్స్ ప్రభుత్వం ఆహ్వానం మీద ఝీలాండ్ రాష్ట్రంలో వైస్ (WISE) అనే సంస్థ నెదర్లాండ్స్ ప్రభుత్వంతో కలసి నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన భారతదేశ ఇంధన అవసరాలు, దేశ భవిష్యత్ అనే అంశం పై ముఖ్య ఉపన్యాసం వెలువరించాడు.[3] ఈ ఉపన్యాసం నెదర్లాండ్స్ టివిలో ప్రసారం అయింది.

ఇదే సదస్సులొ ఆయన పర్యావరణ కవితోద్యమం గురించి కూడా ఓ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చాడు. ఈ ఉపన్యాసం అందరిని ఆకర్షించింది. ఈ ఉపన్యాసం తర్వాత పర్యావరణ కవితోద్యమం పై ఆయన ఇంటర్వ్యూ DW Radio వారు రికార్డు చేసి ప్రసారం చేసారు.

ప్రముఖులతో

మార్చు

ఆయన ఉమెన్ ఇన్ మ్యానెజ్మెంట్ అనే పుస్తకాన్ని మరు ఇద్దరితో కలసి వ్రాసారు. దానిని కువైట్ రాజవనిత షీఖా ఆమ్తల్ అల్ల్ సభాకు అంకితం ఇచ్చారు. ఈ పుస్తకావిష్కరణ సభ కువైట్‌లో 2007 సంవత్సరం జనవరిలో గొప్పగా జరిగంది. దీనికి అమెరికా రాయబారి, కువైట్ మంత్రులు దేశవిదేశాల నండి అనేక మంది ప్రముఖులు వచ్చారు. ఈ సభలో ఆయనను కువైట్ రాజవనిత షీఖా ఆమ్తల్ అల్ల్ సభా ఘనంగా సత్కరించారు. ఈ వార్త కువైట్ వార్తాపత్రికలలో ప్రముఖంగా వచ్చింది.

రచనలు / పుస్తకాలు

మార్చు

1.నేను కవితాసంపుటిని 1996 లో వెలువరించారు. ఇది ఆయన మనోభావాల మానసపుత్రిక. దీనికి 1998 లో కలకత్తా వారి మైఖేల్ మధుసూదన్ అవార్డ్ లభించింది.

2. Curriculum Vitae International అనే పెద్ద గ్రంథానికి సంపాదకత్వం వహించి, ముద్రించి 1997 సంవత్సరంలో వెలువరించారు.

3. World’s Who’s Who Men & Women of Distinction అనే పెద్ద గ్రంథానికి సంపాదకత్వం వహించి, ముద్రించి 2000 సంవత్సరంలో వెలువరించారు.

4. Indian Managers-Winning at Crossroads అనే మేనేజ్‌మెంట్ పుస్తకానికి సహరచయిత.

5. Women in Management అనే మేనేజ్‌మెంట్ పుస్తకానికి సహరచయిత.

6. Women Managers in 21 Century అనే మేనేజ్‌మెంట్ పుస్తకానికి సహరచయిత.

7. Environmental Management అనే పుస్తకాన్ని రచించారు.

సత్కారాలు

మార్చు

జాతీయ పురస్కారాలు

మార్చు

1. ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) వారు 1991 సంవత్సరంలో నిర్వహించిన జాతీయస్థాయి పొటీలో ఆయన వ్రాసిన టెక్నికల్ పేపరుకు జాతీయస్థాయి బంగారు పతకం లభించింది. ఈ టెక్నికల్ పేపరును అనేక విశ్వవిద్యాలయాలు నాడు ప్రమాణంగా స్వీకరించాయి.

2. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎక్జిక్యూటివ్స్ అనే సంస్థ 1993 లో సమాజశ్రీ పురస్కరాన్నిచ్చి సత్కరించింది. ఈ పురస్కారం ఆయన మహారాష్ట్ర గవర్నరు నుండి అందుకున్నారు.

