నారాయణ స్వామి (క్రికెటరు)

వెంకట్రామన్ నారాయణ స్వామి (1924 మే 23 - 1983 మే 1) భారతీయ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.

నారాయణ స్వామి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వెంకటరామన్ నారాయణ స్వామి
పుట్టిన తేదీ(1924-05-23)1924 మే 23
కోజికోడ్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1983 మే 1(1983-05-01) (వయసు 58)
డెహ్రాడూన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 76)1955 నవంబరు 19 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 19
చేసిన పరుగులు 201
బ్యాటింగు సగటు 14.35
100లు/50లు 0/1
అత్యధిక స్కోరు 53
వేసిన బంతులు 108 2936
వికెట్లు 0 68
బౌలింగు సగటు 22.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 6/29
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 8/–
మూలం: [1]

1955/56లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో స్వామి తన తొలి టెస్టు ఆడాడు. అతను దత్తు ఫడ్కర్‌తో కలిసి బౌలింగు ప్రారంభించాడు. వికెట్లు తీయలేదు, బ్యాటింగు చేయలేదు. ఆ తరువాత జట్టు నుండి తీసేసారు. ఆ సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌లో భారత్ విభిన్న ఓపెనింగ్ బౌలింగ్ జోడీలను ప్రయత్నించింది. [1]

స్వామి తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఒక్కో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1951/52 నుండి 1958/59 వరకు రంజీ ట్రోఫీలో సర్వీసెస్ తరపున ఆడి, 19.98 సగటుతో 58 వికెట్లు తీసుకున్నాడు.

స్వామి మద్రాసులో చదువుకున్నాడు. 1944లో సైన్యంలో చేరి మేజర్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తర్వాత అతను నాసిక్ రోడ్ క్యాంప్‌లోని రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీ అసోసియేషను సిబ్బందిలో పనిచేసాడు. అతను కేరళలో జన్మించి టెస్టులు ఆడిన తొలి క్రికెటరు.

మూలాలు

మార్చు
  1. "New Zealand in Pakistan and India, 1955-56", Wisden 1957, pp. 813–28.
  • భారత క్రికెట్ 1983 లో సంస్మరణ