ప్రధాన మెనూను తెరువు

ఆరెంజ్ (సినిమా)

(ఆరెంజ్ నుండి దారిమార్పు చెందింది)

ఆరెంజ్ 2010 నవంబరు 26 న విడుదలైన తెలుగు ప్రేమకథా చిత్రము. ఇందులో రామ్ చరణ్ తేజ, జెనీలియా, షాజన్ పదంసీ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బొమ్మరిల్లు భాస్కర్. నిర్మాత కె నాగేంద్ర బాబు. హ్యారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చాడు.

ఆరెంజ్
TeluguFilm Orange.jpg
దర్శకత్వంభాస్కర్
నిర్మాతకొణిదల నాగేంద్రబాబు
రచనభాస్కర్
నటులురామ్ చరణ్ తేజ
వెన్నెల కిశోర్
జెనీలియా
షాజాన్ పదమ్సీ
సంచిత శెట్టి
ప్రభు
సంగీతంహేరిస్ జయరాజ్
ఛాయాగ్రహణంకిరణ్ రెడ్డి
బి. రాజశేఖర్
కూర్పుమార్తాండ్.కె.వెంకటేశ్
నిర్మాణ సంస్థ
పంపిణీదారుగీతా ఆర్ట్స్
విడుదల
26 నవంబరు 2010 (2010-11-26)
నిడివి
160 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు
ఖర్చుINR40 కోట్లు (U.4)[1]

కథసవరించు

ప్రేమికుల్లో ఒకరు ..అవతలి వారిపై తమ ఇష్టా ఇష్టాలు రుద్దేయటం కామన్ గా అందరి జీవితాల్లో జరిగే అంశమే.అయిగే మన జీవిత ఆనందాలని త్యాగం చేసి వారి ఇష్టాలని మన ఇష్టాలుగా మార్చుకోవటమా లేక అలాగే నీ ఇష్టమే నా ఇష్టం అని అబద్దమాడి రోజులు నెట్టడమా అనే పాయింట్ ఆధారం చేసుకునే బొమ్మరిల్లు భాస్కర్ ఆరెంజ్ కథ మొదలెట్టాడు.

ఆస్ట్రేలియా సిడ్నీలో ఉండే రామ్ (రాంచరణ్).. గోడలపై రకరకాల బొమ్మలు వేస్తుంటాడు (గ్రాఫిటీ ఆర్టిస్ట్). ఇది అతని హ్యాబీ. అసలు పని ఫోటోగ్రఫీ పేరుతో వయొలెంట్ ఫోటోగ్రఫీ నేర్చుకోవడం అంటే జియోగ్రఫీ ఛానల్‌లో మాదిరి వాటిని ఫోటోలు తీయడం, స్కైడైవింగ్ చేయడం చేస్తుంటాడు. రామ్ జీవితంలో భార్యాభర్తలైన కృష్ణ కుమార్తె మంజుల, సంజయ్‌‌లు అక్క బావలు. ఇంకా తన చుట్టూ ఇద్దరు స్నేహితులు.

ఇక రామ్‌ అందరూ ప్రేమలో పడటాన్ని చూసి మీది నిజమైన ప్రేమ కాదని వాదిస్తాడు. ప్రేమంటే నిజం చెప్పడం. అబద్ధంతో ప్రేమించినా అది జీవితాంతం ఉండదనే పాలసీ చెబుతాడు. ఎంతకాలం నిలబడితే అదే చాలు అంటాడు. అలా తొమ్మిది మంది రామ్‌ను ప్రేమించి విసిగి వదిలేస్తారు.

పదవ అమ్మాయిగా జాను (జెనీలియా) కెమెస్ట్రీ మూడో సంవత్సరం చదివేందుకు కో ఎడ్యుకేట్ కాలేజీలో చేరుతుంది. అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ప్రేమించుకోవడం జానుకు చాలా థ్రిల్ కలిగిస్తుంది. తను అలా ఎవరినైనా ప్రేమించాలనుకుని ముగ్గురిని ప్రపోజ్ చేస్తుంది.

