నిప్పుతో చెలగాటం
నిప్పుతో చెలగాటం 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయా మూవీస్ పతాకంపై వై.వి. రావు నిర్మాణ సారథ్యంలో కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, శారద, జయసుధ ముఖ్యపాత్రలలో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1] రాజ్ కుమార్, జితేంద్ర, మాలసిహ్నా, రేఖ నటీనటులుగా 1978లో హిందీలో విడుదలైన కర్మయోగి సినిమాకి రిమేక్ సినిమా ఇది.
నిప్పుతో చెలగాటం (1982 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కొమ్మినేని శేషగిరిరావు |
నిర్మాణం | వై.వి. రావు |
తారాగణం | కృష్ణంరాజు శారద జయసుధ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | విజయా మూవీస్ |
భాష | తెలుగు |
నటవర్గం సవరించు
- కృష్ణంరాజు (శంకర్/మోహన్-ద్విపాత్రిభినయం)
- శారద (దుర్గాదేవి)
- జయసుధ (రేఖ)
- శరత్ బాబు (రవి)
- గీత (రాధ)
- కవిత
- టి.ఎల్. కాంతారావు (రాధ తండ్రి);
- రావు గోపాలరావు (జగపతి)
- అల్లు రామలింగయ్య (గజపతి)
- విజయ్ చందర్ (చర్చి ఫాదర్)
- సారథి (పోలీస్ ఇన్సిపెక్టర్)
- బాలకృష్ణ (కానిస్టేబుల్)
- చిడతల అప్పారావు
సాంకేతికవర్గం సవరించు
- దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు
- నిర్మాణం: వై.వి. రావు
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- నిర్మాణ సంస్థ: విజయా మూవీస్
మూలాలు సవరించు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "నిప్పుతో చెలగాటం". Retrieved 3 March 2018.