అంతర్జాతీయ పురస్కారాలు

మార్చు
 1. ఇంగ్లడ్ లోని సావరిన్ ఆర్డర్ ఆఫ్ నైట్స్ ఆఫ్ జస్టిస్ వారు ఆయన విద్యారంగంలో సాధించిన విజయాలకు, సేవలకు నైట్ ఆఫ్ జస్టిస్ను 2004 సంవత్సరంలో జర్మనీ లోని బ్లాక్ ఫారెస్ట్ లో ఒక రాజభవనంలో ప్రధానం చేశారు.
 2. అల్బర్ట్ స్ఛ్వెట్జర్ ఇంటనేషనల్ యునివర్సిటి, స్పెయిన్ ఆయన పర్యావరణానికి చేసిన విశిష్ట సేవలకు అల్బర్ట్ స్ఛ్వెట్జర్ మెడల్ ఫర్ సైన్స్ అండ్ పీస్ను 2005 సంవత్సరంలో ఇచ్చి గౌరవించింది.

ప్రత్యేక గుర్తింపు

మార్చు
 1. ఆయన పర్యావరణానికి చేసిన సేవలను గుర్తించి 2003 సంవత్సరంలో యునెస్కో ఆయనను మెసెంజర్ ఫర్ కల్చర్ ఆఫ్ పీస్ [4] అంటే "సంస్కృతి ద్వారా శాంతి సందేశకుడు"గా నియమించింది. ఇది చెప్పుకోదగ్గ గుర్తింపు. భారతదేశంలో అతి కొద్ది మందికి ఈ గుర్తింపు లభించింది.
 2. ఆయన సేవలను గుర్తించి అమెరికా లోని కెంటక్కి రాష్ట్ర గవర్నర్ ఆయనను 2007 సంవత్సరంలో గౌరవ కెంటక్కి కల్నల్ [5][6] గా నియమించాడు. ఇది గొప్ప గౌరవం. భారతదేశంలోనే ఒకరిద్దరికి ఈ గౌరవం లభించింది.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-21. Retrieved 2010-06-01.
 2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-07. Retrieved 2010-06-01.
 3. [1]
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-02-05. Retrieved 2010-06-01.
 5. http://www.kycolonels.org
 6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-01-03. Retrieved 2010-06-01.
 • ద హిందూ దిన పత్రిక:అధికారిక వెబ్సైటు నుండి Award for Environmentalist [3][permanent dead link] వార్తా కథనం Jan 12, 2006న సేకరించబడింది.
 • DW Radio అధికారిక వెబ్సైటు నుండి [4] వార్తా కథనం 2009 ఆగస్టు 19న సేకరించబడింది.
 • WISE అధికారిక వెబ్సైటు నుండి [5] వార్తా కథనం 2009 ఆగస్టు 19న సేకరించబడింది.
 • విద్యావాచస్పతి

వివరణ—విక్రమశీల హింది విద్యాపీఠం, గాంధీనగర్, బిహార్ ప్రధానం చేసింది. పిహెడికి సమానమయిన గౌరవ డిగ్రీ. ఆధారం-- మల్లెతీగ మాసపత్రిక జూన్ 2008 సంచిక లొ ప్రచురించిన వ్యాసం

 • విద్యాసాగర్

వివరణ—విక్రమశీల హింది విద్యాపీఠం, గాంధీనగర్, బిహార్ ప్రధానం చేసింది. డిలిట్ కి సమానమయిన గౌరవ డిగ్రీ. ఆధారం-- మల్లెతీగ మాసపత్రిక జూన్ 2008 సంచిక లొ ప్రచురించిన వ్యాసం

 • సరస్వతీపుత్ర

వివరణ—జంధ్యాల చారిటబుల్ ట్రస్ట్, ఏలూరు వారు 2008లొ ప్రధానం చేసారు. ఇది బిరుదు. 29 దిగీలు 21 విశ్వవిద్యాలయాలనుండి 29 డిగ్రీలు సాధించి 2008లొ లింకా బుక్ లొ ఎక్కిన సందర్భాన, గౌరవంగా ప్రధానం చేసిన బిరుదు. ఆధారం-- ఆంధ్రజ్యొతి దినపత్రిక మే 30 సంచిక లొ ప్రచురించిన వార్త.