కానీ మొదటిచూపులో జానును ప్రేమించిన రామ్ తను ప్రేమిస్తున్నానని చెబుతాడు. అయితే కొద్దికాలమేనని మతలబు పెడతాడు. అలా ఎందుకన్నానో కొన్ని ఉదాహరణలు చూపిస్తాడు. ఆఖరికి ప్రేమించి పెళ్ళిచేసుకున్న మీ తల్లిందండ్రులు కూడా ప్రస్తుతానికి ప్రేమించుకోవడం లేదని నిరూపిస్తాడు. తను ప్రేమించలేదని తెలిసినా జానును రామ్ ప్రేమిస్తున్నానని రకరకాల ప్రయత్నాలతో తనవైపు తిప్పుకుంటాడు. తీరా జాను ప్రేమించానన్నాక నేను జీవితంలో ప్రేమించలేదంటాడు.

ఇలా రామ్‌ను పిచ్చోడని డిసైడ్ అవుతారు. కానీ తను చెప్పినదాంట్లో న్యాయముందని జాను తండ్రి (ప్రభు) ఫైనల్‌గా అంచనాకు వస్తాడు. ఎవరైనా ప్రేమించిన కొత్తలో బాగానే ప్రేమించుకుంటారు. ఆ తర్వాత పిల్లలను ప్రేమిస్తారు. కానీ నిజమైన ప్రేమ తర్వాత ఉండదు. ప్రేమిస్తున్నట్లు ఒకరికొకరు అబద్ధాలు ఆడుకుంటారు.? దానికి ఏం చేయాలి? అనేది ముగింపు.

తారాగణంసవరించు

పాటలుసవరించు

Tracklist
క్రమసంఖ్య పేరుగీత రచనగాయకులు నిడివి
1. "సిడ్ని నగరం"  సురేంద్ర కృష్ణ , కేదార్నాథ్ పరిమికారుణ్య 5:38
2. "చిలిపిగా"  వనమాలికార్తిక్ 5:30
3. "నెను నువ్వంటు"  వనమాలినరేష్ అయ్యారు 4:51
4. "హలో రమ్మంటే"  రామజోగయ్య శాస్త్రివిజయ్ ప్రకాష్ 4:45
5. "ఓ'రేంజ్"  వనమాలిబెన్నీ దయాల్ 4:16
6. "రూబా రూబ"  వనమాలిశైల్ హద 5:18
18:52

ప్రీ -రిలీజ్ వ్యాపారంసవరించు

'ఆరెంజ్ ప్రీ -రిలీజ్ వ్యాపారం[2]
రెవెన్యూ (ప్రాంతాలు) ధర
సాటిలైట్ హక్కులు (మాటీవీ) 7 కోట్లు
నిజాం హక్కులు 12 కోట్లు
సీడెడ్ హక్కులు 7.2 కోట్లు
నెల్లూరు హక్కులు 1.5 కోట్లు
గుంటూరు హక్కులు 2.75 కోట్లు
కృష్ణా జిల్లా హక్కులు 5 కోట్లు
ఉత్తరాంధ్ర హక్కులు 3.3 కోట్లు
తూర్పు గోదావరి హక్కులు 2.6 కోట్లు
పశ్చిమ గోదావరి హక్కులు 2.5 కోట్లు
కర్నాటక హక్కులు 4.5 కోట్లు
ఓవర్సీస్ హక్కులు 2.5 కోట్లు
ఆడియో హక్కులు 1 కోటి
మొత్తం 50 కోట్లు
  • ప్రింట్ మీడియా మరియు టీ.వీ ప్రకటన ఖర్చులు మినహాయించి

పురస్కారాలుసవరించు

అవార్డు వర్గం నామినేషన్ ఫలితం
ఫిలింఫేర్ అవార్ద్శ్ సౌత్ ఉత్తమ సంగీత దర్శకుడు హేరిస్ జయరాజ్ ప్రతిపాదన
మిర్చి మ్యుజిక్ అవార్ద్శ్ సౌత్ బెస్ట్ ఆల్బం ఆఫ్ ది ఈయర్ హేరిస్ జయరాజ్ విజేత
మిర్చి మ్యుజిక్ అవార్ద్శ్ సౌత్ మిర్చి ప్రేక్షకుల ఎంపిక (బెస్ట్ ఆల్బం) హేరిస్ జయరాజ్ విజేత
బిగ్ ఎఫ్.ఎం.అవార్ద్శ్ ఉత్తమ సంగీత దర్శకుడు హేరిస్ జయరాజ్ విజేత
బిగ్ ఎఫ్.ఎం.అవార్ద్శ్ ఉత్తమ ప్లేబాక్ సింగర్ కారుణ్య విజేత

మూలాలుసవరించు